STOCKS

News


ఇండియాపై బుల్లిష్‌

Thursday 24th January 2019
Markets_main1548313147.png-23780

ఆనంద్‌ మహీంద్రా
ఐఎంఎఫ్‌ పేర్కొన్నట్లు భారత్‌ బుల్లిష్‌ పిరియడ్‌లో ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మహీంద్రా అభిప్రాయపడ్డారు. ఇండియా ప్రస్తుత స్థితికి రావడానికి అనేక అవరోధాలను అధిగమించాల్సివచ్చిందని, అనేక నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయాల్సివచ్చిందని చెప్పారు.  గతకొన్నేళ్లుగా ప్రభుత్వాలు తీసుకువచ్చిన సంస్కరణలు ఫలాలను అందిస్తున్నాయని చెప్పారు. ఈ సంస్కరణల ఫలాలను దేశం వినియోగించుకొని దూసుకుపోవాలన్నారు. గతేడాది పండుగ సీజర్‌ అనుకున్నంత జోరుగా లేదని, కానీ రాబోయే నెలల్లో వినియోగం భారీగా పెరుగుతుందని అంచనా వేశారు.

భారతీయులు పొదుపు, వ్యయం అనే అంశాల్లో పొదుపునకు తొలిప్రాధాన్యమిస్తారని ఆనంద్‌ చెప్పారు. ఈ అలవాటే మన ఎకానమీని బలంగా మార్చిందని, వినిమయం సన్నగిల్లినా ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గకుండా ఆపిందని చెప్పారు. ఇన్‌ఫ్రాలో ప్రభుత్వం ఎడతెగకుండా పెట్టుబడులు పెడుతోందని, ఇవన్నీ భవిష్యత్‌లో మంచి ఫలితాలిస్తాయని తెలిపారు. ఇన్‌ఫ్రాలో వినియోగించే వాహనాల విక్రయాలు ఊపందుకుంటున్నాయని తెలిపారు. ఎన్నికల కారణంగా భారీ పెట్టుబడులు ఇకపై ఉండకపోవచ్చని, కానీ ఎన్నికల అనంతరం వినిమయంలో భారీ పాజిటివ్‌ మార్పు వస్తుందని అన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే ఏ ప్రభుత్వమైనా వృద్ధిని కొనసాగించక తప్పదని, ఎవరూ మరోమారు మందగమనం కోరుకోరని చెప్పారు.
ఎలాంటి రిలీఫ్‌ కావాలి?
రైతులను ఆదుకునేందుక ప్రభుత్వాలు ఇప్పటివరకు అనేక పథకాలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ వచ్చాయని ఆనంద్‌ చెప్పారు. రుణమాఫీ కానీ, మద్దతు ధరల పెంపు కానీ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయాయన్నాఉ. అందువల్ల రైతు సమస్యలకు ఈ రెండే పరిష్కారాలని భావించకూడదన్నారు. తెలంగాణ, ఒడిషాల్లో రైతులకు తీసుకువచ్చిన పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. ఈ రాష్ట్రాల్లో ఇస్తున్నట్లు రైతులకు నేరుగా ద్రవ్య సాయం అందించడం మంచిదని, ఇలాంటి నమూనాలపై గులాటీ ఎప్పటినుంచో పరిశోధనలు చేస్తున్నారని చెప్పారు. మనదగ్గర మన సొంత ఆలోచనలను అమలు చేయాలని, అప్పుడు విజయం సాధిస్తామని తెలిపారు. రైతులకు రుణాలను మాఫీ చేయడం, ఎంఎస్‌పీ పెంచడం కన్నా స్థిర ఆదాయాలను అందించడం, కౌలు రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలు సాగు సంక్షోభానికి సమాధానాలవుతాయని అభిప్రాయపడ్డారు.You may be interested

ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌కు ఫలితాల ఊపు

Thursday 24th January 2019

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌రంగ కంపెనీ ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేరు గురువారం ట్రేడింగ్‌లో 7శాతం క్షీణించింది. క్యూ3 ఫలితాల్లో సాధించిన మెరుగైన ఫలితాలకు తోడు గ్లోబల్‌ రీసెర్చ్‌ దిగ్గజం మెక్వ్యరీ షేరు టార్గెట్‌ ధరను పెంచడం షేరు ర్యాలీకి దోహదపడింది. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ వెల్లడించిన ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించడంతో నేడు బీఎస్‌ఈలో గత ముగింపు (రూ.284.4) ధరతో పోలిస్తే 2శాతం లాభంతో రూ.284.4ల వద్ద

స్వల్పంగా తగ్గిన పసిడి ధర

Thursday 24th January 2019

ఇన్వెస్టర్లు ఈక్విటీల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆసియా మార్కెట్లో గురువారం ఔన్స్‌ పసిడి ధర 3.50 డాలర్లు తగ్గి 1,280.50 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికాలో పలు కంపెనీలు నాలుగో త్రైమాసిక ఫలితాలను ఆశించిన స్థాయిలో ప్రకటించండతో రాత్రి అమెరికా సూచీలు లాభాలతో  ముగిశాయి. అలాగే చైనా అమెరికా-చైనా దేశాల మద్య వాణిజ్య సంబంధాలపై ఆశావహంతో నేటి ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లో జపాన్‌

Most from this category