STOCKS

News


జపాన్‌ కంపెనీలతో జేవీ.... ఇన్ఫోసిస్‌ ర్యాలీ

Friday 14th December 2018
Markets_main1544774473.png-22935

  • 2శాతం లాభపడిన షేర్లు

జపాన్‌ సాంకేతిక మార్కెట్లో అడుగుపెట్టేందుకు దేశీయ సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ రంగం సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా జపాన్‌కు చెందిన హిటాచీ, పానాసోనిక్‌, పానా సంస్థలతో ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు శుక్రవారం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ఈ భాగస్వామ్య కంపెనీ మొత్తం వాటాలో ఒక్క ఇన్ఫోసిస్‌ వాటానే 81శాతం వాటా ఉంటుంది. ఈ మెజార్టీ వాటా కొనుగోలు ఇన్ఫోసిస్‌ 174.58 కోట్లను వ్యయాన్ని ఖర్చు చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలోగా ఈ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు పూర్తి అవుతుందని ఇన్ఫోసిస్‌ తెలిపింది. జపాన్‌ ఇన్ఫోసిస్‌కు వ్యూహాత్మక మార్కెట్‌. జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు జపాన్‌ క్లయింట్‌ డిజిటల్‌ ప్రయాణాల్ని మరింత వేగవంతం చేస్తుందని ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
2శాతం లాభపడిన షేర్లు
జపాన్‌ కంపెనీలతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు ఇన్ఫోసిస్‌ షేర్లకు డిమాండ్‌ను పెంచింది. ఫలితంగా ఇన్వెస్టర్లు ఇన్ఫోసిస్‌ షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ షేర్లు 2శాతం లాభపడి రూ.709.45ల వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:00లకు షేరు గతముగింపు(రూ.697.75) ధర పోలిస్తే 1.75శాతం లాభంతో రూ.709.85ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.498.83లు రూ.754.90లుగా నమోదయ్యాయి.



You may be interested

ఈక్విటీకే అగ్రతాంబూలం!!

Friday 14th December 2018

ఇన్వెస్టర్లు వారి రిస్క్‌ ప్రొఫైల్‌ ఆధారంగా ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించాలని ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ హెడ్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అభిమన్యు సోఫత్‌ సూచించారు. రిస్క్‌ తీసుకోవడానికి ఇష్టపడే ఇన్వెస్టర్‌ తన పోర్ట్‌ఫోలియోలో 70 శాతాన్ని ఈక్విటీకి కేటాయించొచ్చని తెలిపారు. ఇక 20 శాతం డెట్‌కు, 10 శాతం బంగారంలో ఇన్వెస్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. అదే ఒక మోస్తరుగా రిస్క్‌ను భరించగలిగే వ్యక్తి తన పోర్ట్‌ఫోలియోలో 50 శాతం ఈక్విటీకి, 35 శాతం డెట్‌కు,

శాంతించిన టోకు ధరలు

Friday 14th December 2018

నవంబర్‌లో 4.64 శాతానికి తగ్గుదల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్‌లో మూడు నెలల కనిష్ట స్థాయికి తగ్గింది. 4.64 శాతంగా నమోదయ్యింది. ఈ ఏడాది ఆగస్ట్‌ నుంచి చూస్తే ఇదే కనిష్ట స్థాయి. ఆగస్ట్‌లో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 4.62 శాతంగా ఉంది. వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే..  చక్కెర, పొగాకు, రసాయన ఉత్పత్తులు, సిమెంట్‌, టెక్స్‌టైల్స్‌ వంటి మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రొడక్టులు ద్రవ్యోల్బణం నవంబర్‌లో 4.21

Most from this category