STOCKS

News


ఎన్నికలైతే తిరిగి విదేశీ నిధుల రాక: ట్రేడింగ్‌బెల్స్‌ 

Tuesday 14th May 2019
Markets_main1557773679.png-25714

మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే కనీసం పదేళ్ల కాలాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని ట్రేడింగ్‌బెల్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్‌గుప్తా సూచించారు. ఎన్నికల ఫలితాలు వెలువడి, ఓ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తే తిరిగి విదేశీ నిధులు దండిగా వస్తాయని అభిప్రాయపడ్డారు. ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ సందర్భంగా వివిధ అంశాలపై ఎదురైన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 


ఎన్నికల ముందు ఇన్వెస్టర్ల ముందున్న మార్గం?
ఎటుంటి సానుకూల ట్రిగ్గర్లు లేకపోవడంతో సూపర్‌ ట్రెండ్‌, ఎంఏసీడీ సెల్‌ సిగ్నల్‌నే ఇస్తున్నాయి. ఇది కేవలం ఎన్నికల ఫలితాలకు సంబంధించినది కాదు. అంతర్జాతీయ సంకేతాలు సైతం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లకు నిలువరిస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న ఈ తరుణంలో దీర్ఘకాల ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను తగ్గించుకోకూడదు. వేచి చూసే సమయం ఇది. ఆటుపోట్లు సర్దుకునే వరకు ఆగాలి.   


పడిపోయిన మిడ్‌క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చా?
వారెన్‌ బఫెట్‌ను అనుసరించే వ్యక్తిగా కనీసం పదేళ్ల కాలం కోసం అయితేనే మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడాన్ని పరిశీలించాలని సూచిస్తాను. అలాగే, క్రమం తప్పకుండా పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తూ ఉండాలి. ‘ఓ స్టాక్‌ను పదేళ్ల పాటు ఉంచుకోలేనప్పుడు కనీసం పది నిమిషాలు కూడా అందులో కొనసాగవద్దు’ అనేది బఫెట్‌ చెప్పే మాట. ప్రతీ లార్జ్‌క్యాప్‌ ఏదో ఒకరోజున మిడ్‌క్యాప్‌ కంపెనీయే. ప్రస్తుతం మిడ్‌క్యాప్‌ విభాగంలో ఆకర్షణీయమైన షేర్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌ రంగంలో ఏయూ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు. కనీసం 30-50 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌నకు కేటాయించుకోవచ్చు. 


ఎన్నికల ఫలితాలను మార్కెట్లు ప్రైస్‌ఇన్‌ చేసుకుంటున్నాయా?
సాధారణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి అనిశ్చితి పెరిగిపోయింది. దీన్ని మార్కెట్లు ఇష్టపడవు. అదే సమయంలో అమెరికా-చైనా వాణిజ్య సంబంధాలు, మార్చి త్రైమాసికం ఫలితాలు మార్కెట్‌ సెంటిమెంట్‌కు సానుకూలంగా లేవు. ఎనర్జీ, టెలికం, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, విద్యుత్‌ రంగాల్లో గత వారం రోజుల్లో విక్రయాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక కేవలం ఎన్నికల ఫలితాల అంశమే కాకుండా అంతర్జాతీయ సంకేతాలు కూడా మార్కెట్‌ బలహీనతనకు కారణం. 


విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల వెనుక వ్యూహం...?
మే ఆరంభం నుంచి భారత మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు కారణం ఎన్నికల ఫలితాల చుట్టూ నెలకొన్న అనిశ్చితే. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రముఖ మార్కెట్లకు మన మార్కెట్లు భిన్నంగా ఏమీ లేవు. ఒక్కసారి ఫలితాలు వచ్చేసి, ఏదైనా ఓ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తే విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ఇదే ధోరణి మరికొన్ని సెషన్ల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత తిరిగి ఎఫ్‌ఐఐల నుంచి పెట్టుబడులు వస్తాయి.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 40 పాయింట్లు డౌన్‌

Tuesday 14th May 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిష్కారం డోలాయమానంలో  కొనసాగడంతో ఆసియా మార్కెట్లు క్షీణించిన నేపథ్యంలో వరుసగా 9 రోజులపాటు నష్టాల్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ మంగళవారం  సైతం గ్యాప్‌డౌన్‌తో  ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.50 గంటలకు  40 పాయింట్లకుపైగా నష్టపోయి11,138 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ నిఫ్టీ మే ఫ్యూచర్‌ 11,181 పాయింట్ల వద్ద ముగిసింది. తాజాగా ఆసియాలో జపాన్‌

ఐటీసీ కొత్త ఛైర్మన్‌గా సంజీవ్ పురి

Monday 13th May 2019

ఐటీసీ నూతన ఛైర్మన్‌గా సంజీవ్‌పురి నియమితులయ్యారు. గత కొద్దికాలంగా అస్వస్థతతో బాధపడుతున్న దేవేశ్వర్‌(72) శనివారం తుదిశ్వాస విడిచిన నేపథ్యంలో బోర్డు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు నేడు కంపెనీ స్టాక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. సంజీవ్‌పురి ఐఐటీ ఖరగ్‌పూర్‌, వార్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. ఐటీసీలో 1986లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సంజీవ్‌ వివిధ విభాగాల్లో కంపెనీకి సేవలు అందిస్తున్నారు. ఐటీసీ అనుంబంధ సంస్థలైన ఇన్ఫోటెక్‌,

Most from this category