STOCKS

News


ఈ రంగాల స్టాక్స్‌ కొనొచ్చు..

Tuesday 24th July 2018
Markets_main1532428619.png-18620

ఇన్వెస్టర్లు స్వల్పకాలంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అబకాస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఫౌండర్‌ సునీల్‌ సింఘానియా. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధం, కరెన్సీ యుద్ధం వంటి అంశాలను ఇందుకు కారణంగా పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లోనూ అవకాశాలున్నాయంటున్నారు. మార్కెట్‌ లైఫ్‌ సైకిల్‌లో భాగంగా మిడ్‌ క్యాప్స్‌లో హెచ్చుతగ్గులు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ సానుకూలతల నేపథ్యంలో సెప్టెంబర్‌ 30 వరకు కొన్ని రంగాల స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. అవేంటో చూద్దాం.. 
 
సిమెంట్‌
సిమెంట్‌ విభాగంలో దక్షిణ భారతదేశంలో ఓవర్‌ సప్లై ఉందన్నారు. వాల్యూమ్‌ వృద్ధి బాగానే ఉందని తెలిపారు. హౌసింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో అధిక వ్యయాల వల్ల ధరల పెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు. ఏసీసీ వంటి కంపెనీలు మంచి పనితీరు కనబరుస్తాయని పేర్కొన్నారు. వ్యాల్యుయేషన్స్‌ సముచిత స్థాయిలోనే ఉన్నాయని తెలిపారు.

వినియోగ రంగం
వినియోగ రంగంలో మిశ్రమ ధోరణి ఉందని తెలిపారు. అయితే దేశ జనాభా కారణంగా ఈ విభాగంలో మంచి వృద్ధి నమోదు కావొచ్చన్నారు. అందువల్ల ఈ విభాగంలోని స్టాక్స్‌ బాగా ర్యాలీ చేయవచ్చని తెలిపారు. 

ఆటో
‘ఎంట్రీ లెవెల్‌ విభాగంలో బలమైన కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుంది. మెటల్స్‌ ధర తగ్గుదల సానుకూల అంశం’ అని బజాజ్‌ ఆటో పేర్కొంది. దీనిబట్టి టూవీలర్‌ విభాగంపై కొంత ఆందోళన  వ్యక్తంచేశారు. వాణిజ్య వాహన విభాగంపై సానుకూలముగా ఉన్నారు. 



You may be interested

స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పతనం సాంకేతికమే

Wednesday 25th July 2018

బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీలు నూతన జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరుకుని ఉండొచ్చు. కానీ, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు ఇంకా బేల చూపులు చూస్తూనే ఉన్నాయి. ఇవి ఎప్పుడు కోలుకుంటాయి? అసలు రికవరీ ఇప్పట్లో ఉంటుందా? ఈ తరహా సందేహాలు ఇన్వెస్టర్లలో తలెత్తుతున్నాయి. అయితే, ఇదంతా సాంకేతికంగా జరిగిన కరెక్షన్‌ మాత్రమేనని, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ మూలాలు దెబ్బతినలేదని ప్రముఖ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ పేర్కొన్నారు.    ఈ ఏడాదిలో

నిఫ్టీ రికార్డు ముగింపు

Tuesday 24th July 2018

ముంబై:- మెటల్‌, ఫార్మా, ఐటీ షేర్ల మద్దతుతో మార్కెట్‌ మంగళవారం లాభాలతో ముగిసింది. ఎల్‌ అండ్‌ టీ, గ్రాసీం, ఆదిత్యా బిర్లా గ్రూప్‌ షేర్ల అండతో సెన్సెక్స్‌ మరో నూతన గరిష్టస్థాయిని నమోదు చేసింది. మరో సూచి నిఫ్టీ ముగింపులో కొత్త రికార్డును సృష్టించింది. మిడ్‌ సెషన్‌ అనంతరం బ్యాంకు షేర్లలో అమ్మకాలు నెలకొన్నా, చివరి గంటలో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సూచీలు వరుసగా మూడోరోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 106 పాయింట్ల లాభంతో

Most from this category