STOCKS

News


పాతాళానికి ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు

Friday 5th October 2018
Markets_main1538723679.png-20891

  • రెండున్నరేళ్ల కనిష్టానికి బీపీసీఎల్‌
  • రెండేళ్ల కనిష్టానికి ఐఓసీ
  • ఏడాదిన్నర కనిష్టానికి హెచ్‌పీసీఎల్‌

పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైంజ్‌ సుంకాలన్ని కేంద్రం లీటర్‌కు రూ.1.50, ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు లీటరుకు రూ.1.00 భరించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటనతో శుక్రవారం ఆయిల్‌ కంపెనీల ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 28 శాతం కుప్పకూలాయి. గత ట్రేడింగ్‌లో జైట్లీ ప్రకటన కారణంగా చివరి అరగంటలోనే ఆయిల్‌ కంపెనీ షేర్లు ఏకంగా 20శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం విధించిన అదనపు భారం వల్ల రానున్నరోజుల్లో కంపెనీల మార్జిన్లు, ఆదాయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. గత నష్టాల నష్టాల సెంటిమెంట్‌కు తోడు పలు బ్రేకరేజ్‌ సంస్థలు ఆయిల్‌ కంపెనీలపై టార్గెట్‌ ధరను తగ్గించడంతో షేరు ధరలు మరింత నష్టపోయాయి. ఉదయం గం.11:30లకు ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ-50 సూచీలోని టాప్‌-5 లూజర్లలో ట్రేడయ్యే 5 షేర్లు అయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు కావడం గమనార్హం.  
భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌ లిమిటెడ్‌(బీపీసీఎల్‌):- నేడు ఎన్‌ఎస్‌లో గత ముగింపు(రూ.331.15)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ.298.05ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయిల్‌ మార్కెట్‌ కంపెనీల షేర్లలో నెలకొన్న అమ్మకాలతో షేరు ఇంట్రాడేలో 28శాతం వరకు నష్టపోయి రూ.238.55ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ధర ఈ షేరుకు రెండున్నరేళ్ల కనిష్టస్థాయి. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధరతో పోలిస్తే 18శాతం నష్టంతో రూ.270.65ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ):- నేడు ఎన్‌ఎస్‌ఈలో గత ముగింపు(రూ.140.30)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ.126.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయిల్‌ మార్కెట్‌ కంపెనీల షేర్లలో నెలకొన్న అమ్మకాలతో షేరు ఇంట్రాడేలో 25శాతం వరకు నష్టపోయి రూ.105.25ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ధర ఈ షేరుకు రెండేళ్ల కనిష్టస్థాయి. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధరతో పోలిస్తే 15శాతం నష్టంతో రూ.118.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది.
హిందూస్తాన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌(హెచ్‌పీసీఎల్‌):- నేడు ఎన్‌ఎస్‌లో గత ముగింపు(రూ.217.15)తో పోలిస్తే 10శాతం నష్టంతో రూ.195.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయిల్‌ మార్కెట్‌ కంపెనీల షేర్లలో నెలకొన్న అమ్మకాలతో షేరు ఇంట్రాడేలో 24శాతం వరకు నష్టపోయి రూ.164.20ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఈ ధర ఈ షేరుకు ఏడాది కనిష్టస్థాయి. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు ధరతో పోలిస్తే 23శాతం నష్టంతో రూ.167.70 ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

సెన్సెక్స్‌ 500 పాయింట్లు డౌన్‌..

Friday 5th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 1:20 సమయంలో బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 502 పాయింట్ల నష్టంతో 34,667 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 10,409 పాయింట్ల వద్ద ఉంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గుదలపై కేంద్ర ప్రకటన నేపథ్యంలో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల స్టాక్స్‌ భారీగా పతనం కావడం, అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పడిపోవడం, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ

కొచర్‌ ఎగ్జిట్‌.. ఐసీఐసీఐకి పాజిటివ్‌..

Friday 5th October 2018

చందా కొచర్‌ బ్యాంక్‌ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థలు ఐసీఐసీఐ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉన్నాయి. యూబీఎస్‌, మెక్వైరీ సహా పలు సంస్థలు ఈ స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగించాయి. ► చందా కొచర్‌ తప్పుకోవడం ఐసీఐసీఐ బ్యాంక్‌కు పాజిటివ్‌ అంశమని యూబీఎస్‌ పేర్కొంది. షేర్‌హోల్డర్లు ఇకపై కోర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారంపై దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.410 నుంచి రూ.440కి పెంచింది. లోన్‌ బుక్‌

Most from this category