STOCKS

News


ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ అప్‌..

Tuesday 2nd October 2018
Markets_main1538457100.png-20788

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ సోమవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, విప్రో ఏడీఆర్‌లు పెరిగాయి. అదేసమయంలో వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గాయి. వేదాంత ఏడీఆర్‌ ఎక్కువగా పడిపోయింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ ఎక్కువగా పెరిగింది.   
టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 1.37 శాతం పెరుగుదలతో 15.57 డాలర్లకు ఎగసింది. ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.97 శాతం వృద్ధితో 10.37 డాలర్లకు ఎగసింది. విప్రో ఏడీఆర్‌ 0.58 శాతం వృద్ధితో 5.24 డాలర్లకు చేరింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.52 శాతం క్షీణతతో 93.61 డాలర్లకి తగ్గింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.06 శాతం పెరుగుదలతో 8.58 డాలర్లకి ఎగసింది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 2.60 శాతం క్షీణతతో 33.70 డాలర్లకి తగ్గింది. వేదాంత ఏడీఆర్‌ 0.62 శాతం తగ్గుదలతో 12.72 డాలర్లకి క్షీణించింది.  



You may be interested

ప్రతి ఐదు స్టాక్స్‌లో ఒక్కటే లాభాల్లో...

Tuesday 2nd October 2018

ప్రస్తుత ఏడాది ప్రతి ఐదు స్టాక్స్‌లో ఒక్కటి మాత్రమే లాభాలను అందించింది. నష్టపోయిన షేర్లతో పోలిస్తే లాభపడినవి ఇంత తక్కువగా వుండటం గత ఏడేళ్లలో చూస్తే ఇదే ప్రధమం. ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లో ఉండటం కారణం. అడ్వాన్స్‌-డిక్లెన్‌ రేషియో 0.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ఇప్పటి దాకా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-500 ఇండెక్స్‌లో 113 స్టాక్స్‌ లాభపడితే.. 380 స్టాక్స్‌ నష్టపోయాయి.  ఇండియా బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌ నిఫ్టీ-50.. ఈ ఏడాది

విదేశీ మార్కెట్‌లో 73 దిగువకు రూపాయి

Tuesday 2nd October 2018

73.35 స్థాయికి తగ్గుదల అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి మంగళవారం విదేశీ మార్కెట్‌లో నిట్టనిలువునా క్రాష్‌ అయ్యింది. 73 మార్క్‌ దిగువకు పడిపోయింది. ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయిలకు పతనమైంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 10:13 సమయంలో 73.35 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక సమయంలో 73.77 స్థాయికి కూడా పతనమైంది. క్రూడ్‌ ధరలు అమాంతం ఎగయడం, అమెరికా డాలర్‌ బలపడటం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. కాగా

Most from this category