ఇన్ఫీ ఫలితాలపై అంచనాలేంటి?
By D Sayee Pramodh

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించనుంది. ఇప్పటికే తోటి సంస్థ టీసీఎస్ అదరగొట్టే ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ ఫలితాలపై వివిధ బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు, అంచనాలు ఇలా ఉన్నాయి...
- ఫిలిప్ క్యాపిటల్: గతంలో ప్రకటించిన 6-8 శాతం రెవెన్యూ గ్రోత్ గైడెన్స్‌ను కొనసాగిస్తుంది. డీల్స్ వరద కారణంగా అవుట్‌లుక్ అద్భుతంగా ఉండవచ్చు. ఎబిటా మార్జిన్లలో వంద బీపీఎస్ తరుగుదల ఉండొచ్చు. వేతన వ్యయాలు, వీసా వ్యయాలు మార్జిన్లను దెబ్బతీయవచ్చు. గత త్రైమాసికంతో పోలిస్తే రెవెన్యూ 1.8 శాతం, నికరలాభం ఒక్క శాతం పెరగవచ్చు.
- కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్: లాభంలో 6.4 శాతం వార్షిక వృద్ధి ఉండవచ్చు. గత రెవెన్యూ అంచనాలనే కొనసాగించవచ్చు. నికర విక్రయాల్లో 12.20 శాతం వార్షిక వృద్ధి ఉంటుందని అంచనా. బీఎఫ్ఎస్ఐ విభాగపు వృద్దిపై నిశిత పరిశీలన అవసరం. దీంతో పాటు డీల్స్ టీసీవీ, అట్రిషన్, ప్రైసింగ్, ఆటోమేషన్ వృద్ధిని సైతం చూడాల్సిఉంటుంది. ఎబిటా మార్జిన్లలో వంద బీపీఎస్ క్షీణత ఉండవచ్చు.
You may be interested
27వేల ఎగువకు బ్యాంక్ నిఫ్టీ
Thursday 12th July 2018ఇంట్రాడేలో 350 పాయింట్ల లాభం ముంబై:- సూచీలు సరికొత్త రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్పరుగులు పెడుతోంది. నిఫ్టీ బ్యాంకు గురువారం 26,937 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు 2నుంచి 1శాతం ర్యాలీ అండతో ఇంట్రాడేలో 27000 మార్కును అధిగమించింది. అదే ఊపుతో 350 పాయింట్లు లాభపడి లాభపడి 27,164 ఇంట్రాడే
ఆనంద్ రాథీ మిడ్‌క్యాప్ సిఫార్సులు
Thursday 12th July 2018బలమైన వృద్ధి, నాణ్యమైన మేనేజ్మెంట్, తక్కువ రుణాలు, ఆకర్షణీయమైన వాల్యూషన్లు ఉన్న కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని ఆనంద్ రాథీ బ్రోకరేజ్ సలహా ఇస్తోంది. ప్రస్తుత ఎర్నింగ్స్ సీజన్ కోసం మూడు మిడ్‌క్యాప్స్‌ను కొనొచ్చని రికమండ్ చేస్తోంది. 1. పెరిసిస్టెంట్ సిస్టమ్స్: టార్గెట్ రూ. 960. ఈ ఆర్థిక సంవత్సరం మంచి రికవరీ చూపుతుందని అంచనా. గత రెండేళ్లుగా కంపెనీ డిజిటల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కలిసిరానుంది. ఈ సంవత్సరం సేల్స్,