News


ఆర్‌బీఐ నిర్ణయంపై మార్కెట్‌ నెగిటివ్‌ స్పందన

Thursday 4th April 2019
Markets_main1554360391.png-24969

గురువారం ఆరంభం నుంచి ఫ్లాట్‌గా ఉన్న సూచీలు ఆర్‌బీఐ ప్రకటన తర్వాత నష్టాల్లోకి జారాయి. గురువారం ఎంపీసీ సమావేశానంతరం రిజర్వుబ్యాంక్‌ రెపో రేటును మరో పావుశాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6 శాతానికి దిగివచ్చింది. ఈ నిర్ణయం మార్కెట్‌కు పెద్దగా రుచించినట్లు కనిపించడం లేదు. దీంతో నిఫ్టీ 11620 పాయింట్లకు దిగువన, సెన్సెక్స్‌ 38800 పాయింట్లకు దిగువన ట్రేడవుతున్నాయి.  ఒకదశలో నిఫ్టీ 11600 పాయింట్ల దిగువకు వచ్చి తిరిగి కాస్త కోలుకొని ప్రస్తుతం 11616 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 38784 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇండియా వీఐఎక్స్‌ సూచీ ఒక్కసారిగా దూసుకుపోయి 19 వద్ద కదలాడుతోంది. హెచ్‌సీఎల్‌టెక్‌, ఆర్‌ఐఎల్‌, యస్‌బ్యాంక్‌, గెయిల్‌, బీపీసీఎల్‌ తదితర స్టాకులు నెగిటివ్‌గా ట్రేడవుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ స్పాట్‌ 30వేల పాయింట్ల దిగువన 29973 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. రూపాయి సైతం నెగిటివ్‌గా ట్రేడవుతోంది. 



You may be interested

రూపాయికి నష్టాలు

Thursday 4th April 2019

గురువారం ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ నష్టాల్లోకి జారింది. ఆరంభమే బలహీనంగా 68.56 వద్ద ఓపెనై, క్రమంగా 68.66కు దిగజారింది. అనంతరం కొంత లాభపడి 68.62 వరకు వచ్చినా, ఆర్‌బీఐ ప్రకటనతో తిరిగి మరింత నష్టాల్లోకి జారింది. ఆర్‌బీఐ ఎంపీసీ తాజాగా రెపోరేట్‌ను మరో 25 బీపీఎస్‌ తగ్గించింది. ఈ ప్రకటనతో రూపీ విలువ మరింత పతనమై 68.98కిచేరింది. మధ్యాహ్న సమయానికి 68.97 వద్ద కదలాడుతోంది. బుధవారం ట్రేడింగ్‌లో

రెపో రేటు పావుశాతం కట్‌

Thursday 4th April 2019

సరళ వడ్డీ రేట్ల బాటను కొనసాగిస్తూ రిజర్వుబ్యాంక్‌ రెపో రేటును మరో పావుశాతం తగ్గించింది. దీంతో ఈ రేటు 6 శాతానికి దిగివచ్చింది. రివర్స్‌ రెపో రేటు 5.75 శాతంగా వుంది. వాణిజ్య బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును రెపో రేటుగానూ, ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు వుంచే నిధులకు కేంద్ర బ్యాంక్‌ ఇచ్చే రేటును రివర్స్‌ రెపో రేటుగానూ వ్యవహరిస్తారు. మూడురోజుల పాలసీ సమీక్ష అనంతరం ఆర్‌బీఐ

Most from this category