News


ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి: నిపుణులు

Tuesday 11th September 2018
Markets_main1536604994.png-20135

రూపాయి ఒకే రోజు 72 పైసలు పతనం కావడం, ఫలితంగా దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం కుప్పకూలడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసేదే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

11,200 దిశగా నిఫ్టీ...
‘‘నిఫ్టీ ఆరు నెలల్లోనే ఒకే రోజు 1.3 శాతం పతనమైంది. మార్కెట్‌లో లాభపడిన వాటి కంటే నష్టపోయిన షేర్లే ఎక్కువ ఉన్నాయి. స్వల్ప కాల డౌన్‌ ట్రెండ్‌లోకి మార్కెట్‌ ప్రవేశించింది. ఈ పతనం తదుపరి మద్దతు స్థాయి అయిన 11,200 వరకు ఉండొచ్చు. ఈ వారంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. నిఫ్టీ నిరోధ స్థాయి రూ.11,620. దేశీయ మార్కెట్లు పడిపోవడానికి రూపాయి క్షీణతే మొదటి కారణం. దీంతో షార్ట్‌ టర్మ్‌ స్పెక్యులేటర్లు తమ పొజిషన్లను అమ్మేసుకుంటున్నారు. ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్స్‌ బలహీనంగా కనిపిస్తున్నాయి. కరెన్సీ వేగంగా పడిపోవడంతో ఆర్‌బీఐ వడ్డీ రేట్లను స్వల్ప కాలంలో పెంచక తప్పదు. దీంతో ఈ కంపెనీల మార్జిన్లపై ప్రభావం పడుతుంది. రానున్న సెషన్లలో ఈ స్టాక్స్‌కు నష్టాలు ఉంటాయి’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ క్లయింట్‌ గ్రూపు హెడ్‌ వీకే శర్మ తెలిపారు. 

 

రూపాయి సవాలే
‘‘రూపాయి నిరంతరాయ పతనం ఇప్పుడు ఈక్విటీలు సహా అన్ని సాధనాలపైనా ప్రభావం చూపించడం మొదలైంది. స్టాక్‌ మార్కెట్లకు సెంటిమెంట్‌ రిస్క్‌ అన్నది ఇప్పుడు పెద్ద సవాలు. ఈ సమయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎగుమతి ఆధారిత కంపెనీలు, రుణ భారం లేని కంపెనీల్లోకి తమ పెట్టుబడులను మళ్లించుకోవడం మంచిది. బాండ్ల ఈల్డ్స్‌ నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. ప్రభుత్వం, ఆర్‌బీఐ ఈ రెండూ రూపాయి, బాండ్ల సవాళ్లను ఏ విధంగా ఎదుర్కొంటాయన్నది చూడాల్సి ఉంది. 2014 నుంచి 2018 మధ్య పరిస్థితుల్లో వైరుధ్యం నెలకొంది. 2014లో స్థూల ఆర్థికాంశాలు మెరుగుపడుతుంటే, కంపెనీల ఆదాయాలు బలహీనంగా ఉన్నాయి. కానీ, ఇప్పుడు కంపెనీల ఆదాయాలు పుంజుకుంటుంటే, స్థూల ఆర్థిక అంశాలు ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి’’ అని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తూనుగుంట్ల తన అభిప్రాయాలను వివరించారు. You may be interested

నష్టాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Tuesday 11th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం నష్టాలతో ట్రేడవుతోంది. ఉదయం 8:53 సమయంలో సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 13 పాయింట్ల నష్టంతో 11,473 పాయింట్ల వద్ద ఉంది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో సోమవారం నాటి ముగింపు 11,492 పాయింట్లతో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 19 పాయింట్ల నష్టంతో ట్రేడవుతుందని గమనించాలి. దీంతో నిప్టీ మంగళవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు జపాన్‌ ఇండెక్స్‌ మినహా మిగతా

లుపిన్‌, జేఎస్‌డబ్ల్యూ విషయంలో ఏం చేయవచ్చు?

Tuesday 11th September 2018

నిఫ్టీ50లోకి కొత్తగా జేఎస్‌డబ్ల్యూ రానుండగా, దీనికి బదులు సూచీ నుంచి లుపిన్‌ బయటకు వెళ్లిపోనుంది. ఈ నెల 28 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అనుసరించాల్సిన విధానం ఏమిటో నిపుణుల సూచనల ఆధారంగా తెలుసుకుందాం.   ఆగస్ట్‌ 28న నిఫ్టీ ఇండెక్స్‌ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 10 శాతం వరకు ర్యాలీ చేసింది. అయితే, ఇదంతా తాత్కాలిక

Most from this category