STOCKS

News


ఇన్ఫోసిస్‌కు బైబ్యాక్‌ బూస్టింగ్‌

Wednesday 9th January 2019
Markets_main1547018579.png-23482

  • 3శాతం ర్యాలీ చేసిన షేర్లు

షేర్ల బై బ్యాక్‌ అంశం తెరపైకి రావడంతో సాంకేతిక సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ షేర్లు బుధవారం 3శాతం లాభపడ్డాయి. ఇన్వెస్టర్ల, ప్రమోటర్లు నుంచి ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ(బై బ్యాక్‌) అంశంపై చర్చించేందుకు కంపెనీ బోర్డు జనవరి 11న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ మేరకు మంగళవారం మార్కెట్‌ ముగింపు అనంతరం ఇన్ఫోసిస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా నేడు బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం లాభంతో రూ.684.90ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో ఇన్ఫీ షేర్లకు మరింత డిమాండ్‌ పెరగడంతో షేరు ఒకానొక దశలో 3శాతం లాభపడి రూ.689.80ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు షేరు గతముగింపు(రూ.669.85)తో పోలిస్తే 1శాతం లాభంతో రూ.677ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.507.50 రూ.754.95లుగా నమోదయ్యాయి. ఇదే జనవరి 11న కంపెనీ క్యూ3 ఫలితాలతో పాటు, స్పెషల్‌ డివిడెండ్‌ ప్రకటించనుంది.



You may be interested

ఏడాదికాలానికి టాప్‌ రికమండేషన్లు

Wednesday 9th January 2019

వచ్చే సంవత్సర కాలంలో 15- 100 శాతం రాబడినిచ్చే సత్తా ఉన్న టాప్‌ స్టాక్‌ ఐడియాలను బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. సెంట్రమ్‌ సిఫార్సులు 1. బజాజ్‌ ఆటో: టార్గెట్‌ రూ. 3075. దేశంలో బలమైన ద్వి, త్రి చక్రవాహన ఉత్పత్తిదారు. భారత్‌నుంచి అతిపెద్ద ద్వి, త్రిచక్రవాహన ఎగుమతిదారు. 21 దేశాలకు కంపెనీ తన వాహనాలను ఎగుమతి చేస్తోంది. బలమైన బైక్‌ పోర్టుఫోలియో ఉంది. బీఎస్‌ 4 నిబంధనల అమలు, ట్రాక్టర్‌ విక్రయాలు టాప్‌

నిఫ్టీ 2019 టార్గెట్‌ 11,300!

Wednesday 9th January 2019

బోఫాఎంఎల్‌ అంచనా ఈ ఏడాది చివరి నాటికి నిఫ్టీ టార్గెట్‌ 11300 పాయింట్లని బోఫాఎంఎల్‌ అంచనా వేసింది. ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు చేపట్టిన లిక్విడిటీ ఇంజెక‌్షన్‌ కార్యక్రమాలు నెగిటివ్‌గా మారాయని అభిప్రాయపడింది. చమురు ధరల తరుగుదలతో ఎర్నింగ్స్‌ అప్‌గ్రేడ్స్‌ ఏమీ ఉండకపోవచ్చని, ఇప్పటికే ఎర్నింగ్స్‌ పెరుగుదల ప్రైస్‌ఇన్‌ అయిందని తెలిపింది. భారత బిజినెస్‌ సైకిల్‌కి ఎన్నికలు పట్టించుకోదగ్గ అంశం కాదని, కాకపోతే ఈ సంవత్సరానికి మాత్రం కీలక సంఘటనని తెలిపింది.

Most from this category