STOCKS

News


ఇన్వెస్ట్‌ చేస్తున్నది స్టాక్‌లో కాదు... కంపెనీలో: కేడియా

Monday 4th March 2019
Markets_main1551638584.png-24410

స్టాక్స్‌, మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నదానికి బదులు... తాము పెట్టుబడి పెడుతున్నది ఓ కంపెనీలో అని భావిస్తే ఇన్వెస్టర్ల దృక్పథం వేరుగా ఉంటుందని ప్రముఖ ఇన్వెస్టర్‌, కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా సూచించారు. మార్కెట్ల తీరుతెన్నులపై ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను తెలియజేశారు. 

 

అతి అనర్థదాయకమన్న ఓ నానుడిని కేడియా గుర్తు చేశారు. మార్కెట్లలో జరిగింది ఇదేనన్నారు. 2017లో స్టాక్స్‌ అతిగా పెరగడం వల్లే ఆ తర్వాత భారీ దిద్దుబాటుకు కారణంగా పేర్కొన్నారు. 2017, 2018లో మార్కెట్లలో ఎంతో ఉత్సాహం నెలకొనగా, ఆ సమయంలో పీఈ రేషియోను మర్చిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మల్టీబ్యాగర్ల సంఖ్య 2018లో సింగిల్‌ డిజిట్‌కు తగ్గిపోయిందని, కేవలం 5-10 శాతం షేర్లు మల్టిప్లై అయినట్టు చెప్పొచ్చన్నారు. ఎంపిక జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇన్వెసింగ్‌ అన్నది చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యాపారమని గుర్తుంచుకోవాలన్నారు. కంపెనీ ఫైనాన్షియల్‌ సక్రమంగానే ఉన్నా, బయటి అంశాల వల్ల అన్నీ తారుమారుకావచ్చన్న ఆయన, మార్కెట్లలో ఎక్కువ భాగం కరెక్షన్‌ ముగిసినట్టేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

ఎన్నికల ఫలితాల ప్రభావం...
‘‘ఎన్నికలు అన్నవి బయటి అంశమే. ఆ విషయంలో మన నియంత్రణ ఏమీ ఉండదు. దీని గురించి ఇన్వెస్టర్లు ఆందోళన చెందక్కర్లేదు. పెట్టుబడులకు సంబంధించి సరైన నిర్ణయాలు తీసుకుంటే పోర్ట్‌ఫోలియో చక్కగానే ఉంటుంది’’ అని విజయ్‌ కేడియా చెప్పారు. ఎన్నికలు వస్తూ, వెళుతుంటాయని వీటి గురించి ఆందోళన చెంది ఆరోగ్యం పాడు చేసుకోవడం తగదని హితవు పలికారు. ఏ ప్రభుత్వం ఉందన్న దానితో సంబంధం లేకుండా గత 30 ఏళ్లలో భారత జీడీపీ 5 శాతంపైనే వృద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. కనుక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న ఆందోళన తనకు లేదన్నారు. 

 

కొనుగోలు ధర కీలకం
స్టాక్‌ కొనుగోలు ధర చౌకగా లేకపోతే ఈ తరహా మార్కెట్లలో సక్సెస్‌ కావడం అంత తేలిక కాదన్న అభిప్రాయాన్ని కేడియా వ్యక్తం చేశారు. ‘‘ఈ మార్కెట్లో బాధపడుతున్నారంటే 2018 ఆరంభంలో లేక, 2018 చివర్లో పెట్టుబడులు పెట్టి ఉంటారు. అదే 2016, 2017లో ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఇంత పతనం తర్వాత కూడా ఇంకా వారి పెట్టుబడులపై 20-50 శాతం లాభాలు కనిపిస్తాయి. దీంతో ప్రశాంతంగా నిద్రపోగలం. 2018లో పెట్టుబడులు పెట్టి ఉంటే ఇప్పటికీ నష్టాలే కనిపిస్తాయి. అయితే, మార్కెట్లలో రాబడులను ఈ విధంగా చూడడం సరికాదు’’ అని కేడియా వివరించారు. ఎన్నో దేశీయ, అంతర్జాతీయ అంశాలు మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్న వేళ, కంపెనీల యాజమాన్యాలే కానీ, ఇన్వెస్టర్లు ఆందోళన చెందనవసరం లేదన్నారు. కేవలం ఇన్వెస్ట్‌ చేసిన కంపెనీ పనితీరునే పరిశీలించాల్సి ఉంటుందని సూచించారు.

 

మంచి రాబడులకు నిర్వచనం...
దీర్ఘకాలం ఇన్వెస్టర్‌ అయితే ఏడాది, రెండేళ్ల రాబడులను లెక్క వేసుకోవడం సరికాదన్నారు. బుల్‌ మార్కెట్లో ప్రతీ స్టాక్‌ ఏడాదిలో రెట్టింపు కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికి 15, 10, 5 శాతం చొప్పున మార్కెట్‌ రాబడులను ఇచ్చినా అది బుల్‌ మార్కెట్‌గానే భావించాల్సి ఉంటుందన్నారు.  కొత్త ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌తో కెరీర్‌ ఆరంభించాలని, మరోవైపు మార్కెట్ల గురించి అధ్యయనం చేయాలని సూచించారు. ఒక్కసారి అనుభవం సంపాదించుకున్న తర్వాత అప్పుడు నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌మెంట్‌ గురించి ఆలోచించాలన్నారు. You may be interested

నేడు మార్కెట్లకు సెలవు

Monday 4th March 2019

మహాశివరాత్రి సందర్భంగా సోమవారం దేశీయ స్టాక్‌ ఎక్చే‍్సంజీలకు సెలవు. అలాగే కమోడిటీ, బులియన్‌, మెటల్‌, ఫారెక్స్‌ మార్కెట్లకు సైతం నేడు పని చేయవు. అన్ని మార్కెట్లు తిరిగి మంగళవారం ప్రారంభవుతాయి. భారత్‌ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం మార్కెట్‌ మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌ 196 పాయింట్లు పెరిగి 36, 064 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి

అస్సెట్‌ అలోకేషన్‌ పక్కాగా ఉందా...?

Monday 4th March 2019

ప్రతీ ఆదాయార్జన వ్యక్తి తన పెట్టుబడుల విషయంలో పక్కాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపు (అస్సెట్‌ అలోకేషన్‌ ) ఎంతన్నది ఎవరికి వారు తమ రిస్క్‌ సామర్థ్యాలు, రాబడుల ఆధారంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకరి పోర్ట్‌ఫోలియోకు సంబంధించి అస్సెట్‌ అలోకేషన్‌ అన్నది ఓ చక్కని డైవర్సిఫికేషన్‌ (వైవిధ్యత) అని ఐడీఎఫ్‌సీ ఏఎంసీ మార్కెటింగ్‌ హెడ్‌ గౌరబ్‌ పరిజా పేర్కొ‍న్నారు. బాండ్లు, ఈక్విటీ, క్యాష్‌, కమోడిటీలు,

Most from this category