STOCKS

News


స్టాక్స్‌ ఎంపిక ముందు చూడాల్సిన అంశాలు 

Sunday 24th February 2019
Markets_main1551031983.png-24302

దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ రితేష్‌ అషర్‌ తెలిపారు. ఓ వార్తా సంస్థకు ఆయన పలు అంశాలపై ఇంటర్వ్యూ ఇచ్చారు.

 

నిఫ్టీకి బోటమ్‌ పూర్తయిందా... లేక కరెక్షన్‌ ఇంకా ఉందా..?
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఇటీవలి మార్కెట్‌ బలహీనతకు కారణం. ఈ అనిశ్చితి కొన్ని నెలల పాటు కొనసాగొచ్చు. ఎన్నికల అంశం మరిన్ని ఆటుపోట్లకు కారణమవుతుంది. మార్కెట్లు ఈ స్థాయిల్లో కనిష్టాలను నమోదు చేస్తాయన్న సంకేతాలు లేవు.

 

చాలా వరకు స్టాక్స్‌ బోటమ్‌ అవుట్‌ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు కదా?
దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేసే వారు పరిగణణలోకి తీసుకోవాల్సిన అంశాలు... పోటీ విషయంలో కంపెనీకి అనుకూలతలు ఉండాలి. యాజమాన్యానికి విజన్‌ ఉండాలి. విలువలతో కూడిన వ్యాపారం అవసరం (కార్పొరేట్‌ గవర్నెన్స్‌). ఉత్పత్తులు, మార్కెట్‌ వాటా బలంగా ఉండాలి. 

 

సాంకేతికంగా మార్కెట్‌ ఎలా ఉంది?
10,585ను నిఫ్టీ పరీక్షించింది. కనుక 11,000 దిశగా పుల్‌బ్యాక్‌ ఉంటుందని అంచనా వేస్తున్నాం. మధ్య కాలానికి ఏ వైపు బ్రేకవుట్‌ వచ్చిందన్న దాని ఆధారంటా ట్రెండ్‌ ఉంటుంది. 

 

స్మాల్‌, మిడ్‌క్యాప్‌పై సూచనలు..?
మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కీలకమైన సూచీలను మించి మెరుగైన పనితీరు చూపించే ధోరణితో ఉంటాయి. మల్టీబ్యాగర్లకు మాత్రం తమదైన ప్రత్యేకతలు ఉంటాయి. గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్స్‌ 40-45 శాతం దిద్దుబాటుకు గురయ్యాయి. కనుక వీటి కొనుగోలుకు ఇది అద్భుతమైన అవకాశం. స్టాక్‌వారీగా నడుచుకోవాలి.

 

మెటల్స్‌లో ఆకర్షణీయమైన స్టాక్స్‌ ఉన్నాయా?
గత రెండు నెలలుగా అదే పనిగా కరెక్షన్‌కు గురి కావడంతో దీన్ని రివర్సల్‌గా చూడరాదు. మేజర్‌ పుల్‌బ్యాక్‌గా భావించొచ్చు. హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ రెండు మూడో త్రైమాసికానికి మంచి ఫలితాలను ఇచ్చాయి. You may be interested

స్మాల్‌క్యాప్స్‌లో ప్రైస్‌ కరెక్షన్‌ ముగిసినట్టే...

Sunday 24th February 2019

గత కొన్ని నెలల్లో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ బాగా దిద్దుబాటుకు గురయ్యాయి. ముఖ్యంగా చాలా స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ 50 శాతానికి పైగా పతనమయ్యాయి. దీంతో అంతకుముందు రెండు, మూడేళ్ల కాలంలో ఇచ్చిన రాబడులన్నీ హరించుకుపోయాయి. మరి దీనికి కారణం ఏంటి? స్మాల్‌క్యాప్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విషయంలో ఎలా అనుసరించాలి? అనే విషయాలను రిలయన్స్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ మేనేజర్‌ సమీర్‌ రాచ్‌ తెలియజేశారు.    గత ఏడాది కాలంలో స్మాల్‌క్యాప్స్‌ చాలా బాగా నష్టపోయాయి.

బ్లూచిప్‌ కంపెనీల్లో ఆకర్షణీయ బెట్స్‌!

Sunday 24th February 2019

సాధారణ ఎన్నికలు ముగిసే వరకు మార్కెట్లు అస్థితంగానే ఉంటాయని, ఈ లోపు అంతర్జాతీయ అంశాలు మార్కెట్లను ప్రధానంగా నిర్దేశిస్తాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రిటైల్‌ బ్రోకింగ్‌ హెడ్‌ రాజీవ్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇన్వెస్టర్లు ‍స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో నష్టాలను బుక్‌ చేసుకుని నాణ్యమైన లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘‘2018 డిసెంబర్‌ త్రైమాసికం కార్పొరేట్‌ కంపెనీలు ఫలితాలు బలహీనంగా ఉన్నాయి. కొన్ని లార్జ్‌క్యాప్‌ కంపెనీల్లో తలెత్తిన

Most from this category