STOCKS

News


వచ్చే వారం 3 ఐపీఓలు..

Saturday 22nd September 2018
Markets_main1537592513.png-20466

ముంబై:- వచ్చే వారం మూడు కంపెనీలు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నాయి. ప్రభుత్వ రంగ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ కంపెనీ, నాన్-బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అవాస్‌ ఫైనాన్షియర్స్‌, దినేష్‌ ఇంజనీర్స్‌లు ఐపీఓ ద్వారా రూ.2,264 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. అయితే ఐపీఓలు ఎంతవరకు విజయవంతమవుతాయనే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇందుకు ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కారణమవుతున్నాయి. స్టాక్‌మార్కెట్‌ ఈ సెప్టెంబర్‌లో మూడు వారాలుగా బేర్స్‌ ఉచ్చులో చిక్కుకొని నష్టపోయింది. మార్కెట్‌ పతనం కారణంగా ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6లక్షల కోట్ల విలువైన ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. ఈ సమయంలో ప్రైమరీ మార్కెట్‌లోకి వస్తున్న ఈ మూడు కంపెనీల ఐపీఓలు ఎంతవరకు విజయవంతం అవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఐపీఓలకు వస్తున్న ఆయా కంపెనీలు మాత్రం తమ తమ ఐపీఓ ఇష్యూలపై విశ్వాసంతో ఉన్నాయి. అందుకు ఈ వారంలో విజయంతమైన ఇర్కాన్‌ ఐపీఓ ఇష్యూను సాకుగా చూపుతున్నాయి. ఈ వారంలో రూ.470 కోట్ల నిధుల సమీకరణకు వచ్చిన ఈ ఇష్యూ 10 రెట్లు సబ్‌స్క్రెబైన సంగతి తెలిసిందే. మరోవైపు మార్కెట్‌ విశ్లేషకులు మాత్రం అధిక శాతం షేర్లు భారీగా దిద్దుబాటుకు లోనవుతున్న ఈ తరుణంలో ఇష్యూలకు ఇది సరియైన సమయం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే వారంలో మూడు ఐపీఓలు:-
రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌:- కోల్‌కత్తా కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ కంపెనీ ఐపీఓ ఈ నెల 24న ప్రారంభమై 26న ముగిస్తుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ 17.5 శాతానికి సమానమైన 20.04 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. రూ.345 కోట్ల సమీకరణ లక్ష్యంగా ప్రైమారీ మార్కెట్‌ను వస్తున్న ఈ  ఐపీఓ ధర శ్రేణి రూ.115-118గా ఉంది.
ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌:-  గృహ రుణ సంస్థ ఆవాస్‌.. ఐపీఓ  ద్వారా రూ.1,734 కోట్లు సమీకరించనుంది. ఈ ఇష్యూ ఈ నెల 25న మొదలై 27న ముగియనుంది. ఐపీఓ ధర శ్రేణి రూ.818- 821గా నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా కంపెనీ రూ.400 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. 
దినేష్‌ ఇంజనీర్స్‌:- కమ్యూనికేషన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ విభాగంలో సేవలను అందించే దినేష్‌ ఇంజనీర్స్‌ ఐపీఓ ఈ నెల 28 ప్రారంభమై, వచ్చే నెల అక్టోబర్‌ 3న ముగుస్తుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ 1 కోటి విలువైన ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. రూ.185 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా ప్రైమరీ మార్కెట్‌లోకి దూసుకొస్తున్న ఈ కంపెనీ ఐపీఓ ధర శ్రేణి రూ.183-185గా ఉంది.
-  గతేడాది ఇదే సెప్టెంబర్‌లో పలు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.16,665.71 కోట్ల నిధులను సమీకరించాయి.  వాటిలో ఇన్సూరెన్స్‌ కంపెనీలైన ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, ఐసీఐసీఐ లాంబార్డ్‌ ఐపీఓలు ఉన్నాయి.



You may be interested

రిలయన్స్ ఎంఏ చమురు క్షేత్రం మూసివేత

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: కేజీ-డీ6 బ్లాక్‌లోని ఏకైక ఎంఏ చమురు క్షేత్రాన్ని శాశ్వతంగా మూసివేస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ శుక్రవారం తెలిపింది. ఇందులో ఉత్పత్తి పూర్తిగా నిల్చిపోవడమే ఇందుకు కారణమని పేర్కొంది. భారీగా నీరు, ఇసుక వచ్చి చేరుతుండటంతో ఈ క్షేత్రంలో కార్యకలాపాలు పెనుసవాలుగా మారాయని, దీంతో పాటు క్రమంగా ఉత్పత్తి కూడా క్రమంగా తగ్గిపోవడంతో సెప్టెంబర్ 17న ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశామని రిలయన్స్ పేర్కొంది. కేజీ-డీ6 బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌ ఇప్పటిదాకా 19

ఆరిజోనాలో ఇన్ఫీ టెక్నాలజీ హబ్‌

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. అమెరికాలో కొత్తగా మరో టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఆరిజోనాలో దీన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2023 నాటికి 1,000 మంది అమెరికన్ ఉద్యోగులను ఇందులో నియమించుకోనున్నట్లు వివరించింది. ఆరిజోనా కళాశాలల్లో చదివిన తాజా గ్రాడ్యుయేట్స్‌, స్థానిక నిపుణులు వీరిలో ఉండనున్నట్లు పేర్కొంది. రెండేళ్ల వ్యవధిలో ఇలాంటి నాలుగు హబ్‌లు ఏర్పాటు చేస్తామని, 10,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని గతేడాదే

Most from this category