STOCKS

News


ఇండిగో మరో 7 శాతం క్రాష్‌

Thursday 11th July 2019
Markets_main1562821354.png-26969

ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు వరుసగా రెండవ రోజు కూడా నష్టాల్లో ట్రేడవుతోంది. క్రితం రోజు భారీగా నష్టపోయిన ఈ షేరు గురువారం(జులై 11) ట్రేడింగ్‌లో 7.57 శాతం నష్టపోయి రూ.1,294.40 కు పడిపోయింది. ఇండిగో ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేష్‌ గంగ్వాల్‌ మధ్య వివాదం సెబీ వరకు వెళ్లడంతో బుధవారం(జులై 10) ట్రేడింగ్‌లో ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ షేరు విలువ 17 శాతం నష్టపోయిన విషయం తెలిసినదే. ఇండిగో సంస్థలో కార్పోరేట్‌ పాలన నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని, ఇండిగో నుంచి భాటియా ఐజీఈ గ్రూప్‌లోని ఇతర యూనిట్లకు అక్రమ లావాదేవిలు జరుగుతున్నాయని గంగ్వాల్‌ సెబీకి జులై 9న లేఖ రాశారు. గంగ్వాల్‌ రాసిన లేఖకు ప్రతి స్పందించాలని ఇండిగో బోర్డు డైరక్టర్లను సెబీ ఆదేశించింది. జులై 19 వరకు గడువును నిర్దేశించింది. ‘ఇండిగో ప్రమోటర్ల వివాదానికి ఇప్పటిలో పరిష్కారం దొరుకుతుందని అనుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితిలో ఈ షేరు బలహీనపడే అవకాశం ఉంది’ అని పెట్టుబడి సంస్థ సిటీ సెల్‌ కాల్‌ను పునరుద్ఘాటించింది.  ఈ వివాదం ముగిసే వరకు ఇండిగో షేరు దూరంగా ఉండాలని కార్నెలిన్‌ క్యాపిటల్‌ అడ్వజర్స్‌ ఎల్‌ఎల్‌పీ పౌండర్‌ వికాశ్‌ ఖెమనీ ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. 

ఆర్‌పీటీలే వివాదానికి కారణం..
 ఇంటర్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌లో రాకేష్‌ గంగ్వాల్‌, శోభా గంగ్వాల్‌కు కలిపి 23.09 శాతం వాటా ఉంది. శోభ గంగ్వాల్‌, జేపీ మోర్గాన్‌ ట్రస్ట్‌ కంపెనీలు ట్రస్టీలుగా ఉన్న చింకెర్‌పూ ఫ్యామిలీ ట్రస్ట్‌కు 13.60 శాతం వాటా ఉంది. ఇండిగో కంపెనీ నుంచి ఐజీఈ గ్రూప్‌ ఇతర యూనిట్లకు జరుగుతున్న సంబంధిత పార్టీ లావాదేవీల(ఆర్‌పీటీ)పై ఈ ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది.  షేరు హోల్డర్ల ఎగ్రిమెంట్‌ ద్వారా భాటియాకు అసాధరణ అధికారాలు కట్టబెట్టారని ఫలితంగా మైనార్టీ వాటా గల ఐజీఈ గ్రూప్‌ ఇండిగో నిర్ణయాలపై ప్రభావం చూపుతుందని సెబీకి రాసిన లేఖలో గంగ్వాల్‌ పేర్కొన్నారు. ‘ నేను గత కొన్నేళ్ల నుంచి గమనించలేదు.   ఇండిగోతో ఇతర యూనిట్లు ఆర్‌పీటీలు చేసుకునే విధంగా భాటియా ఒక వాతవరణాన్ని సృస్టించారు. ఆర్‌పీటీలపై సరియైన  తనిఖీలు జరిగినంత కాలం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని గంగ్వాల్‌ లేఖలో పేర్కొన్కారు. 

13 ఏళ్లగా అభ్యంతరాలు లేవు
      అసలు పరికరాల తయారీదారుల(ఓఈఎం) అగ్రిమెంట్‌పై ఇతర అవకాశాలను కంపెనీ పరిశీలిస్తుంటే గంగ్వాల్‌ ఈగో దెబ్బతిందని జూన్‌ 12న రాసిన లేఖలో భాటీయా తెలిపిన విషయం తెలిసిందే. ‘షేరు హో‍ల్డర్ల ఎగ్రిమెంట్‌, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోషియేషన్‌ ఏర్పాటు చేసిన భాద్యతలను స్వికరించడానికి గంగ్వాల్‌ భయపడుతున్నాడు. అంతే కాకుండా ఐజీఈ గ్రూప్‌ అధికారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు’ అని లేఖలో వివరించారు. ‘గత 13 ఏళ్ల నుంచి జరుగుతున్న సంబంధిత పార్టీ లావాదేవీలపై గంగ్వాల్‌ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఏడాదికేడాది వార్షిక ఖాతా ప్రకటనలపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా అనుమతులను ఇచ్చేవాడు’ అని ఆరోపించారు. 
    ఇంటర్‌ గ్లోబ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ గ్రూప్‌లో ఏవియేషన్‌ రంగంలో ఇండిగో ఒక సంస్థ మాత్రమే. దీనితో పాటు ఈ గ్రూప్‌కు హాస్పిటాలిటీ, ఎయిర్‌ లైన్‌ మానెజ్‌మెంట్‌, ట్రావెల్‌ కామర్స్‌, అడ్వాన్స్‌డ్‌ పైలేట్‌ ట్రైనింగ్‌, ఎయిర్‌ క్రాప్ట్‌ నిర్వహణ ఇంజనీరింగ్‌ , రియల్‌ ఎస్టెట్‌ విభాగాలలో కంపెనీలున్నాయి. 
    



You may be interested

ఎఫ్‌పీఐలు కార్పొరేట్లలా మారొచ్చు!!

Thursday 11th July 2019

చెల్లించే స్థోమత ఉంది కనకే వారిపై పన్నుభారం ‘సర్‌చార్జీ’పై సీబీడీటీ చైర్మన్‌ పీసీ మోడీ వ్యాఖ్య రూ.13.35 లక్షల కోట్ల వసూళ్లను సాధిస్తామని ప్రకటన న్యూఢిల్లీ: ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) మినహాయింపు ఇవ్వటానికి అవకాశం లేదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్‌ పీసీ మోడీ స్పష్టం చేశారు. ఎఫ్‌పీఐలు కావాలనుకున్న పక్షంలో కార్పొరేట్‌ సంస్థగా రిజిస్టర్‌ చేసుకుని, ఆ విభాగంలో ఉన్న తక్కువ రేట్ల

వడ్డీరేటు తగ్గిస్తున్న బ్యాంకులు

Thursday 11th July 2019

ఎస్‌బీఐ రేటు తగ్గించింది!! రుణ రేటు 5 బేసిస్‌ పాయింట్లు తగ్గింపు అదే బాటలో ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ 10 బేసిస్‌ పాయింట్ల రుణ రేటు కోత ఆర్‌బీఐ గవర్నరు పిలుపునకు స్పందన ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అందిస్తున్న రెపో రేటు తగ్గింపు ప్రయోజనాన్ని కస్టమర్లకు వేగంగా బదలాయించాలన్న గవర్నర్‌ శక్తికాంతదాస్‌ ప్రకటనకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) స్పందించాయి. రుణ రేటును స్వల్పంగా

Most from this category