STOCKS

News


11500దిగువకు నిఫ్టీ

Friday 22nd March 2019
Markets_main1553236558.png-24746

మార్కెట్లో ఒక్కసారిగా లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. ఫలితంగా సెన్సెక్స్‌ 300 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 11500 మార్కును కోల్పోయింది. ముఖ్యంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఇంధన, అటో, బ్యాంకింగ్‌ షేర్లు ఎక్కువడగా అ‍మ్మకాలు ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. నేటి మార్కెట్‌ సెన్సెక్స్‌ 65 పాయింట్ల లాభంతో 38,452 వద్ద,  నిఫ్టీ 28 పాయింట్ల పెరుగుదలతో  11,549 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ గత ముగింపు(38,386)తో పోలిస్తే 178 పాయింట్లు లాభపడి 38,564.71 వద్ద, నిఫ్టీ 52 పాయింట్లు పెరిగి 11,572.80 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే, సూచీలు వరుసగా ఎనిమిది రోజుల ర్యాలీ చేసిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో సూచీలు గరిష్టస్థాయిల నుంచి వెనక్కి వచ్చారు. సెన్సెక్స్‌ సూచీ నేటి ఇంట్రాడే గరిష్టస్థాయి (38,564.71) నుంచి 300 పాయింట్ల నుంచి 38,260 కనిష్టానికి చేరుకుంది. నిఫ్టీ సూచీ సైతం నేటి గరిష్ట స్థాయి( 11,572) నుంచి 91 పాయింట్లు 11,481.90 వద్ద పతనమైంది. మార్కెట్లో నెలకొన్న సానుకూల వాతావరణం సూచీల రికవరీ తోడ్పాటును అందించాయి. ఫలితంగా ఉదయం గం.11:30ని.లకు నిఫ్టీ 22 పాయింట్లు నష్టంతో 11,498 వద్ద, సెన్సెక్స్‌ 103 పాయింట్లు నష్టంతో 38,283 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

జపాన్‌ టు ఇండియా!

Friday 22nd March 2019

వయా కమర్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌  మిట్సుబిషి, సుమిటోమి, మిట్సుయి ఎంట్రీ  వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిర్వహణ కూడా  స్థానిక నిర్మాణ సంస్థలతో చర్చలు; జాబితాలో ఎంబసీ గ్రూప్‌  హైదరాబాద్‌తో సహా ఇతర మెట్రో నగరాలపై దృష్టి హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశంలో రియల్‌ ఎస్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ (రీట్స్‌) ఎంట్రీ, సక్సెస్‌తో విదేశీ కంపెనీల్లో ఉత్సాహం నెలకొంది. వాణిజ్య స్థిరాస్తి రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు పలు విదేశీ కంపెనీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే భారత స్థిరాస్తి

రెండేళ్ల గరిష్ఠానికి ఎఫ్‌ఐఐ నెలవారీ కొనుగోళ్లు

Friday 22nd March 2019

దేశీయ మార్కెట్లపై విదేశీ సంస్థాగత మదుపరులకు ఒక్కమాటుగా మక్కువ పెరిగిపోయింది. దీంతో మార్చిలో సూచీలు చెలరేగిపోయాయి. సుస్థిర ప్రభుత్వంపై ఆశలు, కేంద్రబ్యాంకు సరళీకృత ధృక్పథం.. మార్కెట్‌పై ఎఫ్‌పీఐలను పాజిటివ్‌గా మార్చాయి. దీంతో అటు క్యాష్‌ ఇటు డెరివేటివ్స్‌ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు ఇబ్బడిముబ్బడిగా కొనుగోళ్లు జరుపుతున్నాయి. మార్చిలో ఇంతవరకు ఎఫ్‌ఐఐలు 27వేల కోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపాయి. ఒకనెల్లో ఇంతమొత్తంలో ఎఫ్‌ఐఐలు దేశీ మార్కెట్లో కొనుగోళ్లు జరపడం రెండేళ్ల తర్వాత ఇదే

Most from this category