STOCKS

News


దీర్ఘ, మధ్యకాలిక దృష్టితోనే మార్కెట్‌ పెట్టుబడులు చేయాలి

Monday 22nd October 2018
Markets_main1540197622.png-21362

మార్జిన్లపై ఒత్తిడి, వృద్ధి రేటు మందగమనం వంటి అంశాల ప్రభావం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలపై కొట్టిచ్చినట్లు కనిపిస్తుందని సార్థీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సాల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వారంలో చాలా కంపెనీలు క్యూ2 ఎర్నింగ్స్‌ను ప్రకటించనున్నాయని, ఇందులో కొన్ని పాజిటివ్‌గా, మరికొన్ని నెగటివ్‌గా ఆశ్చర్యానికి గురిచేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత స్థూల ఆర్థికాంశాల నేపథ్యంలో పాజిటివ్‌ కన్నా నెగటివ్‌ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేశారు. ముడిపదార్ధాల ధరల పెరుగుదల వల్ల ఈబీటా మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని తెలిపారు. ఇప్పటి దాకా వెలువడిన ఎర్నింగ్స్‌ను గమనిస్తే ఐటీ రంగం మంచి ఫలితాలను అందించిందని పేర్కొన్నారు. సిమెంట్‌ రంగ కంపెనీల ఎర్నింగ్స్‌ కూడా బాగున్నాయని తెలిపారు. విక్రయాల వృద్ధి బలంగా ఉందని పేర్కొన్నారు. అయితే మార్జిన్లపై ఒత్తిడి నెలకొని ఉందన్నారు. కన్సూమర్‌ కంపెనీల విక్రయాల్లోనూ వృద్ధి నమోదయ్యిందని, అందువల్ల వీటి ఎర్నింగ్స్‌ కూడా బాగుంటాయని అంచనా వేశారు. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగానికి వస్తే ఎర్నింగ్స్‌ అంత చెడ్డగా ఏమీ ఉండకపోవచ్చని తెలిపారు. అయితే వీటి డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలను గమనించాల్సి ఉందని పేర్కొన్నారు. అప్పుడు ఎర్నింగ్స్‌పై వృద్ధి రేటు మందగమనం, మార్జిన్లపై ఒత్తిడి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఇప్పటికే వీటి స్టాక్‌ ధరలు దాదాపు 30 శాతంమేర పతనమయ్యాయని, ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చని అంచనా వేశారు. 
మార్కెట్‌ ప్రస్తుత పరిస్థితుల్లో క్లయింట్స్‌ ఏ వార్తలనైతే చదువుతారో.. వాటి ప్రభావానికి గురవుతారని కుంజ్‌ బన్సాల్‌ తెలిపారు. అయితే తాము మాత్రం వారికి.. పరిస్థితులు సర్దుకుంటాయని, మార్కెట్లు కరెక‌్షన్‌కు గురవ్వడం ఇదే తొలిసారికాదని చెబుతుంటామని పేర్కొన్నారు. ఈక్విటీ అనేది రిస్క్‌ అసెట్‌ అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. స్వల్ప కాలిక ఇన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాలను కలిగిన వారికి ప్రస్తుత మార్కెట్లు అనుకూలం కాదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే కరెక‌్షన్‌ మరికొంత కాలం ఉండొచ్చని అంచనా వేశారు. అందువల్ల స్వల్ప కాలం కోసం మార్కెట్‌లోకి ప్రవేశించొద్దని సూచించారు. కనీసం మధ్యస్థ కాల లక్ష్యాలతో మార్కెట్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని తెలిపారు. మార్కెట్‌ పెరినప్పుడు, కొన్ని రంగాల స్టాక్స్‌ ఔట్‌పర్ఫార్మ్‌ చేస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుత బుల్‌ రన్‌ బీఎఫ్‌ఎస్‌ఐ కంపెనీలు ప్రత్యేకించి ఎన్‌బీఎఫ్‌సీల మంచి పనితీరు వల్ల వచ్చిందని తెలిపారు. అయితే ఇవి తదుపరి ఔట్‌పర్ఫార్మర్లుగా కొనసాగలేకపోవచ్చని పేర్కొన్నారు.  



You may be interested

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 9 శాతం క్రాష్‌

Monday 22nd October 2018

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సోమవారం 9 శాతం పతనమై 15 నెలల కనిష్టస్థాయి రూ. 1,535 వద్దకు పడిపోయింది. అక్టోబర్‌ 15న ఆర్థిక ఫలితాలు ఈ బ్యాంక్‌ ఫలితాలు వెల్లడికాగా, ఈ షేరు క్షీణించడం వరుసగా ఇది ఐదవరోజు. ఈ షేరు పతనానికి ప్రత్యేక కారణాలేవీ తెలియరాలేదని, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఫలితంగానే క్షీణించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక దశలో 25,400

విదేశీ ఇన్వెస్టర్ల నుంచి మరిన్ని అమ్మకాలు

Monday 22nd October 2018

ఫెడరల్‌ రిజర్వు డిసెంబర్‌లోనూ వడ్డీ రేట్లను 2.5 శాతానికి పెంచవచ్చనే అంచనాలున్నాయి. ఫెడ్‌ రేటు 2019లో 3 శాతానికి, 2020 నాటికి 3.5 శాతానికి చేరే అవకాశముంది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి మరిన్ని నిధులను వెనక్కు తీసుకెళ్లొచ్చని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ సంస్థ విలియమ్‌ ఓనీల్‌ అండ్‌ కో ప్రెసిడెంట్‌, సీఈవో స్టీవెన్‌ బిర్చ్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  విదేశీ

Most from this category