News


ఇన్ఫీభీమ్‌ 58శాతం క్రాష్‌

Friday 28th September 2018
Markets_main1538112689.png-20671

సాఫ్ట్‌వేర్‌ రంగంలో సేవలను అందించే ఇన్ఫీభీమ్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 58శాతం క్షీణించింది. నేడు ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫీభీమ్‌ షేరు రూ. 180.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే షేరు కౌంటర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఈ షేరు ఏకంగా 58శాతం నష్టపోయి రూ.83.65ల వద్దకు పతనమైంది. ఉదయం 10:20లకు షేరు గతముగింపు(రూ.200.35)తో పోలిస్తే 55శాతం నష్టంతో రూ.89.35ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ధర షేరుకు ఏడాది కనిష్టస్థాయి. ఈ క్రమంలో 5.73కోట్ల పరిమాణం గల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.83.65, రూ.242.70లుగా నమోదయ్యాయి. మిడ్‌-స్మాల్‌ క్యాప్‌ షేర్ల పతనంలో భాగంగా షేరు నష్టాల బాట పట్టిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ కంపెనీ సబ్సీడరీ నుంచి రుణం తీసుకుందనే వార్తలు మార్కెట్లో ప్రచారం సాగుతున్నాయి. సెప్టెంబర్‌ 8న కంపెనీ వార్షిక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ స్టాక్‌ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది.You may be interested

ఇర్కాన్‌ నష్టాల లిస్టింగ్‌..!

Friday 28th September 2018

ముంబై:- కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌  షేర్లు శుక్రవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అంతంత మాత్రంగానే లిస్ట్‌ అయ్యాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ.475లతో పోలిస్తే బీఎస్‌ఈలో 13శాతం(రూ.65లు) నష్టంతో 410.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఉదయం గం.11:00ని.లకు షేరు 6శాతం నష్టంతో రూ.448.45ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ట్రేడింగ్‌లో రూ. 410.30లు, రూ.464.40ల కనిష్ట, గరిష్ట ధరలను నమోదు చేసింది.

ఆరువారాల కనిష్ట ధర వద్ద పసిడి

Friday 28th September 2018

అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర ఆరువారాల కనిష్టస్థాయి వద్ద ట్రేడ్‌ అవుతోంది. గతరాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ ఇండెక్స్‌ అనూహ్యంగా పుంజుకోవడంతో అక్కడి మార్కెట్లో ఔన్స్‌ పసిడి 13 డాలర్లు క్షీణించి 1187.20 వద్ద ముగిసింది. ఈ ధర పసిడికి ఆరువారాల కనిష్టస్థాయి. గతరాత్రి నష్టాల ముగింపును అందుకున్న పసిడి ధర నేటి ఆసియా ట్రేడింగ్‌లోనూ నష్టాల్లోనే ట్రేడ్‌ అవుతోంది. భారత వర్తమానకాలం ప్రకారం ఉదయం గం.10:00లకు ఔన్స్‌

Most from this category