STOCKS

News


దేశీయంగా ఐవోసీ ట్రేడింగ్ డెస్క్‌

Tuesday 16th April 2019
Markets_main1555393953.png-25158

  • స్పాట్‌ మార్కెట్లో ముడి చమురు కొనుగోలుకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రియల్‌ టైమ్ ప్రాతిపదికన ముడిచమురును కొనుగోలు చేసే దిశగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) దేశీయంగా ఢిల్లీలో ట్రేడింగ్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ముఽడిచమురును మెరుగైన ధరకే దక్కించుకోవడం ద్వారా దిగుమతి వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్‌) ఎ.కె.శర్మ తెలిపారు. ఐవోసీ ప్రస్తుతం తమ అవసరాల్లో 30 శాతాన్ని (15 మిలియన్ టన్నుల) స్పాట్ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం 2017లో సింగపూర్‌లో ప్రత్యేక ట్రేడింగ్ ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా కంపెనీ అంతర్గతంగా ట్రేడింగ్‌ టీమ్‌ను, సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసుకున్న నేపథ్యంలో దేశీయంగానూ డెస్క్‌ను ప్రారంభించింది. గత నెల 25న తొలి ట్రేడ్ కింద నైజీరియాలో ఉత్పత్తయ్యే అగ్బామి రకం క్రూడ్‌ పది లక్షల బ్యారెల్స్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రైవేట్ సంస్థలకు దేశీయంగా ట్రేడింగ్ డెస్క్‌లు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగంలో మాత్రం ఇలాంటిది ఏర్పాటు చేసిన మొదటి సంస్థ ఐవోసీనే. సింగపూర్‌ డెస్క్‌లో క్రూడ్ కొనుగోలుకు బిడ్స్‌ రావడం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి రెండు గంటల దాకా పట్టేస్తుండగా.. దేశీ డెస్క్‌ ఏర్పాటుతో ఎప్పటికప్పుడు మారే ధరలపై తక్షణమే బేరసారాలు చేసి, వెంటనే నిర్ణయం కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఐవోసీ పేర్కొంది.



You may be interested

టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ ఆదాయం రూ.1,197 కోట్లు

Tuesday 16th April 2019

5 శాతం పతనమైన షేర్‌ న్యూఢిల్లీ:- మీడియా కంపెనీ, టీవీ-18 బ్రాడ్‌కాస్ట్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.30 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5 కోట్ల నికర లాభం వచ్చిందని టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.765 కోట్ల నుంచి రూ.1,197 కోట్లకు పెరిగింది. వయాకామ్‌​ 18 మీడియా, ఇండియాకాస్ట్‌ మీడియా డిస్ట్రిబ్యూషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లు

వరుసగా మూడవదఫా రేటు కోత

Tuesday 16th April 2019

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిల్‌ లించ్‌ అంచనా... వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాం‍క్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశించిన 4 శాతంలోపే కొనసాగుతున్నందువల్ల వరుసగా మూడవసారి కూడా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- రెపో ప్రస్తుతం 6 శాతం) తగ్గే అవకాశం ఉందని ఫారిన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా- మెరిలించ్‌ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్‌) అంచనా వేసింది.

Most from this category