STOCKS

News


విలువ తెలుసుకునేది ఎలా?

Monday 19th November 2018
Markets_main1542651371.png-22192

స్టాక్‌ ధర సహేతుక స్థాయిలోనే ఉందా?
ఓ కంపెనీ షేరులో పెట్టుబడి పెట్టే ముందు ఆ కంపెనీ మూలాలను తప్పకుండా చూడాలంటారు నిపుణులు. అన్ని అంశాలను చూసిన తర్వాతే వాటికి అనుగునంగా షేరు ధర సహేతుక స్థాయిలోనే ఉందా? అన్న అంచనాకు రావడం సాధ్యపడుతుంది. మంచి కంపెనీని గుర్తించడమే కాదు, సరైన వ్యాల్యూషన్‌ వద్ద కొనుగోలు చేయడం కూడా ముఖ్యమైన అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఓ కంపెనీ వ్యాపారం విలువను అంచనా వేస్తేనే కొనుగోలుకు పెడుతున్న ధర సహేతుకమేనా అన్నది తెలుస్తుంది. వాస్తవ విలువ కంటే తక్కువకు లభిస్తున్న కంపెనీలనే కొనుగోలు చేయడం తలపండిన ఇన్వెస్టర్లు చేసే పని. మంచి వ్యాపారం ఉంది కదా అని ఓ కంపెనీ షేరును చాలా అధిక ధరల వద్ద కొనుగోలు చేస్తే అద్భుతమైన రాబడులు నమోదు చేయడం కష్టమైన విషయం అన్నది గుర్తించాలంటున్నారు.

విలువలను ఎలా తెలుసుకోవాలంటే...? అన్ని సందర్భాలకు ఒకటే ఫార్ములా లేదు. ఒక్కో రంగానికి ఒక్కో విలువ మదింపు ప్రమాణాలు ఉంటాయి. ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ అయితే అధిక పీఈ వద్ద ట్రేడ్‌ అవుతుంటాయి. ఇక మెటల్‌, మైనింగ్‌ రంగాల షేర్లు చాలా తక్కువ పీఈల వద్ద ట్రేడ్‌ అవుతుంటాయి. రుణ భారంతో ఉన్న కంపెనీ తక్కువ ధరల వద్ద లభించొచ్చు. మంచి వృద్ధి అవకాశాలున్న కంపెనీ షేరు అధిక వ్యాల్యూషన్ల వద్ద ట్రేడ్‌ అవుతూ ఉండొచ్చు. ఓ దేశ వృద్ధి రేటు, రాజకీయ స్థిరత్వం కూడా కంపెనీల షేర్ల విలువలను నిర్దేశించే అంశాలే. అందుకే అన్నింటకీ ఒకటే సూత్రం వర్తించదు. ఓ కంపెనీ వ్యాపార నాణ్యత, వృద్ధి, తదితర ఎన్నో అంశాలను చూడాలి. కాకపోతే ఓ కంపెనీ షేరు ధర ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు సాధారణంగా ఇవి ఉపయోగపడతాయి.

 

పీఈ రేషియో
దాదాపు అందరూ చూసే అంశమే ఇది. ఓ స్టాక్‌ను 10 పీఈ వద్ద కొనుగోలు చేస్తున్నారంటే ఆ కంపెనీ ఒక్కో షేరు రూపాయి ఆర్జిస్తుంటే... మీరు రూ.10 చెల్లిస్తున్నట్టు అర్థం. సహజంగా ఈ రేషియో తక్కువలో ఉన్నప్పుడు కొనుగోలు చేయాలనుకుంటుంటారు. కానీ, తక్కువకు వస్తోంది కదా అని కొనుగోలు చేస్తే ప్రమాదమే. కొనే ముందు కంపెనీ వ్యాపారాన్ని అధ్యయనం చేయాలి. తక్కువ పీఈలో ఉన్న స్టాక్‌ ఎప్పుడూ చౌక అని కాదు. అదే విధంగా అధిక పీఈతో ఉన్న స్టాక్‌ ఖరీదైనదనీ అర్థం చేసుకోరాదు. 
పీబీ రేషియో
కంపెనీ పుస్తక విలువకు ఎన్ని రెట్ల వద్ద షేరు ఉన్నదీ తెలుసుకోవడం మరో అంశం. పుస్తక విలువ కంటే అధికంగా స్టాక్‌ ట్రేడ్‌ అవుతుందంటే... సహజంగానే వాస్తవ విలువకు ఆ స్టాక్‌ ప్రీమియంతో కోట్‌ అవుతున్నట్టే. పుస్తక విలువ కంటే తక్కువకు ట్రేడ్‌ అవుతున్న స్టాక్‌ను మంచి అవకాశంగా చూడడం పొరపాటే కావచ్చు. ఎందుకంటే బలహీన వ్యాపార మూలాలకు షేరు ధర తక్కువలో ట్రేడ్‌ అవడం సూచిక కావచ్చు. కొన్ని సందర్భాల్లో కంపెనీ ఆస్తుల వాస్తవ విలువను పుస్తక విలువ ప్రతిబింబించకపోవచ్చు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలపై అంచనాకు పీబీ రేషియో చక్కగా ఉపయోగపడుతుంది. 
పీఈజీ రేషియో
ప్రైస్‌ టు ఎర్నింగ్స్‌ రేషియో అన్నది పీఈ రేషియో కంటే మెరుగైనది. కంపెనీ ఎర్నింగ్స్‌ వృద్ధి రేటును ప్రతిబింబిస్తుంది. పీఈ రేషియోను కంపెనీ వృద్ధి రేటుతో విభజించగా వచ్చేది పీఈజీ రేషియో. ఈ రేషియో ఒకటి కంటే తక్కువ ఉంటే ఆకర్షణీయం. 
 You may be interested

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Tuesday 20th November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 7:46 సమయంలో 39 పాయింట్ల నష్టంతో 10,743 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,768 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

హార్లిక్స్‌ కోసం నెస్లే, యూనిలీవర్‌ మధ్య పోటీ

Monday 19th November 2018

భారత మార్కెట్లో హార్లిక్స్‌, బూస్ట్‌ తదితర ఉత్పత్తులతో కూడిన గ్లాక్సో స్మిత్‌క్లయిన్‌ (జీఎస్‌కే) కన్జ్యూమర్‌ హెల్త్‌కేర్‌ వ్యాపారం కోసం యూనిలీవర్‌తో నెస్లే తీవ్రంగా తలపడనుంది. ఎందుకంటే ఈ పోటీ నుంచి ప్రధాన ‍ప్రత్యర్థి కోకో కోలా తప్పుకున్నట్టు సమాచారం. జీఎస్‌కే కన్జ్యూమర్‌లో జీఎక్‌కే వాటా కొనుగోలు ధర 3.1 బిలియన్‌ డాలర్ల నుంచి 3.5 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. విజయవంతంగా బిడ్‌లో గెలిచిన కంపెనీ ఓపెన్‌ ఆఫర్‌

Most from this category