STOCKS

News


స్వల్ప నష్టంతో ప్రారంభం, వెనువెంటనే లాభాల్లోకి

Tuesday 5th February 2019
Markets_main1549339738.png-24014

మంగళవారం స్వల్పనష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ సూచీలు వెనువెంటనే లాభాల్లోకి మళ్లాయి. 36,578 పాయింట్ల వద్ద స్వల్పనష్టం‍తో మొదలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ వెనువెంటనే 45 పాయింట్ల లాభంతో 36,650 గరిష్టస్థాయికి చేరింది. అలాగే 4 పాయింట్ల నష్టంతో 10,908 పాయింట్ల వద్ద మొదలైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కొద్ది నిముషాల్లోనే 16 పాయింట్ల లాభంతో 10,928 పాయింట్ల వద్దకు చేరింది. హీరో మోటో, డాక్టర్‌ రెడ్డీస్‌, యూపీఎల్‌, మహింద్రా, పవర్‌గ్రిడ్‌లు 1 శాతంపైగా లాభాలతో ప్రారంభంకాగా,భారతి ఎయిర్‌టెల్‌ 3.5 శాతం నష్టంతో రూ. 296 వద్ద ప్రారంభమైంది. ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, టాటా స్టీల్‌లు సైతం 1 శాతం నష్టంతో ప్రారంభమయ్యాయి. 



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 5th February 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు కోల్‌ ఇండియా:- రూ.1050 కోట్ల విలువైన నిధుల సమీకరణకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రణాళికలో భాగంగా కంపెనీ ప్రతి షేరు ధర రూ.235 చొప్పున మొత్తం 4.46లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుంది. ఫ్యూచర్‌ రిటైల్‌:- ప్రమోటర్‌ గ్రూప్‌ సం‍స్థ ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు ఈక్విటీ షేర్లను జారీ చేసి రూ.2000 కోట్లను సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ ప్రతి

 ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు అప్‌

Tuesday 5th February 2019

వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బ్రేక్‌వేయడం, అమెరికా ఆర్థిక గణాంకాలు సానుకూలంగా వుండటం తదితర అంశాల నేపథ్యంలో  ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 32 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ మంగళవారం ఉదయం 8.35  గంటలకు 10,969  పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ 10,937 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారం  ఫెడ్‌ నిర్ణయం వెలువడిన తర్వాత

Most from this category