STOCKS

News


తొమ్మిది రోజుల నష్టాలకు బ్రేక్‌

Tuesday 14th May 2019
Markets_main1557829494.png-25737

  • 227 పాయింట్లు పెరిగి సెన్సెక్స్‌
  • 11200లపై ముగిసిన నిఫ్టీ

మార్కెట్‌ తొమ్మిదో రోజుల వరుస నష్టాలకు మంగళవారం ముగింపు పడింది. సెన్సెక్స్‌ 227 పాయింట్లు లాభపడి 37,318 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 74 పాయింట్లు పెరిగి 11200ల పైన 11,222 వద్ద ముగిసింది. గత తొమ్మిది ట్రేడింగ్‌ సెషన్స్‌లో సూచీల వరుస పతనం కారణంగా అధిక షేర్లు ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తుండంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గచూపారు. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 18పైసలు రికవరి కావడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది.  అన్ని రంగాల షేర్లలో విరివిరిగా కొనుగోళ్లు జరిగాయి.  ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, ఫార్మా షేర్లలలో ర్యాలీ అధికంగా జరిగింది. అయితే రూపాయి రివకరితో ఐటీ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌(169 పాయింట్లు)​ అరశాతం లాభంతో 28,865.50 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 36,956 - 37,573 స్థాయిలోనూ, నిఫ్టీ 11,108  - 11,294 శ్రేణిలో కదలాడాయి. 
గెయిల్‌, వేదాంత, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 4శాతం నుంచి 6.50శాతం లాభపడ్డాయి. విప్రో, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, బజాజ్‌ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు 1.50శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. 



You may be interested

అస్థిరతల సమయాల్లో నమ్ముకోతగ్గ స్టాక్స్‌!

Tuesday 14th May 2019

ఎన్నికల ఫలితాలకు సమయం ఆసన్నం కావడంతో మే ఆరంభం నుంచి విదేశీ ఇన్వె‍స్టర్లు అమ్మకాలు చేస్తున్నారు. అమెరికా-చైనా మధ్య తాజాగా టారిఫ్‌ల యుద్ధం ఆరంభం కావడం కూడా నష్టాలు, అస్థిరతలు పెరిగిపోవడానికి కారణమయ్యాయి. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత ఆటుపోట్లు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ మంది అనలిస్టుల సిఫారసుల ఆధారంగా అస్థిరతల సమయంలో పెట్టుబడులకు పరిశీలించ తగిన స్టాక్స్‌ వివరాలు ఇవి.    డీబీకార్ప్‌ 12 రాష్ట్రాల్లో వార్తా పత్రికల మాధ్యమంలో

ఫలితాల వేళ ఎలా ట్రేడ్‌ చేయాలి?

Tuesday 14th May 2019

ఎడెల్‌వీజ్‌ సలహాలు దేశీయ సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుతున్నాయి. మరికొద్ది రోజుల్లో ఫలితాలు వస్తాయి. తొలుత స్థిర ప్రభుత్వం వస్తుందన్న అంచనాలతో జోరు చూపిన మార్కెట్లు ప్రస్తుతం అస్థిర ప్రభుత్వ భయాలతో పతనమవుతున్నాయి. ముఖ్యంగా ఎన్‌డీఏ, యూపీఏలకు పూర్తి మెజార్టీ రాక, ఇతర పక్షాలపై ఆధారపడాల్సిన అవసరం వస్తుందన్న భయాలు మార్కెట్‌ను కుంగదీస్తున్నాయి. ఫలితాల సమయంలో ఈ భయాలు బాగా పెరిగిపోతాయి. ఫలితాల రోజున సూచీల్లో తీవ్ర కదలికలు నమోదవుతుంటాయి. ఈ

Most from this category