STOCKS

News


ఐఓసీ షేర్లకు బైబ్యాక్‌ ఆఫర్‌ జోష్‌

Monday 10th December 2018
Markets_main1544427969.png-22803

ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఆఫర్‌ జోష్‌తో ప్రభుత్వరంగ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌(ఐఓసీ) షేర్లు మార్కెట్‌ నష్టాలకు ఎదురీదుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు, ఇటీవల వెలువడిన ఐదు రాష్ట్రాల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపడంతో సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్న సంగతి తెలిసిందే. ఐఓసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూ, షేరుపై మధ్యంతర డివిండెండ్‌ ప్రకటనపై చర్చించేందుకు కంపెనీ రేపు (డిసెంబర్‌ 13న) బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ వార్తలతో నేటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు ఐఓసీ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపారు. ఫలితంగా షేరు బీఎస్‌ఈ ట్రేడింగ్‌లో 4శాతం లాభపడి రూ.134.50ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:40ని.లకు షేరు గత ముగింపుధర(రూ.129.55)తో పోలిస్తే 3శాతం లాభంతో రూ.133.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.105.65 రూ.213.80లుగా నమోదయ్యాయి.



You may be interested

ఈ వారం ట్రేడింగ్‌ జోలికెళ్లొద్దు..

Monday 10th December 2018

బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు గత వారంలోని ఐదు ట్రేడింగ్‌ సెషన్లలోకెల్లా నాలుగు సెషన్లలో కరెక‌్షన్‌కు గురయ్యాయని ఈక్విటీ99 ఫౌండర్‌ సుమిత్‌ బిల్గైయన్‌ తెలిపారు. ఇదేసమయంలో గ్లోబల్‌ మార్కెట్లలోనూ తీవ్ర ఒడిదుడుకులు ఉన్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు మన మార్కెట్లపై నెగటివ్‌ ప్రభావం చూపాయని తెలిపారు. అయితే ఇప్పుడు అందరి కళ్లు డిసెంబర్‌ 11 నాటి ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు వీటిని సెమీఫైనాల్స్‌గా భావించొచ్చని

తగ్గితే.. కొనండి..

Monday 10th December 2018

నిఫ్టీ 10,960 మార్క్‌ను అధిగమించడంలో విఫలమైందని రుద్రా షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ మనాలి భాటియా తెలిపారు. గత వారంలో 1.68 శాతం మేర పతనమైందని, 10,693 వద్ద ముగిసిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకులు ఉండొచ్చని అంచనా వేశారు. రాజస్తాన్‌లో బీజేపీ ఓడిపోతుందని మార్కెట్‌ వర్గాలు ఇప్పటికే అంచనాకు వచ్చేశాయని తెలిపారు. అయితే మధ్యప్రదేశ్‌, ఛత్తీశ్‌గఢ్‌లలో

Most from this category