STOCKS

News


క్రికెట్‌ మాదిరి ఇన్వె‍స్ట్‌మెంట్‌ ప్రణాళిక

Tuesday 7th August 2018
Markets_main1533666541.png-19022

ఇన్వెస్టర్లకు సమయం చాలా కీలకమైనదిగా ప్రముఖ ఇన్వెస్టర్‌, కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా పేర్కొన్నారు. క్రికెట్‌లో మాదిరి వ్యూహాలను పెట్టుబడులకు అనుసరించాల్సి ఉంటుందంటూ, క్రికెట్‌ ఫార్మాట్‌ను బట్టి గేమ్‌ ప్లాన్‌ మార్చుకున్నట్టే... ఇన్వెస్టర్లు, వారి పెట్టుబడుల కాల వ్యవధులకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు ఏ విధంగా నడుచుకోవాలన్నది ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

 

ఉదాహరణకు టెస్ట్‌మ్యాచ్‌ అనేది ఐదు రోజుల పాటు కొనసాగే ఆట. కానీ, ఈ రోజు చాలా స్వల్ప సమయం పాటు ఆడే ఫార్మాట్‌లు కూడా వచ్చేశాయి. టెస్ట్‌ మ్యాచ్‌లో ఏ సమయంలో వచ్చారు, వెళ్లారన్నది కాకుండా, పిచ్‌లో నిలబడడమే ముఖ్యం. అదే 50 ఓవర్లతో కూడిన ఒక రోజు మ్యాచ్‌లో కాలం, నిలదొక్కుకోవడం రెండూ ముఖ్యమైన అంశాలు. అంటే ఇక్కడ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. టి20 మ్యాచ్‌లో కాలం చాలా కీలకం. గేమ్‌లో ఉండడం కంటే ప్రతీ బాల్‌కు పరుగులు చేయడం ముఖ్యం. దీని ప్రకారం స్వల్పకాలిక ఇన్వెస్టర్‌ అయితే టైమింగ్‌ గురించి ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే వ్యాపార కాల వ్యవధి తక్కువే కనుక. మధ్య కాలిక ఇన్వెస్టర్‌కు కాలం, నిలదొక్కుకోవడం ఈ రెండూ కీలకమైనవి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు సంబంధిత కంపెనీ నిలదొక్కుకోవడం ముఖ్యమైన అంశం అవుతుంది. నేను మార్కెట్‌ను క్రికెట్‌ కోణం నుంచి చూసేది ఈ విధంగానే. 

 

టాప్‌, బాటమ్‌ ఇద్దరికే తెలుసు

మార్కెట్‌ బాటమ్‌, టాప్‌ (కనిష్ట, గరిష్టాలు) గురించి వింటుంటాం. కానీ వాస్తవం ఏంటంటే కేవలం ఇద్దరు మాత్రమే కనిష్ట స్థాయిలో కొని గరిష్ట స్థాయిలో అమ్మగలరు. అది ఒకరు దేవుడు, మరొకరు అబద్ధాలాడేవారు. దేవుడితో ఎలా మాట్లాడాలో తెలియదు. అబద్ధాలు చెప్పేవారిని ఎలా విశ్వసించాలో తెలియదు. కనిష్టంలో కొని గరిష్టంలో విక్రయించాలనుకుంటాం. నిజానికి ఇది జరగదు. అసాధ్యం కూడా. ఎందుకంటే ఎక్కడ గరిష్టం, ఎక్కడ కనిష్టం అన్నది తెలియదు. ఒకవేళ ఎవరైనా కనిష్ట ధరలో కొనుగోలు చేశారనుకోండి. ముందుగానే బయటకు వచ్చేస్తారు. పెట్టుబడి పరిపక్వానికి రాకముందే వెనక్కి తీసుకుంటారు. ఆ స్టాక్‌ తన సైకిల్‌ పూర్తి చేసే వరకు దానిపై నమ్మకం ఉంచరు. కనిష్టంలో కొనాలని వేచి ఉండడం కంటే మార్కెట్లు తగ్గినప్పుడు కొనడం చేయాలి. మార్కెట్లు భారీగా పడినప్పుడు స్థిరపడే వరకు ఆగి కొనుగోలు చేయాలి. కనిష్టం ముగిసిందని తెలిసిన తర్వాత ఆ స్టాక్‌ను కనిష్ట స్థాయిలో కొనుగోలు చేయడం సాధ్యం కాదు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్‌ అయితే కనిష్టం నుంచి 10-20 శాతం అధిక ధరకు కొనుగోలు చేసుకోవచ్చు. దీంతో నష్టాలకు తక్కువ అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఓ స్టాక్‌ను కొన్న తర్వాత మార్కెట్లు పడిపోతాయి. దాంతో ఎంత వరకు కరెక్షన్‌ అన్న సందేహం ఎదురవుతుంది. మార్కెట్లు యూ షేప్‌లో పెరిగిన వెంటనే 10-20 శాతం లాభంతో బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే మార్కెట్లలో ఇంకా కరెక్షన్‌ పూర్తి కాలేదని భావిస్తుంటారు. తిరిగి కనిష్ట స్థాయికి ఎప్పుడు వస్తుందా అని వేచి చూస్తుంటారు. కానీ, అది జరగదు. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు టైమింగ్‌ అన్నది నిరర్థకం.You may be interested

క్రెడిట్‌ యాక్సెస్‌ ఐపీవో... కంపెనీ బలాబలాలు

Wednesday 8th August 2018

బెంగళూరు కేంద్రంగా నడిచే సూక్ష్మ రుణాల వ్యాపార సంస్థ ‘క్రెడిట్‌ యాక్సెస్‌ గ్రామీణ్‌’ ఐపీవో ఈ నెల 8న ప్రారంభం కానుంది. ఆగస్ట్‌ 10న ముగిసే ఈ ఐపీవోకు ఒక్కో షేరు ధరల శ్రేణిగా రూ.418-422ను కంపెనీ ఖరారు చేసింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్‌ అవుతుంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, క్రెడిట్‌ సూసే సెక్యూరిటీస్‌, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్‌, కోటక్‌ మహింద్రా క్యాపిటల్‌ కంపెనీలు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. ఈ

మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

Tuesday 7th August 2018

11400 దిగువకు నిఫ్టీ ముంబై:- మార్కెట్‌ మంగళవారం మిశ్రమంగా ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్‌ 26 నష్టంతో 37,665 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 11389 వద్ద ముగిసింది. మెటల్‌, అటో షేర్లు అండగా మార్కెట్‌కు నిలువగా, ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు నష్టాల్లో ముగిశాయి. సూచీలు ఇంట్రాడే మరో సరికొత్త జీవితకాల గరిష్టాలను అధిరోహించాయి. సెన్సెక్స్‌ 290 పాయింట్ల రేంజ్‌లో ట్రేడ్‌ అవ్వగా, నిఫ్టీ 68 పాయింట్ల

Most from this category