STOCKS

News


స్థిరంగా ప్రారంభమైన నిఫ్టీ

Thursday 21st February 2019
Markets_main1550733161.png-24267

క్రితం ట్రేడింగ్‌లో భారీ లాభాల్ని ఆర్జించిన సూచీలు గురువారం స్థిరంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 81 పాయింట్లు లాభంతో 35,837 వద్ద, నిఫ్టీ 9 పాయింట్ల స్వల్ప లాభంతో 10,744.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన అవసరాల నిమిత్తం రూ.48,239 కోట్లు ఇచ్చేందుకు బుధవారం కేంద్ర అంగీకారం తెలపడంతో ఈ రంగానికి చెందిన ర్యాలీ చేస్తున్నాయి. మిశ్రమ అంతర్జాతీయ పరిమాణాలు, రూపాయి బలహీనత, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ తదితర అంశాలు మార్కెట్‌పై ప్రభావాన్ని చూపుతున్నాయి. రూపాయి క్షీణత ఐటీ, ఫార్మా రంగ షేర్లులో  స్వల్పంగా అమ్మకాలు జరగుతున్నాయి. 
నిఫ్టీలో ఇండియన్‌ బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, గెయిల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటామోటర్స్‌ షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతుండగా, ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌పీసీఎల్‌ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 
ప్రపంచమార్కెట్ల విషయాకొస్తే...
ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉండవని ఫెడ్‌ మినిట్స్‌ ద్వారా వెల్లడి కావడంతో పాటు అమెరికా - చైనాల వాణిజ్య చర్చలు సఫలమవుతాయనే అంచనాలతో ఆసియాలో అన్ని ప్రధాన మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక నిన్న యూరో మార్కెట్లు లాభాలతో ముగియగా.., రాత్రి అమెరికా మార్కెట్లు సైతం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఫెడ‌ర‌ల్ రిజ‌ర్వ్ గ‌త సమావేశపు మినిట్స్ నిన్న రాత్రి వెల్లడయ్యాయి. ఆర్థిక మందగమన నేపథ్యంలో వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉండదని మినిట్స్‌ ద్వారా వెల్లడైంది. You may be interested

బాకీ కట్టకపోతే జైలు శిక్షే!

Thursday 21st February 2019

- ఎరిక్సన్‌ కేసులో అనిల్‌ అంబానీకి సుప్రీం హెచ్చరిక - 4 నెలల్లో రూ.453 కోట్లు కట్టాల్సిందేనని స్పష్టీకరణ - లేదంటే మూడు నెలల జైలు తప్పదని వెల్లడి - మరో ఇద్దరు గ్రూప్‌ కంపెనీల చీఫ్‌లకూ ఇదే వార్నింగ్‌ - వీరంతా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారంటూ ఆగ్రహం న్యూఢిల్లీ: ఎరిక్‌సన్‌కు చెల్లించాల్సిన బకాయిల కేసులో రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌, వ్యాపారవేత్త అనిల్‌ అంబానీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎరిక్సన్‌ దాఖలు

నిఫ్టీకి 10,790 కీలకం

Wednesday 20th February 2019

వరుసగా ఎనిమిది షెషన్ల నష్టాల తర్వాత నిఫ్టీకి బుధవారం లాభాలొచ్చాయి. దిగువ వైపు నుంచి నిఫ్టీ కోలుకోవడంతోపాటు తక్షణ నిరోధ స్థాయి 10,683ను దాటి క్లోజయింది. దీంతో గురువారం మార్కెట్‌ తీరుపై జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తన అంచనాలను తెలియజేశారు.    నిఫ్టీ సానుకూలంగా ట్రేడింగ్‌ ఆరంభించినప్పటికీ... సెషన్‌లో ఎక్కువ సమయం పాటు 100 రోజుల సగటు చలనం (100డీఎంఏ) 10,683 వద్ద నిరోధాన్ని ఎదుర్కొన్నది. చివరి

Most from this category