STOCKS

News


తొమ్మిదేళ్ల కనిష్టానికి పీనోట్స్‌ పెట్టుబడులు

Wednesday 17th October 2018
Markets_main1539749828.png-21218

న్యూఢిల్లీ: మన క్యాపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్స్‌ (పీ నోట్స్‌)  పెట్టుబడులు తొమ్మిదిన్నరేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయి. సెప్టెంబర్‌ చివరికి రూ.79,548 కోట్లుగా ఉన్నాయి. పీ నోట్స్‌ను సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు జారీ చేస్తుంటారు. తమ పేర్లను నేరుగా నమోదు చేసుకోకుండా మన మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లు వీటిని తీసుకుంటుంటారు. సెబీ గణాంకాల ప్రకారం మన మార్కెట్లలో ఈక్విటీ, డెట్‌, డెరివేటివ్స్‌లో పీ నోట్స్‌ పెట్టుబడులు సెప్టెంబర్‌ చివరికి రూ.79,548 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెల ఆగస్ట్‌లో ఇవి రూ.84,647 కోట్లుగా ఉండడం గమనార్హం. పది నెలల కాలంలో పీ నోట్స్‌ పెట్టుబడులు పెరిగింది ఆగస్ట్‌లోనే. పీ నోట్స్‌ దుర్వినియోగం జరగకుండా సెబీ తీసుకున్న చర్యలే పెట్టుబడులు తగ్గడానికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈక్విటీల్లో పీ నోట్స్‌ పెట్టుబడులు రూ.60,164 కోట్లుగా ఉండగా, మిగిలినవి డెట్‌, డెరివేటివ్‌ మార్కెట్లో ఉన్నాయి. పీ నోట్ల పెట్టుబడులు గతేడాది జూన్‌ నుంచి క్షీణిస్తూనే ఉన్నాయి. 2017 సెప్టెంబర్‌లో ఎనిమిదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గగా, అదే ఏడాది అక్టోబర్‌లో స్వల్పంగా పెరిగి తిరిగి నవంబర్లో తగ్గాయి.  



You may be interested

ఉక్కు డిమాండ్‌లో వృద్ధి..!

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: భారత ఉక్కు డిమాండ్‌ ఈఏడాదిలో 1,657.9 మిలియన్‌ టన్నులు (ఎంటీ)గా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఉక్కు స‌మాఖ్య (వరల్డ్ స్టీల్) అంచనావేసింది. గతేడాది డిమాండ్‌తో పోల్చితే ఇది 3.9 శాతం అధికంగా ఉన్నట్లు తెలిపింది. డీమానిటైజేషన్‌, వస్తు సేవల పన్ను అమలు వంటి అంశాల నుంచి పరిశ్రమ కోలుకుంటున్న నేపథ్యంలో ఈమేరకు అంచనాను విడుదలచేసినట్లు పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉన్నందున అభివృద్ధి చెందుతున్న దేశాల్లో

జీపీఎఫ్‌ వడ్డీరేటు 0.4 శాతం పెంపు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: జనరల్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌), సంబంధిత ఇతర స్కీమ్‌ల వడ్డీరేటును అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) రేటుకు అనుగుణంగా ఈ రేట్లలో మార్పు చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ పెంపు నిర్ణయంతో జీపీఎఫ్‌పై వడ్డీరేటు 7.6 శాతం (జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో) నుంచి 8 శాతానికి

Most from this category