News


ఇర్కాన్‌ నష్టాల లిస్టింగ్‌..!

Friday 28th September 2018
Markets_main1538114519.png-20672

ముంబై:- కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌  షేర్లు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అంతంత మాత్రంగానే లిస్ట్‌ అయ్యాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ.475లతో పోలిస్తే బీఎస్‌ఈలో 13శాతం(రూ.65లు) నష్టంతో 410.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఉదయం గం.11:00ని.లకు షేరు 6శాతం నష్టంతో రూ.448.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ట్రేడింగ్‌లో రూ. 410.30లు, రూ.464.40ల కనిష్ట, గరిష్ట ధరలను నమోదు చేసింది. ఈ నెల 1-6 మధ్య రూ.745-750 ప్రైస్‌బాండ్‌తో వచ్చిన ఈ ఐపీఓ 1.9 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రెబ్‌ అయ్యింది.  2018 మార్చికల్లా కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 22,406 కోట్లుగా నమోదైంది.



You may be interested

సిటీ గ్రూప్‌ టాప్‌ 10 పిక్స్‌

Friday 28th September 2018

ఇండియన్‌ స్టాక్‌మార్కెట్‌లో ఇటీవల కరెక‌్షన్‌ నేపథ్యంలో ఇన్వెస్టర్లు డిఫెన్సివ్‌ స్టాక్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తే మంచిదని గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ సిటీ గ్రూప్‌ సూచిస్తోంది. 2019 మార్చి కల్లా సెన్సెక్స్‌ 37,300 పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. తన మోడల్‌ పోర్ట్‌ఫోలియో నుంచి యస్‌ బ్యాంక్‌ను తొలగించింది. కోల్‌ ఇండియాకు స్థానం కల్పించింది. స్వల్పకాలంలో మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతాయని పేర్కొంది. అధిక వ్యాల్యుయేషన్స్‌తో రిస్క్‌ పొంచి ఉందని తెలిపింది. దేశీ ఇన్వెస్ట్‌మెంట్లు

ఇన్ఫీభీమ్‌ 58శాతం క్రాష్‌

Friday 28th September 2018

సాఫ్ట్‌వేర్‌ రంగంలో సేవలను అందించే ఇన్ఫీభీమ్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 58శాతం క్షీణించింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫీభీమ్‌ షేరు రూ. 180.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఈ షేరు ఏకంగా 58శాతం నష్టపోయి రూ.83.65ల వద్దకు పతనమైంది. ఉదయం 10:20లకు షేరు గతముగింపు(రూ.200.35)తో పోలిస్తే 55శాతం నష్టంతో రూ.89.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర షేరుకు

Most from this category