STOCKS

News


పాజిటివ్‌ ప్రారంభం

Friday 22nd March 2019
Markets_main1553226236.png-24741

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పూర్తిగా సరళతర విధానాన్ని అనుసరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో  నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ  భారత్‌ సూచీలు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 65 పాయింట్ల లాభంతో 38,452 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల పెరుగుదలతో 11,549 పాయింట్ల వద్ద మొదలయ్యింది.   ఈ ఏడాది రేట్ల పెంపు వుండబోదని ఫెడ్‌ బుధవారంనాటి సమీక్ష అనంతరం సంకేతాలు అందించడంతో పాటు ప్రస్తుత ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లను యథాతథంగా అట్టిపెట్టింది. అలాగే బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి నిధుల్ని ఉపసంహరించే ప్రక్రియను ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి నిలిపివేయనున్నట్లు ఫెడ్‌ తెలిపింది. హోలీ పండుగ సందర్భంగా గురువారం మన మార్కెట్లకు సెలవుకాగా, ఫెడ్‌ నిర్ణయానికి ఇతర ప్రపంచ మార్కెట్లకంటే ఒకరోజు ఆలస్యంగా ఇక్కడి ఇన్వెస్టర్ల స్పందిస్తున్నారు. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, భారతి ఎయిర్‌టెల్‌, జీ లిమిటెడ్‌లు స్వల్పలాభాలతోనూ, మారుతి, హింద్‌పెట్రో, టీసీఎస్‌, వేదాంతలు స్వల్ప నష్టాలతోనూ మొదలయ్యాయి.

లాభనష్టాల నడుమ ఆసియా సూచీలు...

ఫెడ్‌ ప్రకటన అనంతరం బుధవారం క్షీణించిన అమెరికా సూచీలు గురువారం తిరిగి పెరిగాయి.  అయితే అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై నీలినీడలు కమ్ముకోవడంతో ఆసియా సూచీలు తాజాగా లాభనష్టాల మధ్య కదులుతున్నాయి. జపాన్‌ నికాయ్‌, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌, చైనా షాంఘైలు తొలుత పాజిటివ్‌గా ప్రారంభమైనప్పటికీ, ఉదయం 8.40 గంటలకు అరశాతం వరకూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్‌, తైవాన్‌ సూచీలు స్వల్పలాభాలతో ట్రేడవుతున్నాయి. 



You may be interested

శుక్రవారం వార్తల్లోని షేర్లు

Friday 22nd March 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా శుక్రవారం ప్రభావిత‌య్యే షేర్ల వివ‌రాలు ది ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా:‍ ‍‍‍- కంపెనీ  అనుబంధ సంస్థ  ఐటిఐ రీ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్ త‌న షేరు హోల్డర్ల నుంచి రూ.10లు ముఖ విలువ క‌లిగిన 5.43ల‌క్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది.  మైండ్ ట్రీ:- షేర్ల బై బ్యాక్ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఈ నెల 26న మరోసారి బోర్డు సమావేశాన్ని జరపనున్నట్లు కంపెనీ అధికారులు ప్రకటించారు.   పిర‌మిల్

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Friday 22nd March 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ పూర్తిగా సరళతర విధానాన్ని అనుసరిస్తున్నట్లు చేసిన ప్రకటన నేపథ్యంలో  నేపథ్యంలో ఆసియా మార్కెట్లు స్వల్ప లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న నడుమ  భారత్‌ సూచీలు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది.  ఈ ఉదయం ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 25 పాయింట్లు పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.45  గంటలకు 11,578  పాయింట్ల వద్ద కదులుతోంది.బుధవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,553  పాయింట్ల వద్ద

Most from this category