STOCKS

News


మూడు ఐపీఓలకు సెబీ ఆమోదం

Tuesday 27th November 2018
Markets_main1543299090.png-22411

సెబీ ఆమోదం పొందిన ఐపీఓల సంఖ్య @73

న్యూఢిల్లీ: మూడు కంపెనీల ఐపీఓలకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌, మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌,  ఎక్సెల్ప్‌ మ్యాక్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ కంపెనీల ఐపీఓలకు సెబీ పచ్చజెండా ఊపింది. దీంతో ఈ ఏడాది సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య 73కు పెరిగింది.
ఇన్వెన్షియా ఐపీఓ రూ.450 కోట్లు
ఐపీఓలో భాగంగా ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ కంపెనీ రూ.125 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నది. వీటితో పాటు ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా 31.64 లక్షల షేర్లను విక్రయించనున్నారు. మొత్తం మీద ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.450 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించుకోవాలని  ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్‌గా ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌లు వ్యవహరిస్తున్నాయి.

మెట్రోపొలిస్‌ ఐపీఓ
మెట్రోపొలిస్‌ హెల్త్‌కేర్‌ ఐపీఓలో భాగంగా 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద విక్రయిస్తారు. ఈ షేర్లలో సుశీల్‌ కనుభాయ్‌ షా 50 లక్షల షేర్లను, సీఏ లోటస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ కోటి షేర్లను విక్రయిస్తాయి. ఈ ఐపీఓకు లీడ్‌ మేనేజర్లుగా జేఎమ్‌ ఫైనాన్షియల్‌, క్రెడిట్‌ సూసీ సెక్యూరిటీస్‌(ఇండియా), గోల్డ్‌మన్‌ శాచ్స్‌(ఇండియా), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ కంపెనీలు వ్యవహరిస్తున్నాయి.

ఎక్సెల్ప్‌మ్యాక్‌ డిజైన్‌ అండ్‌ టెక్నాలజీ
ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.23 కోట్లు​ సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఐపీఓ నిధులతో హైదరాబాద్‌, కోల్‌కతాల్లోని డెవలప్‌మెంట్‌ సెంటర్లకు కావలసిన ఐటీ హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ పరికరాలను కొనుగోలు కోసం, వర్కింగ్‌ క్యాపిటల్‌ అవసరాల కోసం వినియోగించనున్నది. ఈ ఐపీఓకు బుక్‌-రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్‌గా ఐటీఐ క్యాపిటల్‌ వ్యవహరించనున్నది.



You may be interested

నకిలీ ఉత్పత్తులకు స్నాప్‌డీల్‌ చెక్‌...

Tuesday 27th November 2018

'బ్రాండ్‌ షీల్డ్‌' విధానం అమలు న్యూఢిల్లీ: నకిలీ ఉత్పత్తుల విషయంలో ప్రముఖ బ్రాండ్స్‌ అప్రమత్తంగా వ్యవహరించేలా తోడ్పడేందుకు ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ తాజాగా 'బ్రాండ్ షీల్డ్' పేరిట ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. వివిధ బ్రాండ్స్‌ నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దినట్లు సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. స్నాప్‌డీల్‌లో అమ్ముడయ్యే నకిలీ ఉత్పత్తులపై ఆయా బ్రాండ్స్ ఫిర్యాదు చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించింది. ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌, పేటెంట్‌, డిజైన్‌పరంగా జరిగే

సాగర్‌ సిమెంట్స్‌ మరో ప్లాంట్‌

Tuesday 27th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీ సాగర్‌ సిమెంట్స్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేయనుంది. దీనితో పాటు గ్రైండింగ్‌ యూనిట్‌ను సైతం ఏర్పాటు చేయనున్నట్లు సోమవారం బీఎస్‌ఈకి తెలియజేసింది. ఇందుకోసం నిధులు సమీకరించనున్నట్టు పేర్కొంది. సంస్థ విస్తరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనిపై బోర్డు డైరెక్టర్లు డిసెంబరు 5న సమావేశం అవుతారని తెలిపింది.

Most from this category