STOCKS

News


త్వరలో ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ ఐపీఓ

Saturday 22nd September 2018
Markets_main1537592510.png-20464

న్యూఢిల్లీ: ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ కంపెనీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.125 కోట్ల విలువైన తాజా షేర్లను విక్రయించనున్నది. ఈ తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కింద 31.64 లక్షల షేర్లను కూడా ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఆఫర్‌ చేస్తున్నారు. ప్రమోటర్లు-జనక్‌ షా, మాయ షాలతో పాటు ప్రైవేట్‌ ఈక్విటీ ఫండ్‌​ జాకొబ్‌ బల్లాస్‌ ఈ షేర్లను ఆఫర్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఐపీఓ ద్వారా ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ కంపెనీ రూ.450 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, ఇతర సాధారణ వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, సెంట్రమ్‌ క్యాపిటల్‌ కంపెనీలు లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తాయి. 



You may be interested

ఆరిజోనాలో ఇన్ఫీ టెక్నాలజీ హబ్‌

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. అమెరికాలో కొత్తగా మరో టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఆరిజోనాలో దీన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2023 నాటికి 1,000 మంది అమెరికన్ ఉద్యోగులను ఇందులో నియమించుకోనున్నట్లు వివరించింది. ఆరిజోనా కళాశాలల్లో చదివిన తాజా గ్రాడ్యుయేట్స్‌, స్థానిక నిపుణులు వీరిలో ఉండనున్నట్లు పేర్కొంది. రెండేళ్ల వ్యవధిలో ఇలాంటి నాలుగు హబ్‌లు ఏర్పాటు చేస్తామని, 10,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని గతేడాదే

మరో 55వేల డొల్ల కంపెనీలు రద్దు..

Saturday 22nd September 2018

ముంబై: మనీలాండరింగ్‌ని అరికట్టే దిశగా చేపట్టిన చర్యల్లో భాగంగా రెండో దశలో 55,000 పైచిలుకు డొల్ల కంపెనీలను మూయించినట్లు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి పి.పి. చౌదరి తెలిపారు. మరికొన్ని కంపెనీల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడంతో పాటు కొన్నింటికి నోటీసులు కూడా పంపినట్లు ఇండో-‍అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నాలుగో వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. రెండేళ్ల పైగా వార్షిక ఆర్థిక నివేదికలు దాఖలు చేయని

Most from this category