STOCKS

News


ప్రారంభమైన ఇర్కాన్‌ ఐపీఓ

Monday 17th September 2018
Markets_main1537175254.png-20327

ప్రభుత్వరంగానికి చెందిన ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ ఐపీఓ సోమవారం ప్రారంభమైంది. ఈ ఐపీఓ సెప్టెంబర్‌ 17న ప్రారంభమై ఇదే నెల 19న ముగిస్తుంది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం ఆఫర్‌ఫర్‌సేల్‌ పద్ధతిలో 10శాతానికి సమానమైన 99లక్షల ఈక్విటీ షేర్లను అమ్మకానికి పెడుతోంది. ఈ ఐపీఓకు ధర శ్రేణి రూ. 470-475ల నిర్ణయించింది. ఈ ఐపీఓ ద్వారా ప్రభుత్వం రూ.470 కోట్ల నిధులను ఉపసంహరించుకోవాలని యోచిస్తోంది. ఈ ఐపీఓపై మార్కెట్‌ వర్గాల విశ్లేషణ, అభిప్రాయాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..!
వ్యాపారం విశ్లేషణ:-
ఇక్రాన్‌ సంస్థ ప్రధానంగా ఇంజనీరింగ్‌, నిర్మాణరంగలో సేవలు అందిస్తోంది. ఇప్పటికే కంపెనీ రోడ్లు,  బ్రిడ్జిలు, విద్యుత్‌, వాణిజ్య, ఈహెచ్‌వీ సబ్‌స్టేషన్లు నివాసయోగ్యమైన పలు ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసి ఆయారంగాల్లో తనదైన ముద్ర వేసుకుంది. తాజాగా నిర్మాణం-నిర్వహణ-బదలాయింపు, సేకరణ-నిర్మాణం వంటి ప్రాజెక్ట్‌లపై దృష్టిని సారిస్తోంది. కంపెనీ దక్కించుకున్న మొత్తం ఆర్డర్లలో 87శాతం కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ నుంచి పొందడం కంపెనీకి కలిసొచ్చే అంశం.
ఆర్థిక విశ్లేషణ:- మార్చి 2018 నాటికి ఇక్రాన్‌ రూ.3,762 కోట్ల నెట్‌వర్త్‌ను, రూ.1200 కోట్ల సొంత నగదు నిల్వలు కలిగి ఉంది. కంపెనీ వార్షిక ఆదాయం 27 శాతం, నికరలాభం 2శాతం వృద్ధిని సాధించింది.
బలమైన బుక్‌ ఆర్డర్లు:-
బలమైన బుక్‌ ఆర్డరను కలిగి ఉండటం కంపెనీకి మరో సానుకూలాంశం. మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి కంపెనీ బుక్‌ ఆర్డర్‌ వార్షికంగా 30శాతం వరకు వృద్ధిని నమోదు చేస్తోంది.  ప్రస్తుతం కంపెనీ మరో 5ఏళ్లకు వరకు ఆదాయాన్ని సమకూర్చే బుక్‌ ఆర్డర్లను కలిగి ఉంది. కంపెనీ మార్జిన్లను పెంచుకోవడానికి, ఇతర కంపెనీల నుంచి పోటీతత్వం తగ్గించుకోవడానికి రూ.500 కోట్లకు పైన విలువ కలిగిన ఆర్డర్లపై దృష్టిని సారిస్తోంది.

 ఐపీఓపై బ్రోకరేజ్‌ సంస్థ రేటింగ్‌:-
మోతీలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌:-
సబ్‌స్రైబ్‌ చేసుకోవచ్చు.
విశ్లేషణ:- బలమైన బుక్‌ ఆర్డర్లు, చక్కటి ఆర్థిక నిర్వహణ కారణంగా ఐపీఓ ఇష్యూ అత్యుత్తమ వాల్యూవేషన్‌ కలిగి ఉంది. అంతర్జాతీయ వ్యాపారాన్ని మెరుగుపరుచుకోవాలి. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవశ్యకత ఉంది.
యాంటిక్యూ స్టాక్‌ బ్రోకింగ్‌:-
సబ్‌స్క్రెబ్‌ చేసుకోవచ్చు.
విశ్లేషణ:- ఇష్యూ ధర శ్రేణి ఆకర్షణీయంగా ఉండటం, బలమైన బ్యాలెన్స్‌ షీట్‌, సొంత నిధులు కలిగి కలిసొచ్చే ఉండటం కంపెనీకి కలిసొచ్చే అంశం. కంపెనీ ప్రధాన వ్యాపారాన్ని తక్కువ నిధుల అవసరమవుతాయి.You may be interested

నెల రోజుల కోసం టాప్‌ బ్రోకరేజ్‌ల సిఫార్సులు

Monday 17th September 2018

వచ్చే మూడు, నాలుగువారాల్లో మంచి రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు 1. బయోకాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 725. స్టాప్‌లాస్‌ రూ. 620. కొన్నివారాలుగా అప్‌మూవ్‌లో ఉంది. హయ్యర్‌టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. ఇటీవల కరెక‌్షన్‌ ముగిసినట్లు భావించవచ్చు. బుల్లిష్‌ రివర్సల్‌ కాండిల్‌ పాటర్న్‌ ఏర్పడడం ఇందుకు నిదర్శనం.   2. ఐషర్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 31700. స్టాప్‌లాస్‌ రూ. 27950. చాలా కాలం

బాటమ్‌కు సమీపంలో వర్ధమాన మార్కెట్లు

Monday 17th September 2018

వర్ధమాన మార్కెట్ల పతనం బాటమ్‌కి సమీపంలో ఉందని ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అంచనా వేసింది. ఫిలిప్పిన్స్‌ వంటి దేశాలు ఇంకా సతమతమౌతున్నాయని పేర్కొంది. ఇక డాలర్‌ పొజిషన్లపై తటస్థ వైఖరిని అవలంబించింది. డాలర్‌ దిశ ఎటువైపు అయినా ఉండొచ్చని, ప్రస్తుత పరిస్థితుల్లో ఒక అంచనాకు రాలేమని పేర్కొంది. అధిక ట్రేజరీ ఈల్డ్స్‌, అమెరికాలో పన్ను తగ్గింపు చర్యలు, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు వంటి అంశాలు వర్ధమాన కరెన్సీల పతనానికి ప్రధాన

Most from this category