STOCKS

News


నెలలో 14 లక్షల కోట్లు ఆవిరి

Saturday 29th September 2018
Markets_main1538213672.png-20714

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు సెప్టెంబర్‌ ఒక్క నెలలోనే రూ.14 లక్షల కోట్లు పోగుట్టుకున్నారు. బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ సెన్సెక్స్‌ 6 శాతానికి పైగా పడిపోయింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల డిఫాల్ట్‌ నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీల్లో లిక్విడిటీ ఆందోళనలు పెరగడం ఇందుకు ప్రధాన కారణం. 
మొత్తం ఇన్వెస్టర్ల సంపద (బీఎస్‌ఈలో లిస్టైన అన్ని స్టాక్స్‌ మొత్తం మార్కెట్‌ వ్యాల్యు) సెప్టెంబర్‌లో రూ.14.48 లక్షల కోట్ల తగ్గుదలతో రూ.144.86 లక్షల కోట్లకు క్షీణించింది. 2018 ఆగస్ట్‌ 31 నాటికి బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.159.35 లక్షల కోట్లుగా ఉంది. 

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ శుక్రవారం 36,227 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నెల మొత్తంగా చూస్తే ఇండెక్స్‌ 6.3 శాతం లేదా 2,418 పాయింట్లమేర పతనమైంది. నెల ప్రారంభంలో ఇండెక్స్‌ 38,645 పాయింట్ల వద్ద ఉంది. 2016 ఫిబ్రవరి తర్వాత సెన్సెక్స్‌ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే ప్రథమం. అప్పుడు ఇండెక్స్‌ 7.5 శాతంమేర పతనమైంది. సెప్టెంబర్‌లో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌లు వరుసగా 13 శాతం, 16 శాతం నష్టపోయాయి.
ఫైనాన్షియల్స్‌, ఆటోమొబైల్‌ రంగాలకు చెందిన కంపెనీలు ఎక్కువగా నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. హరించుకుపోయిన మార్కెట్‌ క్యాప్‌లో వీటి వాటా రూ.6.14 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్‌ క్యాప్‌ ఎక్కువగా నష్టపోయిన కంపెనీల్లో మారుతీ సుజుకీ ముందుంది. దీని తర్వాతి స్థానంలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, గోద్రెజ్‌ కన్సూమర్‌ ప్రొడక్ట్స్‌, నెస్లె, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటి పలు కంపెనీలు ఉన్నాయి. 
 
 



You may be interested

డాలర్‌.. ఓవర్‌ వాల్యూడ్‌!

Saturday 29th September 2018

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నివేదిక యూఎస్‌లో మందగమనం వచ్చే అవకాశాలు బాగా తగ్గాయని, క్రమంగా వడ్డీరేట్లను పెంచుతామని ఫెడ్‌ చైర్మన్‌ చేసిన వ్యాఖ్యలు డాలర్‌ ఇండెక్స్‌లో పరుగులకు దారితీసాయి. ఈ ఏడాది పలు కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ బాగా బలపడుతోంది. ఫిబ్రవరి నుంచి డీఎక్స్‌వై(డాలర్‌ ఇండెక్స్‌) ఆరు శాతం లాభపడింది. యూఎస్‌ ఎకానమీ మంచి వృద్ధి నమోదు చేస్తుండడం, ఫెడ్‌ రేట్లను పెంచడంతో డాలర్‌పై పెట్టుబడులు పెరిగాయి. ఇదే సమయంలో వర్ధమాన కరెన్సీలు

గట్టెక్కడానికి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రైట్స్‌ ఇష్యూ!!

Saturday 29th September 2018

డిఫాల్ట్‌ సమస్యల నుంచి బయటపడేందుకు ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. కంపెనీ తన స్వల్పకాలిక ఫండింగ్‌ అవసరాలను అధిగమించడానికి అసెట్స్‌ విక్రయించే అవకాశముంది. ప్రస్తుత 19 రోడ్డు ప్రాజెక్టులలో 14 వాటిని విక్రయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై కంపెనీ అటు ఆర్‌బీఐతో, ఇటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరోవైపు కంపెనీ ఏజీఎం శనివారం ముగిసింది. కంపెనీ ప్రతిపాదిత రూ.4,500 కోట్ల విలువైన రైట్స్‌ ఇష్యూ ప్రక్రియ అక్టోబర్‌

Most from this category