STOCKS

News


ఫిజికల్‌ రూపంలో షేర్లను కలిగి ఉండొచ్చు: సెబీ

Sunday 12th August 2018
Markets_main1534075468.png-19185

ఇన్వెస్టర్లు ఫిజికల్‌ పత్రాల రూపంలో షేర్లను కలిగి ఉండడంపై ఇన్వెస్టర్లలో సందేహాలు నెలకొనడంతో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వివరణ ఇచ్చింది. ఇన్వెస్టర్లు ఫిజికల్‌ రూపంలోనూ షేర్లను కలిగి ఉండొచ్చని స్పష్టం చేసింది. తమ నూతన మార్గదర్శకాలు డిసెంబర్‌ 5 తర్వాత ఇన్వెస్టర్లు ఫిజికల్‌ రూపంలో కలిగి ఉండడాన్ని నిషేధించడం లేదని పేర్కొంది. సెబీ ఇటీవలి మార్గదర్శకాల్లో స్పష్టత లోపించడంతో సెబీకి ఎంతో మంది ఇన్వెస్టర్ల నుంచి కాల్స్‌ వస్తుండడంతో తాజా స్పష్టత ఇచ్చింది. 

 

జూలైలో సెబీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. షేర్లను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలంటే అవి ఈ ఏడాది డిసెంబర్‌ 5 తర్వాత కచ్చితంగా డీమ్యాట్‌ (ఎలక్ట్రానిక్‌ రూపంలో)లోనే ఉండాలని అందులో పేర్కొంది. దీనిపై సెబీ వివరణ ఇస్తూ... ‘‘నూతన సవరణ ఇన్వెస్టర్లు షేర్లను ఫిజికల్‌ రూపంలో కలిగి ఉండకుండా నిషేధించదు’’ అని సెబీ ఓ ప్రకటన విడుదల చేసింది. వారసత్వంగా, ఒకరి మరణానంతరం షేర్ల మార్పిడికి కొత్త నిబంధన వర్తించదని కూడా స్పష్టం చేసింది. డిసెంబర్‌ 5 తర్వాత ఇన్వెస్టర్లు పత్రాల రూపంలో ఉన్న షేర్లను బదిలీ చేసుకోదలిస్తే, వాటిని డీమెటీరియలైజ్‌ చేసిన తర్వాతే సాధ్యపడుతుందని సెబీ తెలిపింది.



You may be interested

నానో కథ ముగిసినట్టే... పెలికాన్‌ రానట్టే!?

Sunday 12th August 2018

సామాన్యుడి ‘సొంత కారు’ కలను సాకారం చేయాలంటూ రతన్‌ టాటా స్వప్నించి తీసుకొచ్చిన నానో కారు కథ ముగిసినట్టేనా..? టాటా మోటార్స్‌ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, పరిశీలకులు మాత్రం ఇదే భావిస్తున్నారు. సామాన్యుడికి సొంత కారు, తమకు లాభాల కారుగా మారుతుందన్న నానో, అటు సామాన్యుడినీ ఆకట్టుకోలేకపోయింది... ఇటు టాటా మోటార్స్‌కు సైతం లాభాలు లేకపోగా నష్టాల ప్రాజెక్టుగా మారి కూర్చుంది. జూన్‌ నెలలో టాటా

తక్కువ ధరల్లో ఎన్నో షేర్లు

Sunday 12th August 2018

విలువైన స్టాక్స్‌ ఏవి? మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌లో చాలా వరకు షేర్లు నష్టపోయి తక్కువ ధరలకే లభిస్తున్న ఈ తరుణంలో పెట్టుబడులకు మంచి స్టాక్స్‌ ఏవన్న మీమాంసతో ఇన్వెస్టర్లు కొందరు ఉన్నారు. ఈ విధంగా చూసినప్పుడు 40 శాతం వరకు పతనమైన తక్కువ ధరలకు లభిస్తున్న కొన్ని వాల్యూ స్టాక్స్‌ ఉన్నాయంటున్నారు నిపుణులు.    ప్రధాన సూచీలు కొత్త జీవిత శిఖరాలకు చేరినప్పటికీ మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాలు మాత్రం ఇంకా

Most from this category