STOCKS

News


ఫ్లాట్‌ ప్రారంభం.. అంతలోనే నష్టాల్లోకి..!

Monday 18th February 2019
Markets_main1550463894.png-24234

ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాల అందిపుచ్చుకున్న మార్కెట్‌ సోమవారం ఫ్లాట్‌గా మొదలైంది. సెన్సెక్స్‌ 22 పాయింట్ల లాభంతో 35,831 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల స్వల్ప లాభంతో 10,738 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే దేశీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు మార్కెట్‌ను నష్టాల్లోకి నెట్టాయి. డాలర్‌ మారకంలో రూపాయి వరుసగా 4రోజూ బలపడంతో ఐటీ షేర్లలో విక్రయాలతో పాటు, అటో, ఎఫ్‌ఎమ్‌జీసీ షేర్లలో అమ్మకాల కారణంగా సూచీల తిరిగి మళ్లాయి. ఫలితంగా నిఫ్టీ 10700 మార్కును కోల్పోగా, సెన్సెక్స్‌ సూచీ 100 పాయింట్లను నష్టపోయింది. ఉదయం గం.9:20ని.లకు నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో 10684 వద్ద, సెన్సెక్స్‌ 100 పాయింట్లను కోల్పోయి 35,709 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు మెటల్‌, ప్రభుత్వరంగబ్యాంకింగ్‌ షేర్లు మాత్రమే లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం గతముగింపు(71.22)తో పోలిస్తే 71.31 స్థాయి వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 
యస్‌ బ్యాంక్‌, బజాజ్‌ అటో, హెచ్‌సీఎల్‌టెక్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం నుంచి 4.50శాతం నష్టోపోగా, టాటాస్టీల్‌, ఓఎన్‌జీసీ, వేదాంత, ఎన్‌టీపీసీ డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 
ఇక ప్రపంచమార్కెట్ల విషయానికొస్తే...
-    అ‍గ్రరాజ్యాలైన అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలం కావచ్చనే ఆశావహనంతో పాటు మందగించిన ఆర్థిక వ్యవస్థను పుంజుకునేందుకు వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు ఈ వారంలో ఉద్ధీపన పథకాలు ప్రవేశపెట్టవచ్చనే అంచానాలతో ఆసియాలో నేడు అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. చైనా, జపాన్‌, హాంగ్‌సెంగ్‌ దేశాలకు చెందిన సూచీలు 2శాతం లాభపడ్డాయి. తైవాన్‌, సింగపూర్‌, దక్షిణ కొరియా దేశాలను సూచీలు 1శాతం పెరిగాయి.
-     చైనా దిగుమతులపై అదనపు సుంకాల విధింపునకు తుది గడువు మార్చి 1వ తేది నాటికి ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించవచ్చని వైట్‌హౌస్‌ అధికార ప్రకటనతో శుక్రవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.You may be interested

అంతర్జాతీయ పరిణామాలు, క్రూడ్‌ ధరలే కీలకం..!

Monday 18th February 2019

సోమవారం చైనా వాహన విక్రయ గణాంకాలు మంగళవారం యూరో కరెంట్‌ అకౌంట్‌ బ్యాలెన్స్‌, నిర్మాణ డేటా వెల్లడి బుధవారం వెల్లడికానున్న యూఎస్‌ ఎంబీఏ మార్టిగేజ్‌ అప్లికేషన్‌ డేటా గురువారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌, ఏపీఐ క్రూడ్‌ వివరాలు ఈవారంలోనే జీఎస్‌టీ కౌన్సిల్‌, ఆర్‌బీఐ సమావేశాలు పుల్వామా ఉగ్రదాడి అంశంపై ఇన్వెస్టర్ల దృష్టి ముంబై: ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు, అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య పరమైన చర్చలు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ

లాభాలు, ఆదాయాల్లో నిరంత వృద్ధి

Monday 18th February 2019

పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్లు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఓ కంపెనీ ఆదాయం, లాభం ఏటేటా ఏ స్థాయిలో వృద్ధి చెందుతున్నాయనేది ముఖ్యమైనవి. బీఎస్‌ఈలో లిస్టెడ్‌ కంపెనీల్లో సుమారు 23 కంపెనీల ఆదాయాలు, లాభాలు 2017 మూడో త్రైమాసికం నుంచి వృద్ధి చెందుతూనే ఉన్నాయి.    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నికర లాభం డిసెంబర్‌ త్రైమాసికంలో వార్షికంగా అంతకుమందు అదే కాలంలో పోల్చి చూస్తే 8.8 శాతం వృద్ధితో 10,251 కోట్లుగా

Most from this category