STOCKS

News


అలీబాబా-జొమాటొ డీల్‌.. ఇన్ఫో ఎడ్జ్‌ 6% జంప్‌..

Monday 15th October 2018
Markets_main1539590399.png-21163

ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా షేరు సోమవారం ఇంట్రాడేలో ఏకంగా 6 శాతంమేర ర్యాలీ చేసింది. నిధుల సమీకరణకు సంబంధించి జొమాటొ-అలీబాబా మధ్య ఒప్పందం కుదరడం ఇందుకు ప్రధాన కారణం. గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ.. ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా స్టాక్‌పై ఓవర్‌ వెయిట్‌తో ఉంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,900గా నిర్ణయించింది. అంటే దాదాపు 28 శాతం అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొంది. తాజా ఇన్వెస్ట్‌మెంట్‌ డీల్‌తో కలుపుకుంటే జొమాటొలో అలీబాబా వాటా 27 శాతానికిపైగా చేరుకుంటుంది. 
210 మిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణకు సంబంధించి అలీపే సింగపూర్‌ హోల్డింగ్‌ కంపెనీతో జొమాటొ ఒప్పందం కుదర్చుకుందని ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా సోమవారం బీఎస్‌ఈకి తెలిపింది. తాజా డీల్‌ వల్ల జొమాటొలో తమ వాటా 30.9 శాతం నుంచి 27.68 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. 

కాగా మధ్యాహ్నాం 1:23 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా షేరు ధర 3 శాతం పెరుగుదలతో రూ.1,529 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

10500ల ఎగువకు నిఫ్టీ

Monday 15th October 2018

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి లాభాల్లోకి మళ్లింది. ఫార్మా, ఐటీ రంగ షేర్లతో పాటు హెవీ వెయిటేజ్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్ల ద్వయం ర్యాలీ ఇందుకు కారణమయ్యాయి. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ గతంలో కోల్పోయిన కీలక సాంకేతిక స్థాయిలను తిరిగి అందుకున్నాయి. 35వేల మార్కును, నిఫ్టీ 10500 స్థాయిని తిరిగి అందుకున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలను అందుకున్న సూచీలు స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ను

ఈక్విటీల్లో కాకపోతే.. మరెక్కడ?

Monday 15th October 2018

ఇన్వెస్టర్లు ఇప్పుడు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌, బంగారం వంటి సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్‌ సాధానాల్లో ఇన్వెస్ట్‌ చేయాలా? లేక ఈక్విటీ మార్కెట్లలోనే పెట్టుబడులను కొనసాగించాలా? అని నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. స్వల్ప కాలం నుంచి మధ్యస్థ కాలంలో ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ఉంటాయనే అంచనాలున్నాయి. దేశీ ఈక్విటీ ఇండెక్స్‌లు ఇటీవల కాలంలో బాగా కరెక‌్షన్‌కు గురయ్యాయి. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి క్షీణత, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల,

Most from this category