STOCKS

News


కనిష్టస్థాయి నుంచి రికవరీ

Thursday 11th October 2018
Markets_main1539244467.png-21048

మిడ్‌సెషన్‌ సమయానికి మార్కెట్‌లో అమ్మకాల సునామీ తగ్గడంతో సూచీలు కనిష్టస్థాయి నుంచి రికవరీ బాట పట్టాయి. సెన్సెక్స్‌ సూచీ ఇంట్రాడే కనిష్టస్థాయి(33,723)నుంచి 548 పాయింట్లు కోలుకుని 34,270 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ సూచీ కనిష్టస్థాయి(10,138.60)నుంచి 183 పాయింట్లు రికవరీ అయ్యి 10,321.25 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ కనిష్టస్థాయి (24,494) నుంచి 392 పాయింట్లు లాభపడి 24886 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేరైన ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐఓసీ షేర్లతో పాటు యస్‌ బ్యాంక్‌ షేరు లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. వాల్‌స్ట్రీట్‌లో బుధవారం రాత్రి రాజుకున్న అమ్మకాల మంటలు గురువారం మన మార్కెట్‌ను తాకాయి. ఫలితంగా మనదేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు భారీ గ్యాప్‌ డౌన్‌తో ప్రారంభంమయ్యాయి. దీనికి తోడు నేటి ఇంట్రాడే ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కొత్త కనిష్టానికి పతనమవ్వడంతో మన మార్కెట్‌ భారీగా నష్టపోయింది. సెన్సెక్స్‌ సూచీ ఇంట్రాడేలో 1038 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ సూచీ 322 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 828 పాయింట్లను క్షీణించింది.



You may be interested

9900 పాయింట్ల వద్ద కీలక మద్దతు

Thursday 11th October 2018

10550 పాయింట్ల వద్ద నిరోధం నిఫ్టీకి దిగువన 9900- 9950 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉందని బొనాంజ సెక్యూరిటీస్‌ తెలిపింది. ప్రస్తుతం నిఫ్టీ కన్సాలిడేషన్‌ మూడ్‌లో ఉందని అభిప్రాయపడింది. 10200- 10550 పాయింట్ల మధ్యనే నిఫ్టీ తిరగాడవచ్చని అంచనా వేసింది. దిగువన 10200 పాయింట్లను నిలుపుకోలేకుంటే 9900 పాయింట్ల వరకు దిగజారుతుందని తెలిపింది. కన్సాలిడేషన్‌ రేంజ్‌ను బ్రేక్‌ చేస్తేనే తదుపరి కదలికలు నిర్ధారించుకోవచ్చని తెలిపింది. పైస్థాయిలో 10550 పాయింట్లకు పైన

లాభాల్లో యస్‌ బ్యాంక్‌

Thursday 11th October 2018

మార్కెట్‌ ట్రెండ్‌కు వ్యతిరేకంగా యస్‌ బ్యాంకు షేర్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., గురువారం యస్‌ బ్యాంకు షేర్లు దాదాపు 15శాతం వరకు లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో రూ.225.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. యస్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ పదవి నియామక కమిటి నేడు తొలిసారిగా సమావేశకానుంది. ఈ నేపథ్యంలో షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు ఇంట్రాడేలో 14.69శాతం లాభపడి రూ.268.45లకు చేరుకుంది. ఈ

Most from this category