STOCKS

News


కెయిర్న్​ ఎనర్జీ షేర్లు విక్రయించిన ఐటీ శాఖ

Monday 26th November 2018
Markets_main1543212930.png-22379

న్యూఢిల్లీ: సుమారు రూ. 10,247 కోట్ల పన్ను బకాయీలను రాబట్టుకునే క్రమంలో కెయిర్న్ ఎనర్జీ షేర్లను ఆదాయ పన్ను శాఖ విక్రయించేసినట్లు తెలుస్తోంది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్‌ (పాత లావాదేవీలకు కూడా వర్తింపచేసే పన్ను) విధించడంపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు ప్రకటించేందుకు మరికొన్ని రోజులు ఉందనగా ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కెయిర్న్ ఎనర్జీకి ఉన్న వాటాలను కొనుగోలు చేయడం ద్వారా కెయిర్న్ ఇండియాని వేదాంత విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కెయిర్న్ ఎనర్జీ రూ. 10,247 కోట్ల మేర పన్నులు కట్టాలంటూ ఆదాయ పన్ను శాఖ డిమాండ్ నోటీసులు జారీ చేసింది. వేదాంతలో కెయిర్న్ ఎనర్జీకి ఉన్న 4.95 శాతం వాటాలను జప్తు చేసింది. స్టాక్ ఎక్స్చేంజీలకు వేదాంత ఇచ్చిన వివరాల ప్రకారం.. మే, జూన్‌లలో 2 శాతం చొప్పున వాటాలు విక్రయించినట్లు తెలుస్తోంది. మార్చి ఫైలింగ్ ప్రకారం.. ట్యాక్స్ రికవరీ ఆఫీసర్ (ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్‌) వద్ద 18.41 కోట్ల షేర్లు (4.95 శాతం) ఉన్నట్లు వేదాంత చూపింది. జూన్‌ క్వార్టర్‌లో ఇది 11.96 కోట్ల షేర్లకు (3.22 శాతానికి) తగ్గింది. ఇక సెప్టెంబర్‌ త్రైమాసికంలో వాటాదారుల జాబితాలో ట్యాక్స్ రికవరీ ఆఫీసర్‌ పేరు లేదు. నిబంధనల ప్రకారం 1 శాతం పైగా వాటాలు ఉన్న వారి పేర్లను తప్పనిసరిగా ఫైలింగ్‌లో చూపాల్సి ఉంటుంది. తాజా త్రైమాసిక వివరాలను బట్టి చూస్తే ఆదాయ పన్ను శాఖ తన వద్ద ఉన్న మొత్తం వాటాలను లేదా.. సింహభాగం షేర్లను విక్రయించి ఉంటుందని తెలుస్తోంది.



You may be interested

మార్చి నాటికి ఏఐఏటీఎస్‌ఎల్‌ అమ్మకం

Monday 26th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా అనుబంధ కంపెనీ ఏఐఏటీఎస్‌ఎల్‌ విక్రయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి (వచ్చే ఏడాది మార్చి కల్లా) పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విక్రయ ప్రక్రియ నిర్వహణకు సంబంధించి త్వరలోనే మర్చంట్ బ్యాంకర్స్‌ నుంచి బిడ్లను ఆహ్వానించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒకవేళ దీనికి మంచి స్పందన వచ్చిన పక్షంలో.. డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో కొంతైనా సాధించేందుకు తోడ్పడగలదు.

యస్‌ బ్యాంక్‌ 5% డౌన్‌

Monday 26th November 2018

ముంబై: ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేరు ధర సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 5 శాతం పతనమైంది. ఇంట్రాడేలో రూ.182 వద్ద కనిష్టస్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11 గంటల సమయానికి రూ.9.30 (4.76 శాతం) నష్టపోయి రూ.186 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ట ధర రూ.404 వద్ద (ఈ ఏడాది ఆగస్టు 20న) ఉండగా, కనిష్ట ధర రూ.165 వద్ద (సెప్టెంబర్‌ 28,

Most from this category