STOCKS

News


4రోజుల నష్టాలకు బ్రేక్‌

Tuesday 18th June 2019
Markets_main1560853851.png-26390

  • 39000 పైన ముగిసిన సెన్సెక్స్‌
  • రాణించిన మెటల్‌, ఐటీ షేర్లు

మార్కెట్‌ నాలుగు రోజుల నష్టాల నుంచి తేరుకుంది. మెటల్‌, ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో మంగళవారం సూచీలు లాభాలతో ముగిశాయి. సెనెక్స్‌ 85 పాయింట్లు లాభపడి 39000 మార్కును దాటి 39046 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఇండెక్స్‌ 19 పాయింట్లు పెరిగి 11691 వద్ద ముగిసింది. ఫార్మా, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, అటో రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 77 పాయింట్లు పెరిగి 30,351.00 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు, క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడం, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి స్థిరమైన ర్యాలీ దేశీయ మార్కెట్‌కు అండగా నిలిచాయి. సెన్సెక్స్‌ 207 పాయింట్లు పెరిగి 39,167.83 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 11,727.20 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ సమీక్షా సమావేశాలు నేటి నుంచి రెండురోజుల పాటు జరగునున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో మిడ్‌సెషన్‌ అనంతరం మార్కెట్లో స్వల్పంగా అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలో ఉదయం ట్రేడింగ్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ అందుకున్న 11700 స్థాయిని కోల్పోయింది. 

పవర్‌గ్రిడ్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, వేదాంత లిమిటెడ్ షేర్లు 2శాతం నుంచి 2.50శాతం లాభపడగా, సన్‌ఫార్మా, ఏషియన్‌ పేయింట్స్‌, హిందాల్కో, యస్‌ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 7.50శాతం నష్టపోయింది. 



You may be interested

మేలో ఎంఎఫ్‌లు కొన్న టాప్‌10 స్టాకులివే!

Tuesday 18th June 2019

మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్ల పర్యవేక్షణలోని ఏయూఎంల విలువ మేలో రూ. 25.94 లక్షల కోట్లకు ఎగబాకింది. ఏయూఎంల్లో డొమెస్టిక్‌ సైక్లిక్స్‌ వెయిటేజ్‌ పదేళ్ల గరిష్ఠం 62.9 శాతానికి చేరింది. టెలికం, రియల్టీ, పీఎస్‌యూబ్యాంకుల వాల్యూ ఏప్రిల్‌తో పోలిస్తే మెరుగైంది. మరోవైపు మీడియా, హెల్త్‌కేర్‌, మెటల్స్‌, ఆటో, టెక్నాలజీ, కన్జూమర్‌రంగాలలోకి పెట్టుబడులు సన్నగిల్లాయి. నిఫ్టీలోని 58 శాతం స్టాకుల్లో ఎంఎఫ్‌లు నికర కొనుగోలుదారులుగా ఉన్నాయి. మేనెల్లో ఎంఎఫ్‌లు కొనుగోలు చేసిన టాప్‌టెన్‌

99 స్టాకుల్లో ఎంఏసీడీ బేరిష్‌

Tuesday 18th June 2019

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.   ఇవి బేరిష్‌ దేశీయ

Most from this category