STOCKS

News


ఎస్‌బీఐ షేరుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయి?

Monday 13th May 2019
Markets_main1557726577.png-25695

క్యు4 ఫలితాల అనంతరం అంతర్జాతీయ బ్రోకరేజ్‌లు ఎస్‌బీఐ రేటింగ్‌ను యథాతధంగా కొనసాగిస్తూ టార్గెట్‌ ధరలను పెంచాయి. బ్యాంకు మార్చి త్రైమాసికంలో రూ. 838 కోట్ల లాభం నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..
- నోమురా: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 375 నుంచి రూ. 400కు పెంచింది. బ్యాంకు క్రెడిట్‌ వ్యయాలు వచ్చే రెండేళ్లలో వంద బీపీఎస్‌ మేర తగ్గుతాయని అంచనా. అదేవిధంగా బ్యాంకు ఆర్‌ఓఈ 14 శాతం మేర దూసుకుపోవచ్చు. ప్రస్తుతం వాల్యూషన్లు సరసంగానే ఉన్నాయి. ప్రాఫిటబిలిటీలో మెరుగుదల ఉన్నందున ప్రస్తుత వాల్యూషన్లకు న్యాయం జరుగుతుంది. అసెట్‌ నాణ్యత మెరుగవడం పాజిటివ్‌ సంకేతం.
- సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 380 నుంచి రూ. 390కు పెంచింది. క్రెడిట్‌ వ్యయాలు తగ్గడం ఎర్నింగ్స్‌ను మెరుగుపరచనుంది. వచ్చే రెండేళ్లలో ఈ వ్యయాలు 1.2 శాతానికి దిగిరావచ్చు. ప్రస్తుతం లాభాలు తగ్గేందుకు కేటాయింపులు పెరగడమే కారణం. బ్యాంకు రుణకేటాయింపులు ముమ్మరం చేస్తోంది. వచ్చే ఏడాది ఎర్నింగ్స్‌ అప్‌గ్రేడ్‌కు అవకాశాలున్నాయి. 
- జెఫర్రీస్‌: కొనొచ్చు రేటింగ్‌ కొనసాగిస్తూ టార్గెట్‌ను రూ. 375కు పెంచింది. కొత్త ఆర్థిక సంవత్సరం బ్యాంకుకు బాగుంటుంది. స్లిపేజ్‌లు బాగా తగ్గాయి. ఆర్‌ఓఏ 90 బీపీఎస్‌మేర వృద్ధి చెందవచ్చు. వాల్యూషన్లు చారిత్రక స్థాయిల కన్నా తక్కువగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఈపీఎస్‌ అంచనాలను 30.7 శాతం మేర పెంచింది. 


SBI

You may be interested

స్థిరంగా పసిడి

Monday 13th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం స్థిరంగా కదలుతుంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి 1డాలరు స్వల్పంగా లాభపడి 1,288.40డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా - చైనాల మధ్య వాణిజ్య చర్చలు సందిగ్ధత నెలకొనడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా సంక్షోభ సమాయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ నెలకొంది. అమెరికా ప్రతిపాదించిన విధివిధానాలకు అనుగుణంగా చైనా తన వాణిజ్య చట్టాలను మార్పు చేయాల్సిందిగా

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 13th May 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు గెయిల్‌:- ప్రధాన మంత్రి ఉజ్వల్‌ గంగా ప్రాజెక్ట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,500 కోట్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకుంది. ఎస్‌ఆర్‌ఎఫ్‌:- ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్ బిజినెస్‌ వ్యాపారాన్ని డీఎస్‌ఎం ఇండియా కంపెనీకి రూ.320 కోట్లకు విక్రయించనుంది.  ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌:- కంపెనీ ఛీప్‌ ఫైనాన్స్‌ ఆఫీసరుగా సుదీప్‌ సిల్‌ నియమితులయ్యారు.  యూపీఎల్‌:- ఆల్‌ఫ్రెష్‌ మేనేజ్‌మెంట్‌లో 26.75శాతం వాటాను రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.  వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌:- వెల్‌స్పన్‌

Most from this category