News


52-వారాల గరిష్టానికి ఎల్‌ అండ్‌ టీ..!

Thursday 25th January 2018
Markets_main1516865938.png-13415

ముంబై: మౌలిక సదుపాయాల దిగ్గజ సంస్థ లార్సన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌ అండ్‌ టీ) గురువారం ఎన్‌ఎస్‌ఈలో 52-వారాల గరిష్టాన్ని తాకింది. రానున్న బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల రంగానికి పెద్దపీట వేస్తున్నట్లు వెలువడుతున్న అంచనాల నేపథ్యంలో షేరుకు డిమాండ్‌  పెరిగింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఎల్‌ అండ్‌ టీ షేరు రూ.1392ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 2.52శాతానికి పైగా ర్యాలీ చేసి రూ.1427.05ల వద్ద 52-వారాల గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:00లకు షేర గత ముగింపు ధర(రూ.1401.02)తో పోలిస్తే 1.43శాతం లాభపడి రూ.1421 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా, షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 1392.20లు, రూ.1427.05లుగా నమోయ్యాయి.



You may be interested

డాక్టర్‌ రెడ్డీస్‌ లాభంలో 40% క్షీణత

Thursday 25th January 2018

హైదరాబాద్‌కు చెందిన ఔషధ తయారీ సంస్థ డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికం)లో సైతం నిరాశజనక ఫలితాలను ప్రకటించింది. వరుసగా 3వ క్వార్టర్‌లోనూ నికర లాభంలో తగ్గుదల నమోదయ్యింది. అంతకుముందు ఏడాది ఇదేకాలంతో పోల్చితే నికర లాభం 38.5 శాతం క్షీణించి రూ. 303 కోట్లుగా నమోదైనట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ ప్రకటించింది. అధిక శాతం విశ్లేషకుల అంచనా రూ.340 కోట్లు కాగా, ఇంతకుమించిన తగ్గుదలతో ఫలితాలు వెల్లడయ్యాయి.

ఏం చేద్దాం? చెప్మా...

Thursday 25th January 2018

ఉంచాలా? అమ్మేయాలా? కొత్తవి కొనాలా?   పొజిషన్లపై రిటైలర్ల డైలమా             ‘టు బి ఆర్‌ నాట్‌ టు బి’ అని హామ్లెట్‌ నాటకంలో షేక్స్‌పియర్‌ ఒక పాత్రతో పలికిస్తాడు... ప్రస్తుతం మార్కెట్లో రిటైలర్ల పరిస్థితి ఇదే తరహాలోఉంది.. పెరుగుతున్న మార్కెట్లకు భయపడి పొజిషన్ల నుంచి వైదొలగాలో... ర్యాలీతో పాటు కొనసాగాలో.. తెలీక సతమతమవుతున్నారు రిటైలర్లు.    మార్కెట్లు అడ్డూఆపు లేకుండా ముందుకు పోతున్నప్పుడు రిటైల్‌ ఇన్వెస్టర్‌గా ఉండడం అంత సులభం కాదు. ఒకపక్క ఊరిస్తున్న లాభాలు స్వీకరించమంటాయి..

Most from this category