STOCKS

News


నిఫ్టీ బ్రేకవుట్‌కు రెడీ అవుతోందా?

Saturday 12th January 2019
Markets_main1547300272.png-23553

గత కొన్నాళ్లుగా నిఫ్టీ స్వల్ప రేంజ్‌లో ట్రేడవుతోంది. గతేడాది జీవిత కాల గరిష్ఠాన్ని తాకిన అనంతరం మరోమారు పదివేల పాయింట్ల వరకు పతనమైంది. అక్కడ నుంచి మరోమారు పైకి ఎగిసినా పరుగు కొనసాగించలేక, కిందకు రాలేక ఒక రేంజ్‌లోనే కదలాడుతోంది. చార్టులను పరిశీలిస్తే కరెక్టివ్‌ అప్‌మూవ్‌లో భాగంగానే తాజా ర్యాలీ వచ్చింది కానీ కొత్త బుల్‌ ర్యాలీ మాత్రం కాదని తెలుస్తోంది. నియో వేవ్‌ సిద్ధాంతం ప్రకారం చూస్తే గతనెల 19న కరెక్టివ్‌ వేవ్‌ నిర్మాణం పూర్తయినట్లు కనిపిస్తోంది. ఈ నిర్మాణం పూర్తయిన అనంతరం వచ్చే కదలిక చాలా వేగంగా, దిగువకు ఉండాలి. కానీ నిఫ్టీ తాజా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అందువల్ల నియో వేవ్‌ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, మరిన్ని లెగ్స్‌ మిగిలి ఉన్నాయని భావించవచ్చు. ఇదే నిజమైతే పుల్‌బ్యాక్‌ మరికొంత ముందుకు కొనసాగే ఛాన్సులున్నాయి. ముఖ్యంగా మరో అప్‌సైడ్‌ కరెక్టివ్‌ వేవ్‌ బాకీ ఉన్నట్లు కనిపిస్తోంది. దీన్నిబట్టి చూస్తే వచ్చే రెండు సెషన్లలో నిఫ్టీ పైవైపు మరో బ్రేకవుట్‌ ఇచ్చే సూచనలున్నాయి. 10870 పాయింట్లకు పైన నిఫ్టీ ముగిస్తే పాజిటివ్‌ బ్రేకవుట్‌గా చెప్పవచ్చు. ఈ బ్రేకవుట్‌ సాధిస్తే నిఫ్టీ 11350 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చు. ఇందుకు శుక్రవారం ఏర్పరిచిన 10739 పాయింట్ల కనిష్ఠం బేస్‌గా ఉండొచ్చని నిపుణుల అంచనా. ఒకవేళ నిఫ్టీ వచ్చే సెషన్లలో 10630 పాయింట్లను కోల్పోతే మాత్రం పైన చెప్పిన సిద్ధాంత ఫలితం అన్వయించదు. అప్పుడు వేవ్‌ థియరీ ప్రకారం పుల్‌బ్యాక్‌ ముగిసినట్లే భావించాలని నిపుణుల సూచన. 
 



You may be interested

లాంగ్స్‌కు 10628 పాయింట్లే స్టాప్‌లాస్‌!

Saturday 12th January 2019

నిఫ్టీ గతవారం 10870 పాయింట్ల కీలక నిరోధ స్థాయిని దాటలేక వెనుదిరిగింది. దిగువన 10730 పాయింట్ల రేంజ్‌లో మద్దతు పొందిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. తొమ్మిది వారాలుగా నిఫ్టీ అర్ధంపర్ధంలేకుండా అటుఇటు తిరుగుతోందన్నారు. ఒక వారం పైవైపునకు, మరోవారం కిందవైపునకు తిరుగుతూ స్వల్ప రేంజ్‌లోనే కదలాడుతోందని పేర్కొంది. వీక్లీ చార్టుల్లో గతవారం నిఫ్టీ ఇన్‌సైడ్‌బార్‌ పాటర్న్‌ను ఏర్పరిచింది. ఈ వారం కూడా అనిశ్చితి కొనసాగుతుందనేందుకు ఇది నిదర్శనమని తెలిపింది. ర్యాలీ

అక్కడక్కడే పసిడి ధర

Saturday 12th January 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర అక్కడక్కడే ముగిసింది. అమెరికా మార్కెట్లో శుక్రవారం రాత్రి 2డాలర్లు (0.50డాలరు) స్వల్పంగా పెరిగి 1,289.50 డాలర్ల వద్ద స్థిరపడింది. నాలుగురోజుల పాటు అమెరికా-చైనా దేశాల మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఎలాంటి సమాచారం వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లలో ఇరుదేశాల మధ్య చర్చలు విఫలమై ఉంచవచ్చనే అనుమానాలు రేకత్తాయి. అలాగే గత 5రోజులుగా ర్యాలీ చేస్తున్న అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగియండంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక

Most from this category