STOCKS

News


మరో రెండేళ్లు ఐటీ రంగం జోరు

Friday 13th July 2018
Markets_main1531477475.png-18284

ముంబై: ప్రస్తుతం మార్కెట్‌ చాలా ఆసక్తికర దశలో ఉన్నట్లు వ్యాఖ్యానించిన ఎడెల్వీస్‌ సెక్యూరిటీస్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ వికాస్‌ ఖేమానీ.. బ్రెడ్త్‌ పరంగా బలహీనంగా ఉన్నప్పటికీ, నూతన గరిష్టస్థాయిలను నమోదుచేసే అవకాశం కనిపిస్తుందన్నారు. మార్కెట్‌ రికార్డ్‌ ర్యాలీతో కొనసాగడానికి కేవలం 10-12 షేర్లు మాత్రమే కారణం తప్పించి ఇది పూర్తి మార్కెట్‌ ర్యాలీ కాదని వ్యాఖ్యానించారు. గడిచిన ఏడాదికాలంగా ఈ షేర్లతోనే నిఫ్టీ 800-900 పాయింట్ల వరకు లాభపడిందన్నారు. వీటిలోని పలు కంపెనీలు గతకొద్ది కాలంగా నిలకడ వృద్ధిరేటును సాధిస్తుండగా.. టీసీఎస్‌ గడిచిన కొద్దికాలంలోనే 40 శాతం పెరిగినట్లు తెలిపారు. గడిచిన మూడు త్రైమాసికాలుగా ఈ కంపెనీలు సమంజసమైన ఎర్నింగ్స్‌ వృద్ధిరేటును నమోదుచేస్తున్నట్లు తెలిపారు. విడ్త్‌, బ్రెడ్త్‌ పరంగా తప్పిపోవడం తప్పేమీ కాదని వివరించిన ఆయన ఈ దశ కేవలం తాత్కాలికంగానే ఉంటుందని ఒక సంఖ్య మాత్రమే అని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున ఇటువంటి పరిస్థితి నెలకొందని వివరించారు. ద్రవ్యలభ్యత పరంగ సమస్య ఎదురవుతుండగా.. లార్జ్‌క్యాప్స్‌ లిక్విడిటీ పరంగా ఆకర్షణీయంగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ షేర్లు అత్యద్భుత ఫలితాలను ప్రకటిస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యి, ముడిచమురు ధరలు స్థిరపడి, అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి తొలగినప్పుడు మళ్లీ మార్కెట్‌లో విశ్వాసం నిండుతుందన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు మహాఅయితే నాణ్యమైన 15 షేర్లను మించి చూడడం లేదని, మ్యూచువల్‌ ఫండ్‌లు 8- 9 శాతం నగదు నిల్వలోనే ఉంటున్నాయని వివరించిన ఆయన ఎర్నింగ్స్‌ కారణంగా మార్కెట్‌లో విశ్వాసం పెరిగేందుకు అవకాశం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాలు అడ్డుపడతాయని వివరించారు. ముడిచమురు ధరలు పెరుగుతున్న కొద్ది ద్రవ్యోల్బణం పెరగడం, వడ్డీ రేట్ల అంశాలు వెంటాడుతూనే ఉండడం అనేది ప్రధాన అంశం కాగా.. రూపాయి మారకం విలువ, ఎన్నికల అంశాలు మార్కెట్‌ను అనిశ్చితి పరిస్థితుల్లో ఉంచుతున్నాయని వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ షేర్లు ఈ ర్యాలీలో లేవన్న ఆయన మొత్తంగా ఎర్నింగ్స్‌ వృద్ధిరేటు మాత్రమే గాడిలోనే ఉందన్నారు. కన్సూమర్‌, ఆటోమొబైల్‌ రంగాలు వృద్ధిరేటులో ఉన్నట్లు వివరించారు. వీటితో పాటు ఐటీ, ప్రైవేట్‌ బ్యాంక్‌, ఎన్‌బీఎఫ్‌సీ రంగాల కంపెనీలు మెరుగైన ఫలితాలను ప్రకటించనున్నాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఐటీ రంగంలో ఈ జోరు ఇంకొంత కాలం ఉంటుందన్నారు. మరో రెండేళ్ల వరకు వృద్ధి జోరును అంచనావేస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్‌ రంగ బ్యాంకుల పనితీరు బాగుందన్న ఆయన వచ్చే పదేళ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంకులు 18-20 శాతం వరకు రాబడిని ఇచ్చేందుకు అవకాశం ఉందని సూచించారు. ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ బ్యాంక్, బంధన్ బ్యాంకులు కూడా మెరుగైన పనితీరును ప్రదర్శిస్తున్నాయన్నారు. ఐషర్‌ మోటార్స్‌ ఖరీదుగా ఉన్నప్పటికీ రాబడిని ఇస్తూనే ఉంటుందని అంచనావేశారు. కెమికల్‌ కంపెనీల పరంగా ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను సూచిస్తున్నట్లు చెప్పారు. You may be interested

ఆల్‌టైమ్‌హైకి మారికో షేరు

Friday 13th July 2018

కొబ్బరి ధర పతనంతో జోరు శుక్రవారం ట్రేడింగ్‌లో మారికో కంపెనీ షేర్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని తాకాయి. దేశీయ మార్కెట్లో కోప్రా(కొబ్బరి) ధర భారీగా పతనం కావడంతో కంపెనీ కౌంటర్లో కొనుగోళ్లు జరిగాయి. దీంతో ఇంట్రాడేలో షేరు 366.20 రూపాయల గరిష్ఠాన్ని తాకింది. ఈ ఏడాది ఇప్పటివరకు ఈ షేరు సుమారు 20 శాతం మేర దూసుకుపోయింది. ప్యారాచూట్‌ బ్రాండ్‌నేమ్‌తో కొబ్బరినూనెను విక్రయిస్తున్న మారికోకు...కొబ్బరి ధర పతనంకావడం లబ్దిచేకూరుస్తుందనే అంచనాలతో ఈ షేరు ర్యాలీ

ఏడాది చివరకు 12వేలకు నిఫ్టీ!

Friday 13th July 2018

జేఎం ఫైనాన్షియల్స్‌ అంచనా చాలా రోజుల తర్వాత నిఫ్టీ మరోమారు 11వేల పాయింట్లను దాటింది. రికార్డు గరిష్ఠాలకు చేరిన తర్వాత కన్సాలిడేషన్‌ ఉంటుందని, ఆ సమయంలో మద్దతు కూడగట్టుకొని సూచీలు మరలా పరుగులు ఆరంభిస్తాయని, నిఫ్టీ ఇదే రకంగా 10500-10600 పాయింట్ల వద్ద మద్దతు కూడగట్టుకుందని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతమ్‌ షా వివరించారు. నిఫ్టీ గత జనవరి స్థాయిల నుంచి దాదాపు పది శాతం పతనమై తిరిగి 9 శాతం

Most from this category