STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీబ్యాంక్‌ కొనొచ్చా?

Monday 13th August 2018
Markets_main1534142334.png-19217

సోమవారం ట్రేడింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీబ్యాంకు షేరు దాదాపు 2 శాతం పతనమైంది. బ్యాంకు డిప్యుటీ ఎండీ పరేశ్‌ సుక్తాంకర్‌ రాజీనామా ప్రభావం బ్యాంకు షేరుపై పడింది. పరేశ్‌ రాజీనామా వార్తతో బ్యాంకు ఏడీఆర్‌ శుక్రవారం అమెరికా మార్కెట్లో భారీగా నష్టపోయింది. దాదాపు రెండు దశాబ్దాలు పరేశ్‌ బ్యాంకుకు సేవలనందించారు. ఈ నేపథ్యంలో బ్యాంకు షేరు మరింత పతనం కావచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో 2- 3 శాతం షేరు పడిపోతే కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించవచ్చని సూచిస్తున్నారు. 
పరేశ్‌ రాజీనామా, బ్యాంకుపై ప్రభావం తదితర అంశాలపై బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...
- రిలయన్స్‌ సెక్యూరిటీస్‌: డిప్యుటీ ఎండీ రాజీనామా ప్రభావం బ్యాంకు ఫండమెంటల్స్‌పై ఉండకపోవవచ్చు. వచ్చే వారం మరో 4- 5 శాతం మేర బ్యాంకు షేరు పతనం కావచ్చు. 
- మాక్క్వైరీ: సీఈఓ అవుతాడని భావించిన వ్యక్తి రాజీనామా తప్పక షేరుపై ప్రభావం చూపుతుంది. పరేశ్‌ స్థానంలో కొత్తవారిని ప్రకటించిన అనంతరం ఇన్వెస్టర్లలో ఆందోళన సద్దుమణగవచ్చు. బ్యాంకు ఫైనాన్షియల్స్‌పై ప్రభావం స్వల్పమే.
- యాంటిక్‌ బ్రోకింగ్‌: ఒక పెద్ద బ్యాంకులో రెండో స్థానంలో ఉన్న వ్యక్తి మరో బ్యాంకులో అగ్రస్ధానానికి వెళ్లడం మామూలే. పరేశ్‌ రాజీనామాతో బ్యాంకు షేరు పతనమైతే రిటైల్‌ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు మంచి అవకాశంగా భావించాలి. 
- నోమురా: రాజీనామా అంశం స్వల్పకాలిక చిన్నపాటి నెగిటివ్‌ ప్రభావం చూపగలదు. పరేశ్‌ స్థానంలో కొత్త వ్యక్తిని బయట నుంచి తీసుకునే అవకాశాలున్నాయి.
- సిటి గ్రూప్‌: క్యుఐపీ ఇష్యూ జరిగే సమయంలో ఈ రాజీనామా రావడం కలవరపెట్టే అంశంగా భావించాలి. 
గత ఏడాది కాలంఓ బ్యాంకు షేరు దాదాపు 20 శాతం లాభపడింది. 



You may be interested

ఐటీ, ఫార్మా షేర్ల జోరు

Monday 13th August 2018

ముంబై:- డాలరు మారకంలో రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పతనం కావడంతో సోమవారం ఐటీ, ఫార్మా షేర్లు లాభాల బాట పట్టాయి. టర్కిష్ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రపంచంలోని వివిధ కరెన్సీ విలువలు క్షీణించడంతో డాలర్‌ 13నెలల గరిష్టానికి చేరుకుంది. అందులో భాగంగా నేడు భారత కరెన్సీ 69.49వద్ద  కొత్త జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది. డాలర్‌ మారకంలో రూపాయి పతనంతో విదేశీ ఎగుమతులపై ఆధారపడే ఐటీ, ఫార్మా

రూపీ పతనం.. అసలు కారణం లిరా కాదు..

Monday 13th August 2018

ఇండియన్‌ రూపాయి పతనానికి టర్కీస్‌ లిరా, అమెరికా డాలర్‌ బలోపేతమవ్వడం వంటి అంశాలు ప్రధాన కారణం కాదని చెబుతున్నారు ఏఎన్‌జెడ్‌ ఆసియా రీసెర్చ్‌ హెడ్‌ ఖూన్‌ గోహ్‌.  ఆసియాలో విస్తరిస్తున్న నెగిటివ్‌ సెంటిమెంట్‌, వర్ధమాన మార్కెట్లు బలహీనంగా ఉండటం వంటి అంశాలు రూపాయి పతనానికి కారణమని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. ‘టర్కీ కరెన్సీ లిరా భారీగా పతనమైంది.  యూరో కూడా ఏడాది కనిష్టానికి పడిపోయింది.

Most from this category