STOCKS

News


నష్టాల్లోకి మళ్ళిన మార్కెట్‌

Thursday 18th April 2019
Markets_main1555562003.png-25200

గురువారం గ్యాప్‌అప్‌తో కొత్త రికార్డుస్థాయిల వద్ద ప్రారంభమైన స్టాక్‌ సూచీలు అరగంటలోనే నష్టాల్లోకి మళ్లాయి. కొద్దిరోజులుగా పెద్ద ర్యాలీ జరిపిన బ్యాంకింగ్‌ షేర్లలో జరుగుతున్న లాభాల స్వీకరణ, మెటల్‌ షేర్లలో అమ్మకాల ఫలితంగా నిఫ్టీ తిరిగి 11,800 పాయింట్ల దిగువకు, సెన్సెక్స్‌ 38,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఈ రోజు ఉదయం నిఫ్టీ 11,856 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 38,420 పాయింట్ల వద్ద కొత్త గరిష్టస్థాయిల్ని నమోదుచేశాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే వెల్లువెత్తిన లాభాల స్వీకరణతో ఉదయం 9.50 గంటలకల్లా నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో 11,867 పాయింట్ల వద్దకు, సెన్సెక్స్‌ సైతం అంతేనష్టపోయి 38,255 పాయింట్ల వద్దకు జారిపోయాయి. ప్రధాన సూచీల నష్టాలకు ముఖ్య కారణమైన బ్యాంక్‌ నిఫ్టీ 100 పాయింట్లకుపైగా క్షీణించి 30,426 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ సూచి ట్రేడింగ్‌ ప్రారంభంలో 30,669 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది. యస్‌బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఎస్‌బీఐలు 2 శాతం వరకూ నష్టపోగా, భారతి ఎయిర్‌టెల్‌ అత్యధికంగా 3.6 శాతం పతనమయ్యింది. మెటల్‌ షేర్లు టాటా స్టీల్‌, హిందాల్కో, వేదాంతలు 2-3 శాతం మధ్య పడిపోయాయి. 



You may be interested

ఈ ఏడాది కనిష్టం వద్ద పసిడి ధర

Thursday 18th April 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం ఈ ఏడాది కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆర్థిక మందగమన ఆందోళన భయాలు తగ్గుముఖం పట్టడం ఇందుకు కారణం. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌సెషన్‌లో ఔన్స్‌ పసిడి 3డాలర్లు నష్టపోయి 1,273 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇటీవల పలు దేశాలు వెల్లడించిన మెరుగైన ఆర్థిక గణాంకాలు అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం పట్టిందనే అంశం స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను

జెట్‌ క్రాష్‌ ల్యాండింగ్‌

Thursday 18th April 2019

అత్యవసర నిధులిచ్చేందుకు బ్యాంకులు నో దీంతో తాత్కాలికంగా విమాన సేవల నిలిపివేత- 20 వేల ఉద్యోగుల భవిష్యత్తు అగమ్యగోచరం- బ్యాంకులు, ప్రయాణికులకు వేల కోట్ల బకాయిలు న్యూఢిల్లీ: ఏవియేషన్‌ రంగంలో కఠిన పరిస్థితులను ప్రతిబింబిస్తూ మరో విమానయాన సంస్థ మూసివేత అంచులకు చేరింది. రుణభారం, నిధుల కొరతతో నాలుగు నెలలుగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కార్యకలాపాలను కొనసాగించేందుకు అత్యవసరంగా కావాల్సిన రూ.

Most from this category