STOCKS

News


ఫండ్స్‌లోకి నిధుల రాక తగ్గినా... ఆశావహమే!

Monday 11th March 2019
Markets_main1552243780.png-24522

ఫిబ్రవరి నెల ఆఖరు నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.23.16 లక్షల కోట్లుగా ఉంది. జనవరితో పోలిస్తే ఫ్లాట్‌గానే ఉంది. ఫిబ్రవరిలో ఫండ్స్‌ నుంచి రూ.20,083 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. జనవరిలో మాత్రం నికరంగా రూ.65,439 కోట్లు వచ్చాయి. ముఖ్యంగా ఈక్విటీ ఫండ్స్‌లోకి నిధుల రాక మోస్తరు స్థాయికి చేరడం, లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి ఉపసంహరణలే ఫిబ్రవరిలో నిధుల తగ్గుదలకు కారణం. 

 

ముఖ్యంగా ఫిబ్రవరి మాసంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి నిధుల రాక 17 శాతం తగ్గి రూ.5,122 కోట్లుగా ఉన్నాయి. మార్కెట్లలో అస్థిరతలు పెరిగిపోవడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు ఆశాజనకంగా లేకపోవడం వంటి పరిస్థితులు ప్రభావం చూపించాయని అనలిస్టులు పేర్కొంటున్నారు. అయితే, మొత్తం మీద ఈక్విటీల్లోకి నిధుల రాక తగ్గినప్పటికీ... ఆశాజనక అంశం ఏమిటంటే సిప్‌ రూపంలో రూ.8,095 కోట్ల పెట్టుబడులు రావడం. ఇదే ఒవరడి స్థిరంగా కొనసాగితే ఒక్క సిప్‌ రూపంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లోకి రూ.1,00,000 కోట్లు వస్తాయని అంచనా. 

 

2017 నవంబర్‌లో ఈక్విటీల్లోకి వచ్చిన రూ.20,308 కోట్ల గరిష్ట స్థాయి తర్వాత నిధుల రాక క్రమంగా తగ్గుతూ వస్తుండగా, ఫిబ్రవరిలో ఎక్కువ శాతం తగ్గినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీల్లోకి నిధుల రాక రూ.1,00,102 కోట్లుగా ఉంది. కానీ, ఇదే కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు రూ.27,500 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో దేశీయ ఈక్విటీ నిధుల రాక కొనసాగుతుందా? అన్నది చూడాల్సి ఉందంటున్నారు విశ్లేషకులు. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి తాజా నిధుల రాక తగ్గగా, అదే సమయంలో సిప్‌ సాధనాలను పెద్దగా రద్దు చేసుకున్న దాఖలాలు కూడా లేవంటున్నారు. ఎన్నికల్లో అస్పష్ట తీర్పు వస్తే... నిధుల రాకపై స్పష్టత వస్తుందంటున్నారు. 

 

ఈక్విటీ ఫండ్స్‌లోకి నెలవారీగా నిధుల రాకను పరిశీలిస్తే... 2018 జనవరిలో రూ.15,390 కోట్లు, ఫిబ్రవరిలో 16,268 కోట్లు, మార్చిలో రూ.6,657 కోట్లు, ఏప్రిల్‌లో రూ.11,171 కోట్లు, మేలో రూ.11,350 కోట్లు, జూన్‌లో రూ.9,660 కోట్లు, జూలైలో రూ.9,452 కోట్లు, ఆగస్ట్‌లో రూ.8,375 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.11,172 కోట్లు, అక్టోబర్‌లో రూ.12,622 కోట్లు, నవంబర్‌లో రూ.8,414 కోట్లు, డిసెంబర్‌లో రూ.6,606 కోట్లు, 2019 జనవరిలో రూ.6,158 కోట్లు, ఫిబ్రవరిలో రూ.5,122 కోట్ల మేర నికరంగా పెట్టుబడులు వచ్చాయి. 



You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు డౌన్‌

Monday 11th March 2019

ఆసియా మార్కెట్ల మిశ్రమ ట్రేడింగ్‌ నడుమ భారత్‌ సూచీలు శుక్రవారం నెగిటివ్‌గా ప్రారభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 33 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45 గంటలకు 11,043 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,076 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం రాత్రి అమెరికా, యూరప్‌ సూచీలు స్వల్పంగా క్షీణించాయి. తాజాగా ఆసియాలో కొరియా, సింగపూర్‌

ఎన్నికల ముందస్తు ర్యాలీ... కొనుగోళ్లకు అవకాశం

Monday 11th March 2019

నిఫ్టీ గత వారం మంచి ర్యాలీ చేసింది. వారాంతంలో 11,000 పైన క్లోజయింది. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ అప్‌ట్రెండ్‌ను కొనసాగించాయి. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్‌, డెరివేటివ్స్‌ విభాగంలో నికర కొనుగోలుదారులుగా మారారు. అదే సమయంలో దేశీయ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (డీఐఐ), నికర విక్రయాలవైపునకు మళ్లారు. గరిష్ట స్థాయిలకు చేరడంతో లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ వాయుదాడులకు దిగిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వమే తిరిగి

Most from this category