STOCKS

News


మళ్లీ ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌?

Monday 24th December 2018
Markets_main1545635590.png-23199

టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రెండోసారి షేర్ల బైబ్యాక్‌కు రెడీ అవుతోంది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలోపేతం చేసేందుకు కంపెనీ బోర్డు 1.6 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.10,400 కోట్లు) విలువైన షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనను పరిశీలిస్తోంది. అతిత్వరలో ఈ విషయంపై ఒక ప్రకటన వెలువడొచ్చు. కంపెనీ వ్యవస్థాపక సభ్యుల్లో కొందరు తాజా బైబ్యాక్‌లో వారి షేర్లను విక్రయించొచ్చు. కాగా ఇన్ఫోసిస్‌ గత షేర్ల బైబ్యాక్‌ మారటోరియం గడువు డిసెంబర్‌తో ముగుస్తుంది. కంపెనీ బోర్డు 2018-19 ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించేందుకు జనవరి 11న సమావేశం కానుందని, ఆ సమయంలోనే షేర్ల బైబ్యాక్‌ ప్రకటన ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా షేర్ల బైబ్యాక్‌ ప్రక్రియ వాటాదారుల అంగీకారంపై ఆధాపడి ఉంటుంది. షేర్ల బైబ్యాక్‌ వల్ల ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ బలోపేతమౌతుందని మార్కెట్‌ నిపుణలు పేర్కొంటున్నాయి. అయితే అంతర్జాతీయ ప్రతికూలతలు, రాజకీయ అస్థిరత వంటి ప్రస్తుత పరిస్థితుల్లో బైబ్యాక్‌ వల్ల ఐటీ వ్యయాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. మార్కెట్‌ ధరకు 20- 25 శాతం ప్రీమియంతో షేర్ల బైబ్యాక్‌ ఉండొచ్చని సంబంధిత వర్గాలు తెలిపారు. కాగా ఇన్ఫోసిస్‌ తొలిసారిగా గతేడాది రూ.13,000 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్‌ చేసింది. ఒక్కొ షేరుకు రూ.1,150 చెల్లించింది. 

షేర్ల బైబ్యాక్‌ వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ షేరు ధర ఎస్‌ఎస్‌ఈలో మధ్యాహ్నం 12:33 సమయంలో 1.34 శాతం పెరుగుదలతో రూ.655 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

రియల్టీ షేర్ల నేలచూపులు

Monday 24th December 2018

మార్కెట్‌ పతనంలో భాగంగా సోమవారం ట్రేడింగ్‌లో రియల్టీ రంగ షేర్లు నేలచూపులు చూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2.50శాతం నష్టపోయింది. ఈ రంగంలో ప్రధాన కంపెనీ షేర్లైన డీఎల్‌ఎఫ్‌ అత్యధికంగా 4.50శాతం నష్టపోయింది. అలాగే ఇండియాబుల్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, శోభ లిమిటెడ్‌ షేర్లు 3శాతం పతనమవడంతో పాటు, ఫోనిక్స్‌ లిమిటెడ్, సన్‌టెక్‌, ఓబెరాయ్‌ లిమిటెడ్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. మరోవైపు ఇదే రంగానికి చెందిన

మెటల్‌ షేర్ల పతనం

Monday 24th December 2018

నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం మార్కెట్లో మెటల్‌ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 1.50శాతం క్షీణించింది. అమెరికా - చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగియదనే వార్తలు మరోసాని తెరపైకి రావడం కూడా సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3,158.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లోని

Most from this category