STOCKS

News


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 9 శాతం క్రాష్‌

Monday 22nd October 2018
Markets_main1540199776.png-21363

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సోమవారం 9 శాతం పతనమై 15 నెలల కనిష్టస్థాయి రూ. 1,535 వద్దకు పడిపోయింది. అక్టోబర్‌ 15న ఆర్థిక ఫలితాలు ఈ బ్యాంక్‌ ఫలితాలు వెల్లడికాగా, ఈ షేరు క్షీణించడం వరుసగా ఇది ఐదవరోజు. ఈ షేరు పతనానికి ప్రత్యేక కారణాలేవీ తెలియరాలేదని, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఫలితంగానే క్షీణించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక దశలో 25,400 పాయింట్ల స్థాయివరకూ పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ...మధ్యాహ్నం 2.30 గంటల సమయానికి ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ పతనం కారణంగా 25,150 పాయింట్ల దిగువకు తగ్గింది. 
 



You may be interested

బడా బ్యాంకులపై మోర్గాన్‌ స్టాన్లీ మక్కువ

Monday 22nd October 2018

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో చోటు చేసుకుంటున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులను నమ్ముకోవడం ఉత్తమం అని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. వడ్డీరేట్ల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సునామీ.. విత్త సంస్థలను ఇక్కట్లు పెడుతున్నాయి. వడ్డీరేట్ల పెరిగే తరుణంలో బలమైన లిక్విడిటీ ఉన్న బ్యాంకులే బాగుంటాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. రేట్ల పెరుగుదల తరుణంలోనే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తదితర ఎన్‌బీఎఫ్‌సీలు సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం వల్ల బడా

దీర్ఘ, మధ్యకాలిక దృష్టితోనే మార్కెట్‌ పెట్టుబడులు చేయాలి

Monday 22nd October 2018

మార్జిన్లపై ఒత్తిడి, వృద్ధి రేటు మందగమనం వంటి అంశాల ప్రభావం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలపై కొట్టిచ్చినట్లు కనిపిస్తుందని సార్థీ గ్రూప్‌ ఎండీ, సీఐవో కుంజ్‌ బన్సాల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ వారంలో చాలా కంపెనీలు క్యూ2 ఎర్నింగ్స్‌ను ప్రకటించనున్నాయని, ఇందులో కొన్ని పాజిటివ్‌గా, మరికొన్ని నెగటివ్‌గా ఆశ్చర్యానికి గురిచేయవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుత స్థూల ఆర్థికాంశాల నేపథ్యంలో పాజిటివ్‌ కన్నా

Most from this category