STOCKS

News


పెట్రో మార్కెటింగ్‌ షేర్లకు రేటింగ్‌ షాక్‌

Tuesday 23rd October 2018
Markets_main1540276731.png-21402

ముంబై:- విదేశీ బ్రోకింగ్‌ సంస్థ నోమురా పెట్రో మార్కెటింగ్‌ కంపెనీ షేర్లపై రేటింగ్‌ను తగ్గించడంతో మంగళవారం ఐఓసీ, హెచ్‌సీఎల్‌, బీపీసీఎల్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి.  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి రోజు రోజుకూ తరుగుతున్న రూపాయి విలువలు పెట్రో మార్కెటింగ్‌ కంపెనీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నోమురా అంచనా వేస్తుంది. ఇరాన్‌ నుంచి దిగుమతయ్యే ముడిచమురు అమెరికా విధించి ఆంక్షలు అమెరికా నవంబర్‌ 4నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో  అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు ఈ జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 6శాతం పెరిగాయి. అలాగే ఏడాది కాలంలో 25శాతం వరకు ఎగిశాయి. ముడి చమురు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రధాన ముడి సరకు. కాబట్టి చమురు ధరలు పెరిగినా, తగ్గినా ఈ ఒడిదుడులకుల ప్రభావం ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీల ఆదాయాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. పెరిగిన ముడిచమురు ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడానికి సదరు ఆయిల్‌ కంపెనీలకు కొన్ని పరిమితులుంటాయి. ఇటీవల దేశంలో పరుగులు పెడుతున్న పెట్రో, డీజిల్‌ ధరలకు అడ్డుకట్టవేయడానికి కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. పెట్రో ఉత్పత్తులపై ప్రస్తుతం కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని లీటర్‌కు రూ.1.50 మేర తగ్గించింది. అలాగే మరో రూ.1 మేర పెట్రో కంపనీలు తగ్గించుకోవాలని కేంద్రం సూచించింది. సాదరణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం రాయితీల రూపంలో పలు జనాకర్షక పథకాల ప్రకటన కూడా ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీల మార్జిన్‌లను ప్రభావితం చేస్తాయని నోమురా అంటోంది. ‘‘సబ్సీడరీల భారం, ముడిచమురు పెరుగుదల, రూపాయి తరుగుదల తదితర కారణాలతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల ఆదాయాలు 11-18శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో  26-31శాతం క్షీణిస్తాయని అంచనా వేస్తున్నాము. ఐఓసీ, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ కంపెనీల షేర్లపై ప్రస్తుతం ఉన్న బై రేటింగ్‌ను న్యూట్రల్‌ రేటింగ్‌కు సవరిస్తున్నాం’’ అని నోమురా తెలిపింది.
ఐఓసీ:- ఇంట్రాడేలో 4శాతం నష్టపోయింది. ఉదయం గం.11:20ని.లకు షేరు గతముగింపు(రూ.125.20)తో పోలిస్తే 2.50శాతం క్షీణించి రూ.126.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
హెచ్‌పీసీఎల్‌:- ఇంట్రాడేలో 4శాతం నష్టపోయింది. ఉదయం గం.11:20ని.లకు షేరు గతముగింపు(రూ.210.15)తో పోలిస్తే 2శాతం పతనమైన రూ.206.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
బీపీసీఎల్‌:- ఇంట్రాడేలో 4శాతం నష్టపోయింది. ఉదయం గం.11:20ని.లకు షేరు గతముగింపు(రూ.271.20)తో పోలిస్తే 3శాతం పతనమైన రూ.264.15ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.


IOC

You may be interested

ఆర్‌బీఎల్‌పై సిఫార్సు... మాటమార్చిన మోర్గాన్‌ స్టాన్లీ

Tuesday 23rd October 2018

ఆర్‌బీఐఎల్‌ బ్యాంక్‌కు మోర్గాన్‌ స్టాన్లీ గట్టి షాకిచ్చింది. అధిక వ్యాల్యుయేషన్స్‌ నేపథ్యంలో స్టాక్‌ రేటింగ్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ షేరు సోమవారం ఏడు శాతంమేర పతనమైంది. షేరు ఒక్కరోజులో ఈమేర పతనం కావడం ఇదే తొలిసారి. ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తన లిస్టింగ్‌ (2016, ఆగస్ట్‌ 31) దగ్గరి నుంచి చూస్తే దాదాపు 80 శాతంమేర ఎగసింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ 23 శాతంమేర పెరిగింది.

‘సెల్‌’ సిఫార్సులు

Tuesday 23rd October 2018

ఈక్విటీ మార్కెట్‌ నిపుణులు కొన్ని స్టాక్స్‌కు స్వల్ప కాలానికి సంబంధించి బై, సెల్‌ సూచనలు ఇచ్చారు. అవేంటో చూద్దాం.. సీకే నారాయణ్‌ (చార్ట్‌ అడ్వైజ్‌) ► ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ను రూ.218 టార్గెట్‌ ప్రైస్‌తో విక్రయించొచ్చు. స్టాప్‌ లాస్‌ రూ.230.   ► కెనరా బ్యాంక్‌ను కూడా రూ.205 టార్గెట్‌ ప్రైస్‌తో విక్రయించొచ్చు. దీనికి స్టాప్‌ లాస్‌ రూ.216. మానస్‌ జైశ్వాల్‌ (మానస్‌జైశ్వాల్‌.కామ్‌) ► కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ను రూ.1,080 టార్గెట్‌ ప్రైస్‌తో విక్రయించొచ్చు.దీనికి స్టాప్‌ లాస్‌ రూ.1,206. ► ఏసియన్‌ పెయింట్స్‌ను కూడా

Most from this category