STOCKS

News


ద్వితియార్ధంలో చిన్నస్టాకులదే హవా

Thursday 24th January 2019
Markets_main1548307256.png-23776

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ 
గతేడాది అధ్వాన్న ప్రదర్శన చూపిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాకులు ఈ ఏడాది గాడిన పడతాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌హెడ్‌ దీపక్‌ జసాని అభిప్రాయపడ్డారు. భారత్‌లాంటి పెద్ద దేశంలో అనేక కంపెనీలుంటాయని, వీటిలో చిన్న, మధ్యతరహా కంపెనీల్లో కొన్ని నాణ్యమైనవి ఉంటాయని చెప్పారు. డౌన్‌ట్రెండ్‌ సమయాన ఎంత నాణ్యమైన చిన్నస్టాకైనా పతనమవడం తప్పదని, కానీ మంచి కంపెనీల్లో కరెక‌్షన్‌ చూసి భయపడకూడదని తెలిపారు. లార్జ్‌ క్యాప్స్‌తో పోలిస్తే చిన్నస్టాకులతోనే సంపద సృష్టి జరుగుతుందన్నారు. అయితే సరైన అధ్యయనం లేకుండా చిన్నస్టాకుల్లోకి ఎంటర్‌ కావడం మంచిదికాదన్నారు. అదేవిధంగా సరైన టైమ్‌లో ఎంటర్‌ కావడం, సరైన టైమ్‌లో ఎగ్జిట్‌ కావడం కూడా చాలా కీలమని చెప్పారు. ఈ ఏడాది రెండో సగభాగంలో స్మాల్‌,మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో మంచి పురోగతి చూడవచ్చని అంచనా వేశారు. అయితే క్యు4 ఫలితాలు చూసిన తర్వాతే నాణ్యమైన స్టాకులను ఎంచుకోవాలని సూచించారు. క్యు4 పూర్తయ్యే సమయానికి దాదాపు ఎన్నికల వేడి పతాకస్థాయిలో ఉంటుందని, అందువల్ల ఈ ఫలితాల సీజన్‌ పూర్తయి, ఎన్నికలపై స్పష్టత వచ్చిన అనంతరం మంచి స్టాకులను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. 
బడ్జెట్‌పై పెద్ద అంచనాల్లేవు..
మధ్యంతర బడ్జెట్‌పై పెద్దగా ఆశల్లేవని దీపక్‌ చెప్పారు. ప్రస్తుత మార్కెట్‌ ప్రవర్తనకు బడ్జెట్‌ కారణం కాదని చెప్పారు. అంతర్జాతీయ మందగమనంపై భయాలు, ఐఐపీ నెంబర్లు బలహీనంగా ఉండడం, విత్త పరిస్థితిపై ఆందోళనలు, ఎన్నికలు.. తదితర అంశాలు మార్కెట్‌ను నెగిటివ్‌గా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా ఎన్నికల వేళ పార్టీలు అనూహ్య ప్రకటనలు చేయడం, అనుకోని పొత్తులు పెట్టుకోవడం చేస్తాయని, ఇవి ఇన్వెస్టర్లలో లేనిపోని అనుమానాలు, ఆందోళనలు పెంచుతాయని తెలిపారు. గతడేది పీఎస్‌యూ బ్యాంకులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ఈ ఏడాది వీటిలో రికవరీ ఉండొచ్చని ఆయన అంచనా వేశారు. ఎన్నికల అనంతరం స్థిర ప్రభుత్వం ఏర్పడితే ఈ స్టాకులు మరింత దూకుడు చూపుతాయని, ఎన్నికలకు ముందే వీటిలో ఆశావహ ర్యాలీ ఉండొచ్చని చెప్పారు. You may be interested

యూనిటెక్‌ ప్రమోటర్ల బెయిల్‌కు సుప్రీం నో

Thursday 24th January 2019

న్యూఢిల్లీ: యూనిటెక్‌ ప్రమోటర్లు సంజయ్‌ సంద్ర, అజయ్‌ చంద్రలకు బెయిల్‌ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. గృహ కొనుగోలుదారులను కోట్లాది రూపాయిల మేర మోసం చేశారన్న ఆరోపణలపై వీరు అరెస్టయ్యారు. అత్యున్నత న్యాయస్థానం రిజిస్ట్రీ వద్ద రూ.750 కోట్ల డిపాజిట్‌ చేయాలని 2017 అక్టోబర్‌ 30వ తేదీన ఇచ్చిన ఆదేశాలను రియల్టీ గ్రూప్‌  పాటించనందున వారికి బెయిల్‌ మంజూరు చేయడం లేదని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హేమంత్‌

కొన్ని ప్రధాన కంపెనీలు మూడో త్రైమాసికి ఫలితాలు

Thursday 24th January 2019

విజయా బ్యాంక్ లాభం 80 శాతం అప్‌ న్యూఢిల్లీ:  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రభుత్వ రంగ విజయా బ్యాంక్ నికర లాభం 80 శాతం ఎగిసి రూ. 143 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో ఇది రూ.80 కోట్లు. మరోవైపు తాజా క్యూ3లో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.3,451 కోట్ల నుంచి రూ. 4,106 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 6.17

Most from this category