STOCKS

News


బైబ్యాక్‌, డివిడెండ్‌కు ఐవోసీకి తగిన వెసులుబాటు: ఫిచ్‌

Tuesday 18th December 2018
Markets_main1545071480.png-23010

ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్‌ పంపిణీకి ఇటీవల బోర్డులో నిర్ణయం తీసుకోగా, ఇందుకు రూ.11,000 కోట్ల నిధులను వ్యయం చేయనుంది. అయితే, ఈ మేర నిధుల సమీకరణ వనరులు దానికి ఉన్నట్టు ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ పేర్కొంది. 3.06 శాతం వాటాకు సమానమైన 29.76 కోట్ల ఈక్విటీ షేర్లను ఐవోసీ బైబ్యాక్‌ చేయాలని నిర్ణయించింది. ఒక్కో షేరు కొనుగోలు ధరగా రూ.149ను ఖరారు చేసింది. ఈ మొత్తానికి రూ.4,435 కోట్లు ఖర్చు చేయనుంది. అలాగే, ఒక్కో షేరుకు రూ.6.75 చొప్పున డివిడెండ్‌ చెల్లింపునకు మరో రూ.6,556 కోట్లు వ్యయం కానుంది. ‘‘ఐవోసీ ప్రతిపాదిత షేర్ల బైబ్యాక్‌, మధ్యంతర డివిడెండ్‌ అధిక రుణ భారానికి దారితీసినా ‘బిబి ప్లస్‌’ స్టాండలోన్‌ క్రెడిట్‌ రేటింగ్‌ కింద కంపెనీకి తగినంత వెసులుబాటు ఉంది’’అని ఫిచ్‌ తెలిపింది. 

 

రిఫైనరీలను నూతన ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఆధునికీకరించేందుకు విస్తరణ ప్రణాళికలు, తాజా షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్‌ పంపిణీతో కంపెనీ ఈక్విటీలో రుణ భారం పెరుగుతుందని ఫిచ్‌ తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.23,000 కోట్ల మేర, 2019-20లో రూ.27,500 కోట్ల మేర విస్తరణ ప్రణాళికలతో నెగెటివ్‌ క్యాష్‌ ఫ్లో కొనసాగుతుంది. అయితే, విస్తరణపై చేసిన పెట్టుబడులతో దీర్ఘకాలంలో ఐవోసీ, ఆస్తుల నాణ్యత మెరుగుపడుతుంది. సామర్థ్యం పెరగడం, ఆపరేటింగ్‌ క్యాష్‌ ఫ్లో రూపంలో ప్రయోజనం పొందుతుంది’’ అని ఫిచ్‌ తన నివేదికలో వివరించింది. ప్రభుత్వం తన పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వరంగ సంస్థలను షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్‌ పంపిణీల దిశగా ఒత్తిడి చేస్తు‍న్న విషయం తెలిసిందే. ఐవోసీలో కేంద్రానికి 54.06 శాతం వాటా ఉంది. తాజా షేర్ల బైబ్యాక్‌లో కేంద్ర ప్రభుత్వం పాల్గొననుంది. 



You may be interested

మిడ్‌క్యాప్స్‌లో ర్యాలీకి అవకాశం: ఐఐఎఫ్‌ఎల్‌

Tuesday 18th December 2018

మార్కెట్లపై నిరాశావాదం ముగిసిందని, నిఫ్టీ 11,000కు సమీపానికి చేరువైందని ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన సంజీవ్‌ భాసిన్‌ అన్నారు. తాను మార్కెట్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నట్టు చెప్పారు. ఇప్పటికీ ఎంతో భయాలు ఉన్నాయని, ఇన్వెస్టర్లు కరెక్షన్‌ కోసం ఎదరు చూస్తున్నారని పేర్కొన్నారు. ముడి చమురు బేర్స్‌ గుప్పిట్లోకి రావడంతో భారత్‌ తిరిగి ఆకర్షణీయంగా మారిందన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం విషయంలో ఉన్న అనిశ్చితులకు తెరపడినట్టు చెప్పారు. వచ్చే 3-4 నెలల పాటు మార్కెట్లు ఆశ్చర్యానికి

3నెలల గరిష్టానికి బీఈఎంఎల్‌

Monday 17th December 2018

 ముంబై మెట్రోపాలిటన్‌ రీజన్‌ డెవెలప్‌మెంట్‌ ఆథారిటీ(ఎంఎంఆర్‌డీఏ)నుంచి రూ.3015 కోట్ల విలువైన ఆర్డర్లు దక్కించుకోవడంతో ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌(బీఈఎంఎల్‌) సోమవారం 8.31శాతం లాభంతో ముగిసింది. ఎంఎంఆర్‌డీఏ నుంచి మెట్రో కోచ్‌ల నిర్మాణం, సరఫరాలకు సంబంధించి మొత్తం 378 మెట్రో కోచ్‌ల సరఫరాకు ఆర్డర్‌ లభించినట్లు బీఈఎంఎల్‌ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. కాంట్రాక్టు విలువ రూ.3015 కాగా... 2020 జులై-2022 సెప్టెంబర్‌ నుంచీ వీటి సరఫరాలను ప్రారంభించనున్నట్లు

Most from this category