STOCKS

News


ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Tuesday 27th November 2018
Markets_main1543291895.png-22398

ఆసియా మార్కెట్ల నుంచి అందిన మిశ్రమ సంకేతాలతో మంగళవారం మార్కెట్‌ ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంలో 35,394 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7పాయింట్ల స్వల్ప నష్టంతో 10,621.45 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించాయి. చైనా దిగుమతులపై మరిన్ని పన్నులు విధించేందుకు అమెరికా అధ్యక్షుడు ఈదేశ పాలనావ్యవస్థతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనే వార్తలతో మంగళవారం ఆసియాలో పలు మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మరోవైపు దేశీయ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రూపాయి ఫ్లాట్‌గా ఓపెనింగ్‌ కూడా సూచీల మిశ్రమ ప్రారంభానికి కారణమైంది. ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 22 పాయింట్ల నష్టంతో 35,331 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,623 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఐటీ, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌, రియల్టీరంగాలకు చెందిన షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. మెటల్‌ షేర్లు పతనం నేటి ట్రేడింగ్‌లో కూడా కొనసాగుతోంది. అలాగే అటో, ఆర్థిక, ఎఫ్‌ఎంజీసీ రంగాలకు చెంది షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.
హిందూస్థాన్‌యూనిలివర్‌, హీరోమోటోకార్ప్‌, ఏషియన్‌పేయింట్స్‌, బజాజ్‌అటో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు 1నుంచి 3శాతం నష్టపోగా, గ్రాసీం, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, యస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు 1నుంచి 2.50శాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

స్వల్ప నష్టంతో ప్రారంభమైన రూపాయి

Tuesday 27th November 2018

ఇంట్రాడే కనిష్టస్థాయి 71.01 ముంబై: డాలర్‌తో రూపాయి మారకం విలువ మంగళవారం ట్రేడింగ్‌ ప్రారంభ సమయంలో 0.18 శాతం నష్టపోయింది. ఇంటర్‌ బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో 70.87 దగ్గర ప్రారంభమయ్యింది. ఇంట్రాడేలో 71.01 కనిష్టస్థాయిని నమోదుచేసింది. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని కొనసాగించేందుకు అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించిన కారణంగా ఆసియా దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయని ఫారెక్స్‌ మార్కెట్‌ నిపుణులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే రూపాయి

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 27th November 2018

వివిధ వార్తలను అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇవి..! సన్‌ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌:- జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీ కొనుగోలు చేస్తున్నట్లు సన్‌ఫార్మా సోమవారం ప్రకటించింది. పోలా ఫార్మా జపాన్‌లో చర్మసంబంధిత వ్యాధుల జనరికల్‌ ఔషధాలను తయారు చేస్తుంది. ఈ కొనుగోలుతో పోలా ఫార్మాకు చెందిన రెండు మానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లు సన్‌ఫార్మా చేతికి దక్కనున్నాయి. ఈ డీల్‌ విలువ భారత కరెన్సీలో సుమారు రూ.7.7 కోట్లు. పోలా ఫార్మాను చేజిక్కుంచుకోవడంతో

Most from this category